PMRF Fellowship: పీఎంఆర్‌ఎఫ్ ఫెలోషిప్‌కు 8 మంది హెచ్‌సీయూ విద్యార్థులు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 8 మంది పరిశోధక విద్యార్థులు ప్రతిష్టాత్మక ప్రైమ్ మినిస్టర్స్ రీసెర్చ్ ఫెలోషిప్(పీఎంఆర్‌ఎఫ్)కు ఎంపికయ్యారు. వీరిలో అయిదుగురు విద్యార్థినిలు ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలోని పీఎంఆర్‌ఎఫ్ జాతీయ సమన్వయ కమిటీ (నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ది పీఎంఆర్‌ఎఫ్ స్కీమ్) ఈ ఎంపికను నిర్వహించింది.
Also read: Medical Recruitment: వైద్య పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్!
ఎంపికైనది వీరే...
పీఎంఆర్‌ఎఫ్ ఫెలోషిప్‌కు డిసెంబర్ 2021 కింద ఎంపికైన 8 మంది విద్యార్థుల్లో సౌమక్‌నాగ్ (మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్), కె.వెంకట సుబ్బారెడ్డి( స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్), ఇమ్లియంగ్ల లాంగ్‌కుమార్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయో కెమిస్ట్రీ–స్కూల్‌ఆఫ్ లైఫ్ సైన్సెస్), సుమతి రవిరాజ్ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ–స్కూల్‌ఆఫ్ లైఫ్ సైర్సె స్, భారతి కొటారియా (డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మెటిక్స్, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్), మృణాలిని (స్కూల్ ఆఫ్ ఫిజిక్స్), కరిష్మ బంబోనాయక్ (స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ), శ్రీకాంత్ గుంతోజు (స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ)ఉన్నారు.
Also read: Youtube: 16 యూట్యూబ్ చానెళ్లపై కేంద్రం నిషేధం