Womens Skill Development : మెక్రోసాఫ్ట్ డైవర్సిటీ స్కిల్లింగ్ ప్రోగ్రాం రెండో దశ ప్రారంభం.. ఈ సారి కూడా భారీగా..
విభిన్న రంగాల్లో మహిళలల్లో నైపుణ్యాలను పెంచే విధంగా మైక్రోసాఫ్ట్, ఇన్ఫీ స్పార్క్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లతో కలిసి ఏపీఎస్‌ఎస్‌డీసీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. జూలై 25న ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ అజయ్‌రెడ్డి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అజయ్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి ఇంగ్లిష్ మీడియానికి ఇస్తున్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఉపాధి కల్సించే విధంగా ఈ కోర్సును ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ మొదటి దశ కార్యక్రమంలో 30,000 మంది నమోదు చేసుకోగా 18,000 మందికిపైగా మైక్రోసాఫ్ట్ గ్లోబల్ స్కిల్లింగ్ ఇనియేటివ్స్ సర్టీఫికేషన్స్ పొందినట్లు తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభమైన రెండో దశ కార్యక్రమంలో ఇప్పటివరకు 10,000 మందికిపైగా నమోదు చేసుకున్నట్లు తెలిపారు.