Free Coaching: సివిల్స్, గ్రూప్–1కు, గ్రూప్–2కు ఉచిత కోచింగ్... దరఖాస్తుకు చివరి తేదీ...
ప్రభుత్వం,సాంఘిక సంక్షేమశాఖ ఆధీనంలోని ఏపీ స్టడీ సర్కిల్ నిర్వహణలో రాష్ట్రంలో పలు చోట్ల సివిల్స్ పరీక్షలకు ఉచిత కోచింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
APPSC గ్రూప్-2కి ప్రిపేర్ అవ్వడం ఎలా..?
అర్హులైన ఎస్సీ,ఎస్టీ,ఇతర కేటగిరీలకు చెందిన అభ్యర్ధులు ఆగస్టు 5వతేదీ లోగా httpr://apstdc.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్విసెస్‌కు విశాఖపట్నంలో, ఏపీపీఎస్సీ గ్రూప్–1కు విజయవాడలో, గ్రూప్–2కు తిరుపతిలో ఉచిత శిక్షణ అందిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన,ఎదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. కుటుంబ ఆదాయం రూ.6లక్షలకు మించకూడదని, వయోపరిమితి 21 నుంచి 32 ఏళ్ల మద్య వయస్సు కలిగి ఉండాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితి ఉంటుందని పేర్కొన్నారు.ప్రవేశ పరీక్షలో మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. అర్హలైన నిరుద్యోగ అభ్యర్థులు ఉచిత కోచింగ్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని పీవో కోరారు.
APPSC Group 2: B.Tech స్టూడెంట్ ఇలా చదివితే హిస్టరీ లో ఈజీగా రాణించవచ్చు