యూజీసీ నెట్-2020(జూన్) షెడ్యూల్ విడుదల...దరఖాస్తులకు చివరి తేది ఇదే..
Sakshi Education
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ).. యూజీసీ తరపున నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్)ను నిర్వహిస్తోంది. నెట్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు అర్హత లభిస్తుంది. అలాగే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్)లను దక్కించుకోవచ్చు.
తాజాగా ఎన్టీఏ యూజీసీ-నెట్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఔత్సాహిక అభ్యర్థులకు ఉపయోగపడేలా యూజీసీ నెట్ పూర్తి సమాచారం...
ఎన్టీఏ ఏటా జూన్, డిసెంబర్లో యూజీసీ నెట్‌ను నిర్వహిస్తోంది. జాతీయ స్థారుులో నిర్వహించే ఈ పరీక్ష ద్వారా యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు పోటీపడే అర్హత లభిస్తుంది. అలాగే, మెరిట్‌లిస్టులో టాప్‌లో నిలిచిన విద్యార్థులకు జేఆర్ఎఫ్(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్) అందితే.. మరికొంత మందికి అసిస్టెంట్ ప్రొఫెసర్, జేఆర్ఎఫ్... రెండిటికీ అర్హత లభిస్తుంది.
నెలకు రూ.31వేల ఫెలోషిప్:
నెట్లో అత్యుత్తమ ప్రతిభ ద్వారా జేఆర్ఎఫ్కు ఎంపికైతే ప్రతిష్టాత్మక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లలో పరిశోధన కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. ఆ సమయంలో అభ్యర్థికి నెలకు రూ.31 వేలు ఫెలోషిప్‌గా అందుతుంది. దీంతోపాటు హెచ్ఆర్ఏ ఉంటుంది. పరిశోధన చేసే ప్రాంతాన్ని బట్టి 8 శాతం, 16 శాతం, 24 శాతం వరకు హౌజ్ అలవెన్సులు చెల్లిస్తారు. అలాగే కాంటింజెన్సీ ఫండ్ పేరుతో ఏటా నిర్ణీత మొత్తం విద్యార్థులకు దక్కుతుంది. జేఆర్ఎఫ్ అందుకున్న రెండేళ్ల తర్వాత సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(ఎస్ఆర్ఎఫ్) లభిస్తుంది. అప్పుడు నెలకు రూ.35 వేల ఫెలోషిప్ అందుతుంది. దీనికి అలవెన్సులు అదనం.
అసిస్టెంట్ ప్రొఫెసర్ :
జేఆర్ఎఫ్కు ఎంపికైన అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు కూడా అర్హులే. యూజీసీ నెట్లో మెరిట్ లిస్ట్‌లో నిలిస్తే.. దేశంలోని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఎలిజిబిలిటీ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలో ఉత్తీర్ణులకు రాష్ట్ర స్థారుు వర్సిటీలు, ఇన్స్టిట్యూట్లలో అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో ప్రాధాన్యం ఉంటుంది.
పీఎస్‌యూ కొలువు :
యూజీసీ నెట్ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థలు నియామకాలు చేపట్టే అవకాశం ఉంటుంది. పీఎస్‌యూలు, ఆర్ అండ్ డీ, మేనేజ్మెంట్, కార్పొరేట్ కమ్యూనికేషన్స, హ్యూమన్ రిసోర్సెస్, ఫైనాన్స తదితర విభాగాల్లో నియామకాలకు యూజీసీ నెట్ ఉత్తీర్ణులను పరిగణనలోకి తీసుకునే వీలుంది. టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ నిర్వహించే లెక్చరర్ పోస్టులకు యూజీసీ నెట్ స్కోర్‌తో పోటీ పడవచ్చు.
అర్హతలు :
మొత్తం 84 సబ్జెక్టుల్లో యూజీసీ నెట్ పరీక్షను ఆన్లైన్ విధానంలో(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) నిర్వహిస్తున్నారు. హ్యుమానిటీస్(భాషలు సహా), సోషల్ సైన్స, కంప్యూటర్ సైన్స అండ్ అప్లికేషన్స, ఎలక్టాన్రిక్స్ సైన్స విభాగాల్లోని సబ్జెక్టుల్లో నెట్‌ను నిర్వహిస్తారు. ఆయా సబ్జెక్ట్‌ల్లో పీజీ లేదా తత్సమాన కోర్సులో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు నెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 5 శాతం మార్కుల సడలింపు ఉంటుంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు సైతం దరఖాస్తుకు అర్హులే.
పరీక్ష విధానం :

- నెట్‌ను రెండు పేపర్లుగా నిర్వహిస్తారు. ప్రశ్నపత్రాలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. పరీక్షకు కేటారుుంచిన సమయం మూడు గంటలు. పేపర్ల మధ్య ఎటువంటి విరామ సమయం ఉండదు.
- అన్ని సబ్జెక్టులకు పేపర్ 1 కామన్‌గా ఉంటుంది. ఇది 50 ప్రశ్నలు-100 మార్కులకు జరుగుతుంది. రీసెర్చ్/టీచింగ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు ఉంటాయి.
- అభ్యర్థి స్పెషలైజేషన్(ఎంచుకున్న) సబ్జెక్టుపై పేపర్-2 ఉంటుంది. ప్రశ్నపత్రంలో 100 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. రెండు పేపర్లలోనూ నెగిటివ్ మార్కుల విధానం లేదు.
- మొత్తంగా రెండు పేపర్లలో కలిపి జనరల్ అభ్యర్థులకు 40 శాతం, రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు 35 శాతం మార్కులను కనీస ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ రెండు పేపర్లలో సాధించిన మార్కుల ఆధారంగా.. పరీక్షకు హాజరైన వారిలో మొదటి(టాప్) 6 శాతం మందికి అసిస్టెంట్ ప్రొఫెసర్‌షిప్‌కు అర్హత లభిస్తుంది. అత్యుత్తమ ప్రతిభ చూపిన అభ్యర్థులను జేఆర్ఎఫ్కు ఎంపిక చేస్తారు.
ప్రిపరేషన్ ఇలా..
- పేపర్-1లో టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, దేశంలో ఉన్నత విద్య-ప్రస్తుత పరిస్థితులు, సమకాలీన విద్యా రంగ సంబంధిత అంశాలపై దృష్టిపెట్టాలి.
- నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇచ్చే ర్యాంకులు, వర్సిటీలకు విశిష్ట గుర్తింపు లభించిన సంఘటనలు గుర్తుపెట్టుకోవాలి.
- పేపర్ 1లో రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగం కీలకం. కాబట్టి వేగంగా చదవడం, అర్థం చేసుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి.
- టీచింగ్ ఆప్టిట్యూడ్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ కోసం ఏదైనా ఒక పుస్తకాన్ని అనుసరిస్తే సరిపోతుంది.
- డేటా ఇంటర్‌ప్రిటేషన్ నుంచి లాజికల్ రీజనింగ్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించే ప్రశ్నలు కూడా అడుగుతారు. అభ్యర్థులు నిర్దిష్ట డేటా నుంచి ముఖ్యాంశాలను గుర్తించే విశ్లేషణా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి.
- పేపర్ 2 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో సబ్జెక్టుపై పట్టు సాధించాలి. అభ్యర్థులు తమ సబ్జెక్ట్‌కు సంబంధించి పీజీ సిలబస్‌ను పూర్తిగా చదవాలి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నా.. ప్రాథమిక అంశాలపై పట్టు అవసరం. సిలబస్‌లో పేర్కొన్న ప్రతి టాపిక్‌ను భిన్న కోణాల్లో చదవాలి.
- మ్యాచింగ్, అప్లికేషన్లపై ప్రశ్నలు అడుగుతారు. సిలబస్‌లో పేర్కొన్న అంశాలపై డిగ్రీ, పీజీ స్థాయి ప్రామాణిక పుస్తకాలను అధ్యయనం చేయాలి. సొంత నోట్స్ రాసుకొని ప్రిపేరవ్వాలి. అన్ని అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. మాక్ టెస్ట్‌లు రాయాలి. నెగెటివ్ మార్కుల విధానం అమల్లో లేదు. కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడం మేలు.
ముఖ్యసమాచారం :
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 16, 2020
హాల్ టికెట్ల జారీ ప్రారంభం: మే 15 నుంచి
నెట్ నిర్వహణ తేదీలు: జూన్ 15-20
ఫలితాల వెల్లడి: జూలై 5, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేదీ: ఏప్రిల్ 16, 2020
హాల్ టికెట్ల జారీ ప్రారంభం: మే 15 నుంచి
నెట్ నిర్వహణ తేదీలు: జూన్ 15-20
ఫలితాల వెల్లడి: జూలై 5, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ugcnet.nta.nic.in
Published date : 14 Mar 2020 05:34PM