Teachers Transfer: బదిలీ కోసం ఇన్ని వేల మంది టీచర్లు దరఖాస్తు
జనవరిలో వచ్చిన దరఖాస్తుల సంఖ్య 70,762 కాగా 3,339 మంది ఉపాధ్యాయులు దరఖాస్తుల గడువు ముగిసే నాటికి ఎలాంటి డేటా ఎడిటింగ్ చేయలేదని విద్యాశాఖ వెల్లడించింది. టీచర్ల బదిలీ ప్రక్రియను 2023 జనవరిలో చేపట్టారు. ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో అప్‌లై చేసి, ప్రక్రియ జరుగుతుండగానే నాన్–స్పౌజ్‌లు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే ఇవ్వడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
చదవండి: National Teacher's Day: సర్వోన్నత ఆచార్యుడు సర్వేపల్లి
తిరిగి కోర్టు స్టేను ఎత్తివేడంతో సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బదిలీలకు శ్రీకారం చుట్టారు. గతంలో ఫిబ్రవరి 1ని కటాఫ్‌గా నిర్ణయించారు. ఇప్పుడు సెప్టెంబర్ 1ని కటాఫ్ తేదీగా పెట్టారు. దీంతో రెండేళ్ళకు పైబడి ఒకే చోట పనిచేస్తున్న ఉపాధ్యాయులు దర ఖాస్తులు చేసుకున్నారు. బదిలీలకు వచ్చిన దరఖాస్తుల్లో రంగారెడ్డి జిల్లాలో (4722) ఎక్కువగా ఉన్నాయి. ములుగు జిల్లాల్లో అతి తక్కువ (781) దరఖాస్తులొచ్చాయి.