Skip to main content

సంచలన నిర్ణయం : టాటా కంపెనీలో వీరికి ఉద్యోగాలు

అనితర సాధ్యుడు..ఓటమి ఎరుగని ధీరుడు..రతన్ టాటా పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే కాదు విలువలు, దాతృత్వానికి మారు పేరు.
TATA
TATA

ముఖ్యంగా సందర్భాన్ని బట్టి మానవత్వం ప్రదర్శించడంలో  రతన్‌ టాటాను మించిన వారెవరూ ఉండరేమో. అలాంటి లివింగ్‌ లెజెండ్‌ రతన్‌ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా..
సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ల భవిష్యత్తును తీర్చిదిద్దేంకు కృషి చేస్తున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస‍్తున్నారు. జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాలోని పశ్చిమ బొకారో డివిజన్‌లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఆపరేటర్‌లుగా 14 మంది ట్రాన్స్‌జెండర్లను నియమించారు. ప్రస్తుతం ఈ 14మంది శిక్షణలో ఉన్నారని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మైనింగ్‌ కార‍్యకలాపాల్లో విధులు నిర్వహిస్తారని టాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, అంతకుముందు కంపెనీ 17మంది మహిళలను హెచ్‌ఇఎమ్‌ఎమ్ ఆపరేటర్‌లుగా ఎంపిక చేసింది.   

2025 నాటికి 25 శాతం మందిని..
ఈ సందర్భంగా టాటా స్టీల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆత్రయీ సన్యాల్ మాట్లాడుతూ..ఇదే మాడ్యూల్‌లో పనిచేసేందుకు ఆన్‌బోర్డ్‌లో ఉన్న ట్రాన్స్‌జెండర్లు గనులలో పనిచేయడానికి ముందే సంవత్సరం పాటు శిక్షణ పొందుతారని తెలిపారు. అంతేకాదు ట్రాన్స్‌జెండర్ల వర్క్‌ ఫోర్స్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు, 2025 నాటికి 25 శాతం  ట్రాన్స్‌జెండర్లను ఉద్యోగులుగా నియమించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అత్రయీ సన్యాల్ చెప్పారు. 

Published date : 03 Dec 2021 06:40PM

Photo Stories