Skip to main content

ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ 5వ తరగతి, ఇంటర్‌ ప్రవేశాలు పూర్తి

సాక్షి, అమరావతి: ఏపీ రెసిడెన్షియల్‌ విద్యా సంస్థల్లో 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్‌లో ప్రవేశాలకు విద్యార్థుల ఎంపిక ప్రక్రియను సోమవారం పూర్తి చేసినట్టు ఆంధ్రప్రదేశ్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఏపీఆర్‌ఈఐ) సొసైటీ కార్యదర్శి వి.రాములు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ సెంటర్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ సిస్టమ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ (ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌) రూపొందించిన ‘ప్రవేశం’ అనే ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ద్వారా విద్యార్థుల ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేసినట్టు ఆయన వివరించారు. రాష్ట్ర స్థాయి ప్రవేశాల కమిటీలో ఉన్న అధికారులు ఈ ప్రక్రియను పర్యవేక్షించారన్నారు.

చ‌ద‌వండి: తెలంగాణ ఎంసెట్‌– 2021 ఫలితాలు రాకముందే.. సీటు కోసం పరుగులు..

చ‌ద‌వండి: అంగన్‌వాడీల్లో పాలు, పోషకాహారం పంపిణీపై నిరంతర పర్యవేక్షణకు ‘యాప్స్‌’

5వ తరగతిలో ప్రవేశానికి 19,107 మంది దరఖాస్తు చేసుకోగా 3,187 మందికి సీట్లు కేటాయించినట్టు తెలిపారు. జూనియర్‌ ఇంటర్మీడియట్‌ కోసం 33,547 మంది దరఖాస్తు చేయగా 1,378 మందికి సీట్లు ఖరారు చేసినట్టు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను https://aprs.apcfss.in వెబ్‌సైట్‌లో పొందుపర్చడంతోపాటు ఎంపికైన అభ్యర్థుల మొబైల్‌ ఫోన్లకు సందేశాలు (ఎస్‌ఎంఎస్‌) పంపించినట్లు తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌ అభ్యర్థులు ఆగస్టు 25వ తేదీలోపు, 5వ తరగతికి ఎంపికైన అభ్యర్థులు ఆగస్టు 31వ తేదీలోపు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్దేశించిన ప్రాంతాల్లో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకంగా నిర్వహించి వెబ్‌ క్యాస్టింగ్‌ (వీడియో చిత్రీకరణ) చేసినట్టు తెలిపారు.
Published date : 17 Aug 2021 02:30PM

Photo Stories