APCNF: 27 నుంచి శాస్త్రవేత్తల పర్యటన
ఈ మేరకు నవంబర్ 26న ఈ మేరకు విజయవాడ కార్యాలయం నుంచి అన్నమయ్య జిల్లా అధికారులకు సమాచారం అందింది. అందులో పేర్కన్న వివరాల ప్రకారం.. జిల్లాలోని చిన్నమండెం మండలం చిన్నర్సుపల్లె, వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లి గ్రామాలలో పర్యటిస్తారు.
రాష్ట్రంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో విస్తృతంగా సమర్థవంతంగా ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను పరిశీలించేందుకు గ్లోబల్ స్థాయి గుర్తింపు పొందిన (అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంప్రదింపుల సమూహం) శాస్త్రవేత్తల బృందం ఈ పర్యటనలో పాల్గొంటుందని తెలిపారు.
చదవండి: AP Agricultural Yields: ఏపీలో ఆహార ధాన్యాల రికార్డు స్థాయి దిగుబడులు
రాష్ట్రంలో కరువు ప్రాంతంగా పేరొందిన రాయలసీమ జిల్లాల పర్యటనలో భాగంగా జిల్లాలో 18 మందితో కూడిన సీజీఐఏఆర్ బృందం జిల్లాలో పర్యటించి ప్రకృతి వ్యవసాయంలో అమలవుతున్న ఆదర్శ క్షేత్రాలను సందర్శిస్తారు. నవంబర్ 27వ తేదీన బెంగళూరు విమానాశ్రయం నుంచి బయలుదేరి రోజుకో గ్రామం చొప్పున జిల్లాలోని 2 గ్రామాలను సందర్శిస్తున్నట్లు సమాచారం.
- 27వ తేదీన తొలి రోజున చిన్నమండెం మండలంలోని చిన్నర్సుపల్లె గ్రామంలో పర్యటిస్తుంది.
- 28న వాల్మీకిపురం మండలంలోని అయ్యవారిపల్లె గ్రామంలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఏ గ్రేడ్‌మరియు ఏటీఎం మోడల్స్‌ను సందర్శించి రైతులతో చర్చిస్తారు. అనంతరం యువ రైతులు, రైతు శాస్త్రవేత్తలు, మెంటార్‌లు, నిరుపేదలు తదితర గ్రూప్‌లతో విడివిడిగా మాట్లాడి ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి, కలిగే ప్రయోజనాల గూర్చి సవివరంగా తెలుసుకొంటారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో:
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం(ఏపీసీఎన్‌ఎఫ్) ప్రాజెక్టు పేరుతో విజయవంతంగా అమలు చేస్తోంది. రాష్ట్రంలో చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
ఈ నేపథ్యంలో లావోస్ పీడీఆర్, భారత్, కెన్యా, జింబాబ్వే, సెనెగల్, బుర్కినా ఫావో, ట్యునీషియా, పెరూ(మొత్తం 8)దేశాలకు చెందిన 60 మందితో కూడిన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర వాటాదారుల అధ్యయన బృందం ‘ద్వైవార్షిక విరామం మరియు ప్రతిబింబం’లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను అర్థం చేసుకోవడానికి సందర్శించడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిరాడ్, వరల్డ్ షిప్, అలయన్స్ బయోడైవర్షిటీ, ఇస్రా, అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ(ఐడబ్ల్యుఎంఐ), ఓఇఫి, ఇనెరా, సీఐఎంఎంవైటీ సంస్థల ప్రతినిధులు ఈ బృందంలో ఉన్నారు.
సీజీఐఆర్ ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయరంగంలో చోటు చేసుకునే నూతన ఆవిష్కరణలపై 15 అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల ద్వారా పనిచేసే 9 వేల మంది శాస్త్రవేత్తలతో కూడిన అతి పెద్ద నెట్‌వర్క్ సంస్థగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవసాయ శాస్త్ర ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో సీజీఐఎఆర్ చొరవ తీసుకొని 8 దేశాలలో పర్యావరణ పరిరక్షణకు దోహదపడే వ్యవసాయ విధానాలను అధ్యయం చేస్తోంది.
ఆహార భద్రతను పెంపొందించడం, గ్రామీణపేదరిక నిర్మూలన, పౌష్టికాహార ఉత్పత్తి, మానవాళి ఆరోగ్యం, సహజ వనరుల పరిరక్షణ లక్ష్యంగా చేసుకొని ఈ సమస్త అధ్యయనాలు చేపడుతుంది. అధ్యయన ఫలితాల నుంచి వచ్చిన సాక్ష్యాలను విధాన రూపకర్తలకు, భాగస్వాములకు అందిస్తుందని ఏపీ రైతు సాధికార సంస్థ తెలియజేసింది.
బృందం సభ్యులు వీరే
జిల్లాలో పర్యటించే బృందంలో బోకో మిచెల్‌ఒరౌన్లాడ్టి, సోలేమానే సనోగో, సోలేమానే ఓడ్రాగో, ఎటియెన్‌సోడ్రే, డిజైర్ ఔటారా, హతికొనాటే, ఎరిక్ వాల్, మార్క్ ఫిరాక్స్, మోడో గ్యూ ఫాల్, బన్నా ఎంటాయే, మామే బీరమ్ సెనే, ఉడో రుడిగర్, హతేమ్‌చెక్‌మద్రీ, హైతెమ్ బ హ్రీ, జిద్ ద్రైఫ్, అనిస్ జైమ్, అస్మా సౌయిస్సీ, శ్వేతా గుప్తాలు ఉంటారు.