Srinidhi University: శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో దాడి
సాక్షి ఎడ్యుకేషన్: శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ జరిగింది. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే కొందరు యువకులు కళాశాలపై దాడికి దిగారు. అడ్డు పడి ఆపే ప్రయత్నం చేసే వారిపై కూడా దాడికి పాల్పడ్డారు. ఆ యువకులు దాడి చేయడంతో అడ్డుపడ్డ పలు సిబ్బందులు, అధ్యాపకులు గాయాపడ్డారు.
International Funds: మీ పిల్లల ఉన్నత విద్యకోసం ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి తెలుసుకోండి..!
సిబ్బందులు, ప్రొఫెసర్ల పైనే కాకుండా కళాశాలలోని ప్రతీ ఫర్నీచర్ ను, అద్దాలను, గోడలను ధ్వంసం చేసారు. ఆపై యువకుల గురించి గాలించగా, వారు ఏబీవీపీ జెండాలు తీయడం, మెడలో కండువాలు వేసుకోవడంతో, ఆ యువకులు ఏబీవీపీ ప్రతినిధులని గుర్తించారు. వారి మూలాన జరిగిన నష్టానికి, శ్రీనిధి కళాశాల ప్రిన్సిపాల్ టీసీహెచ్ శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందువలన దాడికి పాల్పడిన వారిలో 15 మందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.