Bank Holidays September 2022 : కస్టమర్లకు అలెర్ట్.. సెప్టెంబర్ 15 నుంచి ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు.. ఎందుకంటే..?
ఈ నెలలో ఇంకా 15 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకుకు సంబంధించిన ఏదైనా ముఖ్యమైన పని మిగిలి ఉంటే.. త్వరగా పూర్తి చేసుకోండి. ఎందుకంటే సెప్టెంబర్‌లో మిగిలిన 15 రోజుల్లో ఐదు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అంటే 15 రోజుల్లో 9 రోజులు మాత్రమే బ్యాంకులు పని చేయనున్నాయి. సెప్టెంబర్ నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అందులో 8 సెలవులు పూర్తయ్యాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రతి సంవత్సరం (బ్యాంకు హాలిడేస్) సెలవుల జాబితా క్యాలెండర్‌ను జారీ చేస్తుంది. ఇందులో కొన్ని జాతీయ స్థాయిలో సెలవులు, కొన్ని స్థానిక సెలవులు ఉంటాయి. స్థానిక సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఈ సెలవు రోజుల్లో బ్యాంకులు పనిచేయవు.
సెప్టెంబర్ 15 తర్వాత బ్యాంకు సెలవుల జాబితా ఇలా..:
☛ సెప్టెంబర్ 18 - ఆదివారం
☛ సెప్టెంబర్ 21 - శ్రీ నారాయణ గురు సమాధి దివస్
☛ సెప్టెంబర్ 24 - నాలుగో శనివారం
☛ సెప్టెంబర్ 25 - ఆదివారం
☛ సెప్టెంబర్ 26 - నవరాత్రి స్థాపన