JNTUK PG Admissions: జేఎనీ్టయూకేలో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్ల భర్తీకి షెడ్యూల్
- ఎంబీఏ, ఎంటెక్ కోర్సులకు
- 20 నుంచి కౌన్సెలింగ్
- దరఖాస్తు చేసుకునేందుకు
- 18 వరకు అవకాశం
సాక్షి, అమరావతి: జేఎన్టీయూ (కాకినాడ)లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ల్లో స్పాన్సర్డ్ కేటగిరీలో ఎంటెక్, ఎంబీఏ, ఎంబీఏ (సీఎంయూ) సీట్ల భర్తీ కోసం ఈ నెల 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నామని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొ.ఎల్.సుమలత సోమవారం తెలిపారు. ఈ సీట్ల కోసం ఈ నెల 20, 21, 22 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. ఈ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు గేట్/జీప్యాట్/ఏపీపీజీఈసెట్/ఐసెట్‌లలో అర్హత సాధించి ఉండాలన్నారు. అంతేకాకుండా ఏడాదిపాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి అని చెప్పారు. ఈ నెల 20న జేఎనీ్టయూకే సెనేట్ హాల్‌లో ఎంబీఏ, ఎంబీఏ (సీఎంయూ) కోర్సులకు, 21, 22 తేదీల్లో ఎంటెక్ కోర్సులకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. అభ్యర్థులు పదో తరగతి, ఇంటరీ్మడియెట్, డిగ్రీ మార్కుల జాబితాలు, టీసీ, కాండక్ట్ సరి్టఫికెట్, స్పాన్సర్షిప్ సరి్టఫికెట్, గేట్/జీప్యాట్/ ఏపీపీజీఈసెట్/ఐసెట్ 2021 హాల్‌టికెట్, ర్యాంక్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలని సూచించారు. పూర్తి వివరాలను https:// www. jntuk. edu. in/ ద్వారా తెలుసుకోవచ్చన్నారు.
Click here for more Education News