Skip to main content

Work From Home: ఉద్యోగుల శాలరీ స్ట్రక్చర్ ఓ కొలిక్కి.. !

దేశంలో వర్క్‌ఫ్రమ్‌ హోం విధానంలో కొనసాగే ఉద్యోగుల జీతభత్యాల రూపకల్పనకు సంబంధించిన కసరత్తులు తుది అంకానికి చేరుకున్నాయి.
Work From Home
Work From Home Rules

ఈ మేరకు కేంద్రం కార్మిక మంత్రిత్వ శాఖ, పరిశ్రమల విభాగం  జరుపుతున్న చర్చలు ‘శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు సమాచారం. 

కొత్త వర్క్‌ మోడల్‌కు..
వర్క్‌ఫ్రమ్‌ హోంలో కొనసాగే ఉద్యోగులకు బేసిక్‌ శాలరీ, హైకులు, బోనస్‌ల నిర్ణయాలు పూర్తిగా కంపెనీవే. తాజాగా ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కేంద్రం, కంపెనీల ప్రతినిధుల మధ్య చర్చలు నడిచాయి. కొత్త వర్క్‌ మోడల్‌కు సరిపోయేలా ఒక లీగల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే క్రమంలోనే ఇలా పారిశ్రామిక ప్రతినిధులతో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వరుస భేటీలు నిర్వహిస్తోందని  ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. 

హెచ్‌ఆర్‌ఏ మీదే..

Work


వర్క్‌ఫ్రమ్‌ హోం ఎఫెక్ట్‌తో సొంతూళ్లకే పరిమితమైన ఉద్యోగుల కారణంగా  ఇంటి అద్దె భత్యంలో తగ్గింపు, వైఫై-కరెంట్‌ బిల్లులపై రీయంబర్స్‌మెంట్‌ను ప్రవేశపెట్టడం గురించి తాజా భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అయితే House Rent Allowance శాతం తగ్గించడంపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని, మరో భేటీలో ఈ అంశంపై స్పష్టత రావొచ్చని చెప్తున్నారు. ఆపై సిద్ధం చేసిన డ్రాఫ్ట్‌ను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. తద్వారా ట్యాక్స్‌ చట్టాలకు అవసరమైన సవరణలకు లైన్‌ క్లియర్‌ అవుతుంది. ఈ మేరకు బడ్జెట్‌-2022లో ఈ విషయాల్ని పొందుపరుస్తారనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. అంత సమయం లేకపోవడంతో జరిగేది కష్టమేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
 
వర్క్‌ఫ్రమ్‌ హోం విధి విధానాలపై...

Work


ఇదిలా ఉంటే జనవరి 13న భారత్‌కు చెందిన కొన్ని కంపెనీల హెచ్‌ఆర్‌ హెడ్స్‌, సీఈవోలతో కార్మిక మంతత్రిత్వ శాఖ భేటీ జరిపింది. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో..  ఉపాధి కల్పనను పెంపొందించడం,  శ్రామిక శక్తి యొక్క భవిష్యత్తు నైపుణ్యాన్ని పెంపొందించడం, ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు వర్క్‌ఫ్రమ్‌ హోం విధి విధానాలపై చర్చ జరిగిందని సమాచారం. యజమానులు- ఉద్యోగుల మధ్య వివాదాల పరిష్కారం, ఏర్పడబోయే ఇబ్బందుల్ని తొలగించడానికి  వర్క్‌ ఫ్రమ్ హోమ్ మోడల్ కోసం ‘‘సమగ్ర’’ నియమాలు, నిబంధనలను రూపొందించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

అన్ని రంగాలకు.. 
గత ఏడాది జనవరిలో ప్రభుత్వం స్టాండింగ్ ఆర్డర్ ద్వారా సర్వీస్‌సెక్టార్‌కి ఇంటి నుంచి పనిని లాంఛనప్రాయంగా చేసింది.  యజమానులు, ఉద్యోగులు పని గంటలు, ఇతర సేవా పరిస్థితులపై పరస్పరం నిర్ణయించుకునేలా చేసింది. అయితే కరోనా పరిస్థితులు కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఇప్పుడు అన్ని రంగాలకు సమగ్ర అధికారిక నిర్మాణాన్ని తీసుకురావాలని యోచిస్తోంది.

ప్రత్యేకంగా..

Work From Home
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కూడా ప్రభుత్వం తన ప్రీ-బడ్జెట్ మెమోరాండమ్‌లో పని నుంచి ఇంటి ఖర్చులపై పన్ను మినహాయింపు ఇవ్వాలని సిఫారసు చేసింది. ‘‘ఫర్నీచర్/ఇతర సెటప్ ఛార్జీల కోసం అయ్యే ఖర్చులు ప్రత్యేకంగా మినహాయింపొచ్చు’’ అని ICAI సూచించింది.  

కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ ఇండియా యొక్క ప్రీ-బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్ 2022 నివేదిక ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించింది. ‘‘ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఉద్యోగులు వ్యాపారాలలో ఇంటి నుంచి పని చేస్తున్నారు’’’అని అకౌంటింగ్ విభాగం పేర్కొంది, ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేసింది.

కార్మిక చట్టాలలో..
మరోవైపు పరిశ్రమల సంస్థ నాస్కామ్..  వర్క్‌ఫ్రమ్‌ హోంకు మద్దతుగా ప్రభుత్వం లేబర్‌ చట్టాల్లో చేయగల ఆరు చర్యలను సిఫార్సు చేసింది.  పని గంటలు,  షిఫ్ట్ సమయాలను మార్చేయడం లాంటి కార్మిక చట్టాలలో మార్పుల్ని నాస్కామ్‌ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులు చేసే ఖర్చుల నుండి ఆదాయపు పన్ను చట్టాలలో మార్పులను సిఫార్సు చేసింది. ప్రధానంగా ఇంటి నుండి పనిని వ్యాపార ఖర్చులుగా పరిగణించాలని సూచించింది. నాస్కామ్‌ సమర్పించిన సిఫార్సుల నివేదికను కిందటి ఏడాది మే నెలలోనే..  పరిశ్రమల ప్రతినిధులతో ప్రభుత్వ అధికారుల చర్చించి.. ఆపై ఆ నివేదికను కార్మిక మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖకు పంపారు.

Published date : 22 Jan 2022 05:45PM

Photo Stories