Skip to main content

Telangana Inter Public Exams Time Table 2024 : తెలంగాణ‌లో ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ విడుద‌ల‌.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. టెన్త్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఫిబ్రవరి 28వ తేదీ నుంచి నిర్వ‌హించేందుకు ఇంట‌ర్ బోర్డ్ షెడ్యుల్‌ను డిసెంబ‌ర్ 28వ తేదీన‌(గురువారం) విడుద‌ల చేసింది. ఇటీవలే ఇంటర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌పై తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ts inter exam dates 2024

పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అలాగే త్వరలోనే టెన్త్ ఎగ్జామ్స్ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.  ఈ ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.  ఫిబ్రవరి 1నుంచి 15వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 16న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 19న ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.

తెలంగాణ‌ ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల పూర్తి వివ‌రాలు ఇవే..

 

ఇంటర్ ఫస్ట్ ఇయర్ షెడ్యూల్‌ 2024 :

➤ ఫిబ్రవరి 28న సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1.
➤ మార్చి 1న ఇంగ్లీష్ పేపర్ 1.
➤ మార్చి 4న మాథ్స్ పేపర్ 1A/ బోటనీ పేపర్ 1/ పొలిటికల్ సైన్స్ పేపర్ 1.
➤ మార్చి 6న మాథ్స్ పేపర్ 1b, జువాలజి పేపర్ 1/ హిస్టరీ పేపర్ 1.
➤ మార్చి 11న ఫిజిక్స్ పేపర్ 1/ ఎకనామిక్స్ పేపర్1.
➤ మార్చి 13న కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1.

ఇంటర్ సెకండ్ ఇయర్ షెడ్యూల్ 2024
►ఫిబ్రవరి 29న  సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2
►మార్చి 2న ఇంగ్లీష్ పేపర్ 2
►మార్చి 5న మాథ్స్ పేపర్ 2A/ బాటనీ పేపర్ 2/ పొలిటికల్ సైన్స్ 2.
►మార్చి 7న మాథ్స్ పేపర్ 2B/ జువాలాజీ పేపర్ 2/ హిస్టరీ పేపర్ 2
►మార్చి 12న ఫిజిక్స్ పేపర్2/ఎకనామిక్స్ పేపర్ 2.
మార్చి 14న కెమిస్ట్రీ పేపర్ 2/ కామర్స్ పేపర్ 2.

పూర్తి వివ‌రాలు ఇలా..

ts inter exam dates 2024
Published date : 28 Dec 2023 05:58PM

Photo Stories