సాక్షి, హైదరాబాద్/నిర్మల్/భైంసా: విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని మరింతగా అందించేందుకు వీలుగా తెలంగాణా స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీఎస్ కాస్ట్), బాసర ట్రిపుల్ ఐటీ మధ్య మార్చి 9న అవగాహన ఒప్పందం కుదిరింది.
ట్రిపుల్ ఐటీ, టీఎస్ కాస్ట్‌ల ఎంవోయూ
తెలంగాణ అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఎంవోయూపై బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ పి. సతీష్ కుమార్, టీఎస్–కాస్ట్ మెంబర్ సెక్రటరీ ఎం.నగేష్ సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ మాట్లాడుతూ, ఈ ఎంవోయు వల్ల బాసర విద్యార్థులు బోధన, పరిశోధనల్లో నూతన అవిష్కరణలతో మరింత ముందుకెళ్తారన్నారు.