Skip to main content

CBSE 10th Results : 10వ త‌రగ‌తి ఫ‌లితాల్లో.. 100% మార్కులు వ‌చ్చినందుకు చాలా బాధ‌గా ఉంది..! ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తమ పిల్లలు ఫస్ట్‌ క్లాస్‌లో పాసైతేనే తల్లిదండ్రులు సంతోషంలో అందరికీ చెప్పుకుంటారు.
CBSE 10th Results
CBSE 10th Results

అలాంటిది 100 శాతం మార్కులు సాధిస్తే ఎగిరి గంతేస్తారు. తమ పిల్లల గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. కానీ, ఓ తల్లి తన కూతురికి పదో తరగతిలో 100 శాతం మార్కులు వచ్చాయని బాధపడుతున్నారు. ఆమె బాధకు గల కారణాలేంటి?

CBSE 10th Result 2022 Toppers : సీబీఎస్‌ఈ టెన్త్‌ టాపర్లు వీరే.. ఇలా అర్థం చేసుకుని చదివా.. పూర్తి మార్కులు సాధించానిలా..

CBSE 10th Result 2022 : ఎట్ట‌కేల‌కు సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుద‌ల‌.. రిజ‌ల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

ఓ పక్క సంతోషం.. మరోవైపు బాధ..
హర్యానాకు చెందిన అంజలి యాదవ్‌ అనే విద్యార్థిని ఇటీవల సీబీఎస్‌ఈ ప్రకటించిన 10వ తరగతి పరీక్షా ఫలితాల‍్లో 100 శాతం మార్కులు సాధించింది. కానీ, ఆమె తల్లి మాత్రం ఓ పక్క సంతోషంగా ఉన్నా.. మరోవైపు బాధపడుతున్నారు. తన కుమార్తెను పైచదువులకు ఏ విధంగా పంపించాలో తెలియటం లేదని తనలోతానే మదనపుడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కడాని కుటుంబం వారిది. దీంతో పైచదువులకు అయ్యే ఖర్చుపై ఆందోళన చెందుతున్నారు.

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షల విధానంలో సంస్కరణలు ఇవే.. ఈ సారి మాత్రం..

డాక్టర్‌ కావాలనేది క‌ల‌.. కానీ..
విద్యార్థినికి డాక్టర్‌ కావాలనేది కల. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌లో చదవాలనుకుంటోంది. కానీ, వారి కుటుంబంలో తల్లి పని చేస్తేనే పూట గడిచే పరిస్థితులు ఉన్నాయి. వారికి కొద్ది పాటి వ్యవసాయ భూమి ఉన్నా.. అందులో పండేవి ఇంటికే సరిపోవు. విద్యార్థిని తండ్రి పారామిలిటరీలో చేరిన క్రమంలో 2010లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అనారోగ్య సమస్యలతో 2017లో తన విధుల నుంచి వైదొలిగారు. ఆ సమయంలో పీఎఫ్‌ ద్వారా రూ.10 లక్షలు అందాయి. కానీ, అవి అప్పులు, ఇతర ఖర్చులకే అయిపోయాయని వాపోయారు విద్యార్థిని తల్లి ఊర్మిళ. విద్యార్థిని సోదరుడు ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్నాడు. సిలార్పుర్‌లో నివాసం ఉంటున్న విద్యార్థిని అంజలి.. మహోందర్‌గఢ్‌లోని ఇండస్‌ వాలీ పబ్లిక్‌ స్కూల్‌లో చదవుతోంది. ‘ఆమె కష్టపడి చదువుతుంది. తాను అనుకున్నది సాధిస్తే మన కష్టాలు తొలగిపోతాయని చెబుతుంటుంది. ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇస్తూ చదువుపై దృష్టి పెట్టాలని చెప్పేదాన్ని. ’ అని పేర్కొన్నారు ఊర్మిళ.

CBSE 12th Result 2022 Link : సీబీఎస్‌ఈ 12వ తగరతి ఫలితాలు విడుదల.. ఈ వెయిటేజీ మార్కులను కలిపి..

నెలకి రూ.20వేల స్కాలర్‌షిప్‌..
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్ జూలై 24వ తేదీ (ఆదివారం) ఫోన్‌ చేసి విద్యార్థినిని అభినందించారు. ఈ క్రమంలో తన కుటుంబ పరిస్థితుల గురించి సీఎంకు వివరించింది విద్యార్థిని. దీంతో ఆమెకు నెలకు రూ.20వేల స్కాలర్‌షిప్‌ ‍ప్రకటించారు ముఖ్యమంత్రి. అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ‘ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించటమే గగనంగా మారింది. అందుకే మా పరిస్థితులపై ముఖ్యమంత్రికి తెలియజేశాను. స్కాలర్‌షిప్‌ ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. ’ అని విద్యార్థిని తల్లి ఊర్మిళ పేర్కొన్నారు.

Published date : 25 Jul 2022 12:32PM

Photo Stories