ఈ ఏడాది మే, జూన్ నెలల్లో జరిగిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్ష ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ జూలై 21న విడుదల చేసింది.
టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల
ఓపెన్ టెన్త్ పరీక్షకు 31,720 మంది హాజరైతే, 16,481 (51.96 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రకటించింది. ఓపెన్ ఇంటర్ పరీక్షకు 36,345 మంది హాజరైతే, 14,910 మంది (41.02 శాతం) ఉత్తీర్ణులైనట్టు తెలిపింది. సంబంధిత విద్యాలయాలకు 15 రోజుల్లో మార్కుల మెమోలు పంపుతామని, రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఆగస్టు 5లోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఫలితాలకు www.telanganaopenschool.org అనే వెబ్‌సైట్ చూడాలని సూచించింది.