Skip to main content

Schools and Colleges Closed Due to Rain 2023 : భారీ వ‌ర్ష సూచ‌న‌.. మ‌రో రెండురోజులు పాటు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం.. ఇంకా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణతో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా కుండ‌పోత వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఇంకా నాలుగు నుంచి ఐదు రోజులుగా పాటు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది.
Schools Holidays Due rain telugu news
Schools and Colleges Holidays Due to Rain

ఇప్ప‌టికే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశాల మేర‌కు విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి జూలై 20, 21, 22 తేదీల్లో సెల‌వుల‌ను ప్ర‌క‌టించారు. దీంతో స్కూల్స్‌కు వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు సెలవులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ వ‌ర్షాలు ఇలాటుఏ జూలై 25, 26వ‌ తేదీ వ‌ర‌కు కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని వార‌తావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. ఒక వేళ ఈ వ‌ర్షాలు  ఇలాగే కొన‌సాగితే.. వర్షాలు ప‌డే ప్రాంతం బ‌ట్టి స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు ఇచ్చే అవ‌కాశం ఉంది.

☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

ఈ సమయంలో స్కూళ్లు తెర‌వ‌క‌పోవ‌డ‌మే..

schools and colleges holiday news telugu

ఈ నేపథ్యంలో సెలవులు పొడిగిస్తారా? ఏ నిర్ణయమూ తీసుకోలేక అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులను సమీక్షించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. కొన్ని జిల్లాల అధికారులు ఈ సమయంలో స్కూళ్లు తెరవడం మంచిది కాదంటున్నారు. చాలాచోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతికూల పరిస్థితులున్నాయని, తరగతి పైకప్పులు కురుస్తున్నాయని, వర్షపునీరు గదుల్లో ఉందని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

☛ August 29, 30 Schools and Colleges Holidays : ఆగస్టు 29,30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

కొన్నిచోట్ల పైకప్పుల నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయని, తరగతిలో విద్యార్థులు ఉంటే ప్రమాదమని ఎంఈఓలు కూడా డీఈఓలకు చెప్పారు. కొన్ని పాఠశాలల ప్రాంగణంలో వరదనీరు ఇంకా నిల్వ ఉందని, విద్యార్థులు పరుగెడితే జారిపడే ప్రమాదం ఉందంటున్నారు. కొన్ని స్కూళ్లల్లో గోడల్లో చెమ్మ ఉందని, ఫలితంగా విద్యుత్‌ బోర్డుల్లోంచి గోడలకు కరెంట్‌ వచ్చే ప్రమాదం ఉంటుందని చెప్పారు.

ప్రమాదంగా ఉండే స్కూళ్లను..
ఏ ఒక్క విద్యార్థికి సమస్య తలెత్తినా ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా ప్రైవేట్‌ స్కూళ్లు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా తరగతులు నిర్వహించాయని చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ఆలస్యమైందని, దీంతో బోధన కుంటుపడిందని, ఇంకా సెలవులు పొడిగించడం సరికాదని కొంతమంది టీచర్లు అంటున్నారు. ప్రమాదంగా ఉండే స్కూళ్లను గుర్తించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే నష్టమేంటని ప్రశ్నిస్తున్నారు.

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
 
ఈ సమస్యలెన్నో.. దోస్త్, ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కు..

dost and eamcet counselling problems due to rain telugu news

వర్షాల కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం, నెట్‌వర్క్‌ కనెక్షన్‌లో ఇబ్బందులు తలెత్తున్నాయి. దీంతో దోస్త్, ఇంజనీరింగ్‌ సీట్లకు సంబంధించి సెల్ఫ్‌ రిపోర్టింగ్‌కు అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఎంసెట్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కావాలి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసే గడువు ఆదివారంతో ముగిసింది.అయితే చాలామంది విద్యార్థులు రిపోర్ట్‌ చేయలేకపోయారని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా రెండోవిడత కౌన్సెలింగ్‌ వాయిదా వేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ గడువూ పొడిగించాలని కోరుతున్నాయి. 

☛ EAMCET Counselling 2023 : ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు మేము రాంరాం.. కారణం ఇదే..!

గడువు పొడిగించే ఆలోచ‌న‌లో..
డిగ్రీ కళాశాల ప్రవేశాలకు సంబంధించి దోస్త్‌కు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ తేదీ జూలై 26వ తేదీతో ముగుస్తుంది.జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లి నెట్‌లోనో, లేదా కాలేజీకి నేరుగా వెళ్లి రిపోర్టు చేసేందుకు అనేక సమస్యలున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వర్షాల వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నదని, వేరే ప్రాంతాలకు వెళ్లడం కష్టమవుతోందని అంటున్నారు. ఈ కారణంగా దోస్త్‌ రిపోర్టింగ్‌ గడువు పొడిగించే యోచనపై అధికారులూ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు.

☛ Schools and Colleges holidays 2023 Extended : భారీ వర్షం.. స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవులు.. వివిధ పరీక్షలు వాయిదా.. ఇంకా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా..

మరో ఐదురోజుల పాటు ఇలాగే..

schools and colleges holiday extended news 2023

తెలంగాణలో సోమవారం నుంచి మరో ఐదురోజుల పాటు ఇలాగే కంటిన్యూ కానున్నాయి. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. పాఠశాలలు ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లు వస్తుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. వర్షాల్లో కూడా బడికి పంపాల్సిందేనా..? స్కూల్‌కు వెళ్లేటప్పుడు గానీ.. తిరిగొచ్చేటప్పుడుగానీ ఏమైనా జరిగితే ఎవరు బాధ్యులు..? అని స్కూళ్ల యాజమాన్యంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు.

రేపు, ఎల్లుండి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు..

schools holidays news july 25th and 26th news telugu

భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. సెలవుల విషయంలో విద్యాశాఖ నిర్ణయం తీసుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సెలవులు ఇవ్వాలనే డిమాండ్ గంట గంటకూ పెరుగుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డితో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుందా..? అని విద్యార్థులు, తల్లిదండ్రులు, స్కూల్స్ యాజమాన్యాలు సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

☛ Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్‌ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

తల్లిదండ్రులు సైతం వర్షాలు తగ్గే వరకూ..
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుజిల్లాల్లో కాసింత వర్షం తగ్గింది కానీ.. వరద మాత్రం అలానే ఉంది. కొన్ని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేకపోవడం, రోడ్ల మీదనే చెట్లు కూలిపోవడం, కొన్ని గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో స్కూళ్లకు వెళ్లడానికి విద్యార్థులు ఇంకెంత ఇబ్బంది పడతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందుకే హైదరాబాద్‌లోనే కాకుండా ఇతర జిల్లాల్లోని విద్యార్థుల తల్లిదండ్రులు సైతం వర్షాలు తగ్గే వరకూ సెలవులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

➤☛ AP EAPCET College Predictor (Click Here)

మరోవైపు.. సోమవారం స్కూల్స్ ఉన్నా మంగళ, బుధవారాల్లో సెలవులు ప్రకటించాలని.. ఆ రెండ్రోజులు భారీగా వర్షాలు ఉండే చాన్స్ ఉందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తే బాగుంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 

నేడు విద్యా సంస్థలకు సెలవు..

schools closed news due to rain telugu news

హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భారీ వర్షాల కారణంతో వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే 130 మంది కొండ చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నష్టం తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకటించింది. జూలై 24వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది.

➤☛ Best Branch In BTech : బీటెక్‌లో ఏ బ్రాంచ్ సెల‌క్ట్‌ చేసుకుంటే మంచిదంటే..?

Published date : 24 Jul 2023 01:39PM

Photo Stories