Skip to main content

Happy Teachers Day: వినూత్న బోధనలతో రికార్డులు!

Happy Teachers Day
Happy Teachers Day

చిత్తూరు కలెక్టరేట్‌ : ఆ ఉపాధ్యాయులు అందరిలా కాకుండా, వినూత్న ఆలోచనలతో తమకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. వారు పనిచేస్తున్న పాఠశాలల్లో మొక్కలు, ఆట వస్తువులతో ఆహ్లాదంగా మారుస్తున్నారు. మొత్తంగా సర్కారు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని విద్యార్థులకు ప్రతి అంశం సులువుగా అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా బోధన చేస్తున్నారు. తమవంతు పాత్ర పోషిస్తూ ఆదర్శ గురువులుగా నిలుస్తున్నారు. మంగళవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం (గురుపూజోత్సవం)ను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ కార్యాలయంలో ఘనంగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించనున్నారు.

ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలో ఉత్తమ బోధనతో పాటు సేవారంగాల్లో ముందుంటున్న ముగ్గురు ఉపాధ్యాయులు విశాఖలో రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకోనున్నారు. ఇదే విధంగా జిల్లాలో 62 మంది గురువులు అవార్డులు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. దీనిపై డీఈవో విజయేంద్రరావు సోమవారం డీఈవో కార్యాలయంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. నేటి అవార్డుల ప్రదానోత్సవానికి ఇన్‌చార్జి కలెక్టర్‌ శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.

గురుతారలు మెరిసే

గుంటూరు ఎడ్యుకేషన్‌: మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంగళవారం పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్తమ సేవలందించిన 27 మంది గురువులను జిల్లాస్థాయి పురస్కారాలకు ఎంపిక చేశారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ సోమవారం జాబితా విడుదల చేశారు. మంగళవారం ఉదయం 10 గంటలకు గుంటూరు మార్కెట్‌ సెంటర్లోని శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహించనున్న వేడుకలో పురస్కారాలు ప్రదానం చేస్తారని వివరించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా అధ్యక్షతన జరగనున్న సభలో జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి పాల్గొననున్నారు.

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే

● హెచ్‌ఎం విభాగంలో: అళహరి శివరామకృష్ణ, గ్రేడ్‌–2 హెచ్‌ఎం, జెడ్పీ హైస్కూల్‌, సంగంజాగర్లమూడి, తెనాలి, వడ్డేపల్లి వీరరాఘవరావు, హెచ్‌ ఎం, మున్సిపల్‌ హైస్కూల్‌ నిడుబ్రోలు.

● స్కూల్‌ అసిస్టెంట్స్‌ విభాగం: నూతలపాటి విజయలక్ష్మి, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, జెడ్పీ హైస్కూల్‌ వేజెండ్ల, చేబ్రోలు మండలం, గొడవర్తి పాప, సోషల్‌, జెడ్పీ హైస్కూల్‌ నల్లపాడు, గుంటూరు రూరల్‌, పణిదరపు శ్రీనివాసరావు, ఫిజికల్‌ సైన్స్‌, జెడ్పీ హైస్కూల్‌ కొర్రపాడు, మేడికొండూరు, దివాకరుని నాగభారతి, పీజీటీ కెమిస్ట్రీ, జెడ్పీ హైస్కూల్‌ అంకిరెడ్డిపాలెం, గుంటూరు రూరల్‌, కోడె జ్ఞానప్రసాద్‌, ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ం, ఎంపీపీ స్కూల్‌ నల్లపాడు, గుంటూరు రూరల్‌, ఎండీ అన్వర్‌ సాధిక్‌, పీజీటీ ఫిజిక్స్‌, జెడ్పీ హైస్కూల్‌ కొర్నెపాడు, అలవాల శ్రీనివాసరావు, మాధ్స్‌, జెడ్పీ హైస్కూల్‌ నారాకోడూరు, కె. నరేంద్ర కుమార్‌, పీజీటీ జువాలజీ, జెడ్పీ హై స్కూల్‌ ప్లస్‌ చినలింగాయపాలెం, కాకుమా ను మండలం, ఇ.అంబరీషుడు, సోషల్‌, కేఎస్‌ఎం హైస్కూల్‌ తెనాలి, తాడివాక శ్రీదేవి, ఫిజి కల్‌ సైన్స్‌, జెడ్పీహైస్కూల్‌, నిడమర్రు, మంగళగిరి, షేక్‌ అస్మతున్నీసా, తెలుగు, ఎన్‌ఎస్‌ఎస్‌ఎం హై స్కూల్‌, ఐతానగర్‌, తెనాలి, దాసరి నాగవేణి, తె లుగు, జెడ్పీ హైస్కూల్‌, కటెవరం, తెనాలి, బీఎస్‌ఎస్‌ గోపాలరావు, సోషల్‌, ఎస్‌ఎస్‌ఎన్‌వో ప్ర భుత్వ ఉన్నత పాఠశాల, బ్రాడీపేట, గుంటూరు.

● ఎస్జీటీ విభాగం: సయ్యద్‌ అబ్దుల్‌ కరీం, ఎస్జీటీ ఉర్దూ, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఎంఎన్‌సీ, ఏటీ అగ్రహారం, గుంటూరు, బి.వేంకటేశ్వరరావు, డ్రాయింగ్‌ టీచర్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ఎం హైస్కూల్‌ ఐతానగర్‌, తెనాలి, కె.శివ శంకర ప్రసాద్‌, ఎస్జీటీ, ఎంపీపీఎస్‌ నంబర్‌–10, సుబ్బారెడ్డినగర్‌ గుంటూరు, పి.సౌజన్య, ఎస్జీటీ, ఎస్‌ఎంఈఎస్‌, ఐఎన్‌ కాలనీ, తెనాలి, మోర్ల కృష్ణ, ఎస్జీటీ, ఎంపీపీ స్కూల్‌, గుడివాడ, తెనాలి, షేక్‌ నూర్జహాన్‌, ఎస్జీటీ ఉర్దూ, ఎంపీపీ స్కూల్‌, ఉర్దూ, కొల్లిపర.

● ఆంగ్ల మాధ్యమం : ప్రభుత్వం తొలిసారిగా నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా ఎంపికైన ఐదుగురు ఇంగ్లిష్‌ బోధన ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ పురస్కారాలను ప్రకటించారు. వీరిలో వై.రమ, ఎస్‌కేబీపీఎం నగరపాలకసంస్థ ఉన్నత పాఠశాల, గుంటూరు, షేక్‌ చాందిని, జెడ్పీహైస్కూల్‌, బి. కోడూరు, కె.మేరీరాణి, ఎంపీపీ స్కూల్‌, కండ్రిక, ఎం.ఇందిర, పీఎంసీ హైస్కూల్‌, గుంటూరు, వి. మేరీ, ఎంపీయూ స్కూల్‌, వేములూరిపాడు ఉన్నారు.

చదువే కను‘పాప’ల్లె

విద్యతోనే వృద్ధి సాధ్యమని నమ్ముతా. అందుకే చదువే కంటిపాపగా ముందుకు సాగుతున్నా. చిన్న నాటినుంచే టీచర్‌ కావాలని ఉండేది. 1983లో ఎస్‌జీటీగా తెనాలి మండలం పెదరావూరు పాఠశాలలో ఉద్యోగంలో చేరాను. జంపని, నందివెలుగు, సొమసుందరపాలెంలో పనిచేశా. స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొంది బెల్లంకొండ, కొల్లూరు, ఈమని పాఠశాలల్లో పనిచేశా. ప్రస్తుతం నల్లపాడులో పనిచేస్తున్నా. 40 ఏళ్ళుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నా. ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డు రావడం ఆనందంగా ఉంది.– గొడవర్తి పాప, నల్లపాడు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, సోషల్‌ టీచర్‌
 

‘సెంటా’ అవార్డుకు జిల్లా నుంచి ఐదుగురు ఉపాధ్యాయుల ఎంపిక

రాయవరం: రాష్ట్ర విద్యా పరిశోధక మండలి నిర్వహించిన సెంటా పరీక్షలో జిల్లా నుంచి ఐదుగురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇంగ్లిషులో భాషా ప్రావీణ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ పరీక్షను నిర్వహించారు. ఈ నెల ఒకటో తేదీన ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షలో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఐదుగురు ఉపాధ్యాయులకు ‘సెంటా’ అవార్డును ప్రకటించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా నుంచి ఇంగ్లిష్‌ సబ్జెక్టులో కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి కొత్తపల్లి ధర్మరాజు, గణితం సబ్జెక్టు నుంచి కొత్తూరు జగన్నాథపురం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన చెలమకూరి విజయలక్ష్మి, ప్రాథమిక పాఠశాల విభాగంలో ఆత్రేయపురం మండలం ర్యాలి ఎంపీపీ మోడల్‌ ప్రైమరీ నంబర్‌–1 పాఠశాల నుంచి గోపినీడి లక్ష్మీసుజాత, సైన్స్‌ సబ్జెక్టు నుంచి పి.గన్నవరం మండలం ముంగండ జెడ్పీహెచ్‌ఎస్‌ నుంచి గెడ్డం సుదర్శిణి, సోషల్‌ సబ్జెక్టు నుంచి రావులపాలెం మండలం ఈతకోట జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన కొవ్వూరి సాయివెంకటకృష్ణారెడ్డి ఎంపికయ్యారు.
 

విద్యార్థుల హాజరు పెంచిన ఏకోపాధ్యాయుడు

కొత్తపేట: మోడేకుర్రు పంచాయతీ శివారు గ్రామం సంజీవనగర్‌. అక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలలో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్న పరిస్థితుల్లో 2017–18 విద్యాసంవత్సరం ఆ స్కూలులో కేవలం 9 మంది విద్యార్థులు మాత్రమే చదివారు. ఆ ఏడాది ఆ పాఠశాలకు బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుడు కె.రవికుమార్‌కు వృత్తి పట్ల, విద్యాబోధనపై ఉన్న చిత్తశుద్ధి, కార్పొరేట్‌ తరహాలో విద్యా బోధన ఆ ప్రాంత విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఆకట్టుకుంది. ఫలితంగా ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూఅభ్యసన సామగ్రితో బోధిస్తున్న రవికుమార్‌  - Sakshi ప్రస్తుత విద్యా సంవత్సరంలో 24 మంది విద్యార్థులు ఉన్నారు. రవికుమార్‌ అభ్యసన సామగ్రిని సొంతంగా తయారు చేసి విశ్లేషించి బోధించడం, విద్యార్థుల ఆసక్తికి అనుగుణంగా ప్రోత్సహించడం, పరీక్షలు, ఆటలు, పాటలు, డ్రాయింగ్‌ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తూ విద్యార్థులను పాఠశాలకు రప్పించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

యూట్యూబ్‌, టీఎల్‌ఎంలతో వినూత్న బోధన

రామచంద్రపురం రూరల్‌: మండలంలోని వెలంపాలెం మండల ప్రజాపరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా పనిచేస్తున్న శ్రీకాకుళపు వెంకట సత్య సూర్య జానకి భాగ్యలక్ష్మి రత్నం (రత్నం మేడమ్‌) 2018 నుంచి యూట్యూబ్‌లో పాఠాలను టీఎల్‌ఎం (టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌) సహకారంతో తయారు చేసి బోధిస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని టీఎల్‌ఎంలు తయారు చేయడం, వాటి ద్వారా విద్యాబోధన చేయడం ప్రారంభించారు. దాని నుంచి మంచి ఫలితాలు రావడంతో ఇతర ఉపాధ్యాయులూ దాని అనుసరించి వాటిని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 151 వీడియోలను ఆమె అప్‌లోడ్‌ చేశారు. గత ఏడాది ప్రభుత్వం ప్రారంభించిన టర్ల్‌ (టీచింగ్‌ ఎట్‌ రైట్‌ లెవెల్‌) ప్రోగ్రాంపై కూడా ఆమె పాఠాలను రూపొందించి అప్‌లోడ్‌ చేశారు. ఆమె యూట్యూబ్‌ పాఠాలను 21,600 మంది సబ్‌స్క్రైబ్‌ చేసి ఫాలో అవుతున్నారు. సెప్టెంబర్‌ 3వ తేదీ నాటికి 35,63,095 మంది వీక్షించారు.
 

మ్యాజిక్‌ టీచర్‌

ఆత్రేయపురం: వాడపల్లి మెయిన్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న చింతా శ్యామ్‌కుమార్‌ మ్యాజిక్‌ మాస్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన ఆయన ప్రవృత్తిగా మ్యాజిక్‌, డ్రాయింగ్‌, డాన్స్‌, గ్రామీణ కళలు, మిమిక్రీ, టాకింగ్‌ డాల్‌, సింగింగ్‌, సంగీతం, అక్షర చిత్రకళ అంశాల్లో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇంత వరకు 20 దేశాల విద్యార్థులు తన సేవలు వినియోగించుకున్నారన్నారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రత్యేక మ్యాజిక్‌ ప్రదర్శనలు నిర్వహించి వచ్చిన మొత్తాన్ని బాధితులకు ఖర్చు చేస్తుంటారు. ఈయనకు యునిసెఫ్‌ నుంచి రెండుసార్లు ఉత్తమ టీచర్‌గా అవార్డులు వచ్చాయి. గోదావరి, కృష్ణా పుష్కరాల్లో పురస్కారాలు లభించాయి. సాహస పుత్ర, ఆంధ్ర పీసీ సర్కార్‌, మ్యాజిక్‌ మెగాస్టార్‌, ఉపాధ్యాయ రత్న, జీవిత సాఫల్య పురస్కారాలను అందుకున్నారు.


సేవాతత్పరుడు ఈ ఉపాధ్యాయుడు

ఆయనో ఉపాధ్యాయుడు.. ఓవైపు విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూనే మరోవైపు తన ఫౌండేషన్‌ ద్వారా అనాథలను గుర్తించి వారికి సేవ చేస్తున్నారు. మదర్‌ థెరిసాను ఆదర్శంగా తీసుకుని అనాథలకు సేవలందిస్తున్న ఈ ఆంగ్ల ఉపాధ్యాయుడు పి.జి.డి.కృపాల్‌ను పలువురు అభినందిస్తున్నారు.

బుచ్చిరెడ్డిపాళెం: మండలంలోని దామరమడుగు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పి.జి.డి.కృపాల్‌ విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పడంలో దిట్ట. విద్యార్థులు ఆంగ్ల భాషపై పట్టుసాధించేలా సరళంగా విద్యను బోధించడం ఆయన నైజం. అంతేకాకుండా విద్యార్థుల్లోని సృజనాత్మకత, కళానైపుణ్యాలను గుర్తించి వారిలోని ప్రతిభను వెలికితీసేలా నృత్యాలు, ప్రదర్శనలు చేయిస్తుంటారు. అలాగే విద్యార్థులకు మంచి చేతి రాతపై శిక్షణ ఇస్తుంటారు.డిప్యూటీ సీఎం, మంత్రి చేతులమీదుగా అవార్డును అందుకుంటున్న కృపాల్‌ (ఫైల్‌) - Sakshi

ఉద్యోగంలో..

వరికుంటపాడు మండలం కాకొల్లువారిపాళెం గ్రామానికి చెందిన జ్ఞానసుందరం–కృపారవం దంపతులకు రెండో సంతానంగా జన్మించిన కృపాల్‌ 7వ తరగతిలోనే చదువులో మంచి ప్రతిభ చాటారు. అలాగే 10వ తరగతి, ఇంటర్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి, డిగ్రీ కావలిలోని జవహర్‌భారతి కళాశాలలో, అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌ చదివారు. అలాగే అంబేడ్కర్‌ యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లిష్‌ను పూర్తి చేశారు. అనంతరం 1996వ సంవత్సరంలో వెంకటాచలం మండలం నిడుగుంటపాళెంలోని ప్రభుత్వ పాఠశాలలో ఎస్‌జీటీగా విధుల్లో చేరాడు. 2007వ సంవత్సరంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్‌ సందర్భంగా అందించే హైట్రీ అవార్డును ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేతులమీదుగా అందుకున్నారు.

మదర్‌ థెరిసా ఆశయాలకు అనుగుణంగా..

పి.డి.జి.కృపాల్‌ మదర్‌ థెరిసా ఆశయాలకు అనుగుణంగా పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో 2020 సంవత్సరంలో అచర్విత ఫౌండేషన్‌ను స్థాపించారు. అనాథలకు బియ్యం, దుస్తులు, కూరగాయలు, ఇతర సామగ్రి ఉచితంగా అందిస్తూ సేవా కార్యక్రమాలను చేపట్టారు. కరోనా సమయంలోనూ పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి అండగా నిలిచారు. అలాగే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారికి, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సాయం అందిస్తూ సేవాతత్పరులుగా నిలుస్తున్నారు.


విజయనగరం జిల్లా ఉత్తమ గురువులు వీరే..

విజయనగరం అర్బన్‌: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల జాబితాను విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. వివిధ కేటగిరీల్లో 66 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపిక చేసింది. ఆంగ్లమాధ్యమ ఉపాధ్యాయులకు నిర్వహించిన పురస్కారపరీక్ష నుంచిఎంపిక చేసిన మరో నలుగురికి ప్రత్యేక అవార్డులు ప్రకటించింది. ఈ ఏడాది జిల్లాలోని 70 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు విజయనగరం కలెక్టరేట్‌ కార్యాలయంలో మంగళవారం నిర్వహించే ఉపాధ్యాయదినోత్సవ కార్యక్రమంలో అవార్డులు అందజేస్తామని డీఈఓ బీ.లింగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ ఏడాది వినూత్నంగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు విద్యాశాఖ అధికారుల బృందం వ్యక్తిగత పరిశీలనలో (బోధన, విద్యాభివృద్ధి వంటి అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు) గుర్తించిన ఉపాధ్యాయులను పురస్కారాలకు ఎంపిక చేసినట్టు వెల్లడించారు. కేటగిరీ వారీగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికై న వారి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌–2 కేటగిరిలో(12 మంది)

రుక్షణ ప్రవీన్‌ (ప్రిన్సిపాల్‌, ఏపీమోడల్‌ స్కూల్‌ విజయనగరం), ఎ.శ్రీనివాస రా వు (పీజీ హెచ్‌ఎం, టీడబ్ల్యూఏహెచ్‌ఎస్‌ బాలురు, కే.జీ.పూడి), టి.జయశ్రీ (ప్రిన్సిపాల్‌, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ వియ్యంపేట), బి.రోహిణి (స్పెషల్‌ ఆఫీసర్‌, కేజీబీవీ, వంగర), ఎం.ఎ.సూర్యనారాయణ (జెడ్పీహెచ్‌ఎస్‌, వంగర), బి.ఉమామహేశ్వరరావు (జెడ్పీహెచ్‌ఎస్‌ బొండపల్లి), సీహెచ్‌.పద్మావతి (జెడ్పీహెచ్‌ఎస్‌, కుమరాం), దతిత్త మధుసూదనరావు (జెడ్పీహెచ్‌ఎస్‌, పిరిడి), ఎస్‌.సత్యనారాయణ (జెడ్పీహెచ్‌ఎస్‌, పొగిరి), బి.రవిశంకర్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, మందరాడ), కె.విక్టోరియా రాణి (జెడ్పీహెచ్‌ఎస్‌, ద్వారపూడి), సీహెచ్‌.అరుణకుమారి (జెడ్పీహెచ్‌ఎస్‌, పతివాడ).

స్కూల్‌ అసిస్టెంట్‌ కేటగిరీలో (23 మంది)

ఎం.రమణ (తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్‌ బుదరాయినవలస), బి.రాము (ఇంగ్లిష్‌, జెడ్పీహెచ్‌ఎస్‌, గొల్లాది), టి.నాగరాజు (సోషల్‌, జెడ్పీహెచ్‌ఎస్‌, గరుగుబిల్లి), పండి సురేష్‌కుమార్‌ (బయాలజీ, ఏపీబాలయోగి గురుకులం, బాడంగి), కరకవలస శ్రీదేవి (ఇంగ్లిష్‌, ఎంపీయూపీ, జె.ఎన్‌.పురం), కోరాడ గోపాలరావు (పీడీ, కస్పా స్కూల్‌ విజయనగరం), కె.వి.నాగలక్ష్మి (తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్‌ కొండవెలగాడ), అరసాడ సురేంద్ర (బయాలజీ, జెడ్పీహెచ్‌ఎస్‌, ధర్మవరం), రేవల్ల ఆదినారాయణ (తెలుగు, జెడ్పీహెచ్‌ఎస్‌ జరజాపుపేట), కె.షణ్ముఖరావు (ఇంగ్లిష్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ ముంజేరు), బి.హేమలత (ఇంగ్లిష్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ రాజాం), కె.మధుసూదనరావు (టీజీటీ మేథ్స్‌, ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్‌ స్కూల్‌ నెల్లిమర్ల), బి.మహేశ్వరరావు (మాథ్స్‌, జెడ్పీహెచ్‌ఎస్‌, ఆర్‌.సి.పురం), జె.పోలరావు (సోషల్‌, జెడ్పీహెచ్‌ఎస్‌, జిన్నాం), పి.శ్రీదేవి (టీజీటీ సైన్స్‌, ఏపీమోడల్‌ స్కూల్‌ మదనాపురం), అజ్జాడ నరేష్‌ (ఫిజికల్‌ సైన్స్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ కొట్యాడ), ఎస్‌.సులేఖ (సీఆర్‌టీ ఇంగ్లిష్‌, కేజీవీబీ విజయనగరం), టి.కిషోర్‌ (హిందీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలుర స్కూల్‌, ఎస్‌.కోట), వి.రామచంద్రుడు (పీడీ, ట్రైబుల్‌ వెల్ఫేర్‌ బాలు, నెల్లిమర్ల), టి.అరుణ (సీఆర్‌టీ మాథ్స్‌, కేజీబీవీ భోగాపురం), జి.సత్యవతి (పీజీటీ ఇంగ్లిష్‌, కేజీబీవీ ఎల్‌.కోట), పల్లి శ్రీనివాసరావు (ఇంగ్లిష్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ గొట్లాం).

సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ కేటగిరీలో (31 మంది)

ఎం.ఉమారాణి (ఒకేషనల్‌, కస్పా విజయనగరం), ఏఎస్‌రోహిణి (ఎంసీపీఎస్‌, కంచర్లవారి వీధి విజయనగరం), ప్రేమ రామచంద్రరావు (కంటకాపల్లి), బాల మోహనరావు (లక్ష్మిపేట), బంకపల్లి శివప్రసాదరావు (చినమధుపాడ, గంట్యాడ మండలం), యు.ప్రమీలారాణి (చింతలవలస), యూ.ఉమాదేవి (కొండ్రాజుపేట), బీ.కాశిరాజు (గొల్లపేట), సీహెచ్‌.రాము (పూడివలస), యలకల పైడిరాజు (కొయ్యకొండవలస), పూడి మహేష్‌ (పనసల పూడి), శంబర శారద (అలజంగి), టి.రమేష్‌ (సరయ్యవలస), తీడ రామారావు (మల్లునాయుడు పేట), వల్లూరి రామబ్రహ్మం (కొటారుబిల్లి జంక్షన్‌), బి.నాగేశ్వరరావు (గోషాడ), ఎం.వి.సత్యనారాయణ (అట్టాడ, జామి మండలం), దోసి లక్ష్మి (గాంధీనగర్‌), డోకుల నాగమణి (కేఎంవీపాలెం), బి.గోపినరసింగరావు (జీజీవలస), దన్నాన అప్పలనాయుడు (బైరిపురం), కె.రాజేష్‌ (చినపల్లుపేట), కప్పల అప్పలరాజు (పోరాం), బి.భువనేశ్వరరావు (మజ్జిరామునిపేట), వి.మహలక్ష్మి (మిర్తివలస), కాపుగంటి జగదీశ్వరి (టీవీవర, ఎస్‌.కోట), యేగిరెడ్డి అప్పలనాయుడు (నెమలాం), పి.సత్యనారాయణ (చామలాపల్లి), బి.ఆదెమ్మ (టీడబ్ల్యూఏ హెచ్‌ఎస్‌ బాలికల, విజయనగరం), ఆర్‌.అప్పలనరసమ్మ (ఎంపీయూపీ తాలాడ).

ఇంగ్లిష్‌ మాద్యమ టీచర్ల ప్రావీణ్య పరీక్ష అవార్డులు

తెన్నేటి శ్రీనివాస్‌ (మేథ్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌, ఏపీ మోడల్‌ స్కూల్‌, విజయనగరం), బుద్దరాజు హరి కిషోర్‌ (ఎస్‌జీటీ, ఎంపీపీఎస్‌ కామాక్షినగర్‌, విజయనగరం), దారా అనురాధ (బయాలజీ స్కూల్‌ అసిస్టెంట్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ చీపురుపల్లి), పెంటపాటి రాజే ష్‌ (సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ గా జులరేగ, విజయనగరం).

Published date : 05 Sep 2023 02:01PM

Photo Stories