వినూత్న ఆలోచనలు...ఎడ్యుటెక్ స్టార్టప్‌లు
Sakshi Education
చదువే ఆయుధం. ఎలాంటి వారినైనా ఉన్నత స్థాయికి చేరుస్తుందిది!! అందుకే... తగిన సంపాదన లేకపోయినా.. అప్పోసప్పో చేసైనా పిల్లల్ని చదివించాలనుకుంటారు తల్లిదండ్రులు. అందుకే...ఈ బంగారు భవిష్యత్తు చుట్టూ ఇపుడు బోలెడన్ని వ్యాపారాలు అల్లుకుంటున్నాయి. కొత్తకొత్త ఆలోచనలే కంపెనీలుగా మారుతున్నాయి. పిల్లల్ని బస్సులో స్కూలుకు పంపితే... ఆ బస్సు స్కూలుకు చేరిందో లేదో చెబుతుందో కంపెనీ!. స్కూల్ పిల్లలకి టైముకు లంచ్‌బాక్స్ అందిస్తుంది మరో కంపెనీ. ట్యూషన్ మాస్టర్ని ఇంటికి పంపించేదొకటైతే... ఆన్‌లైన్లో ట్యూషన్ చెప్పేది మరోటి.సిలబస్‌ను ఎంచక్కా ట్యాబ్లెట్లో అందించడానికి... పిల్లల ప్రోగ్రెస్ చెబుతూ, ఫీజులు సైతం కట్టడానికి... పోటీ పరీక్షలకు సిద్ధం చేయటానికి... కెరీర్ గెడైన్స్ నుంచి ఉద్యోగాలను చూపించే దాకా.. ఇలా రకరకాల కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వీటిలో భారీ నిధులతో సాగుతున్న పెద్దపెద్దవే కాదు. బుడిబుడి అడుగుల స్టార్టప్‌లూ ఎక్కువే! ఈ సంస్థలు కొన్ని వేల మందికి ఉపాధి కల్పించటమే కాక..వందల కోట్ల రూపాయల వ్యాపారాన్నీ సృష్టిస్తున్నాయి. నేటి టెక్నాలజీ యుగంలో ఆ కొత్త చదువుల ప్రపంచాన్ని పరిచయం చేసే కథనం...
సమయానికి... లంచ్‌బాక్స్ ఇచ్చేస్తారు!
ప్రణయ్, స్రవంతి ఇద్దరూ ఉద్యోగులే. ఉదయం తొమ్మిదింటికల్లా ఆఫీసుకి వెళ్లాలి. ఒకటో తరగతి చదువుతున్న వారి కుమారుడు ఆశిష్ 8:30 కల్లా స్కూల్లో ఉండాలి. ఈ లోపు ఇంట్లో ఓ యుద్ధవాతావరణమే... తమకు, ముఖ్యంగా తమ పిల్లాడికి బ్రేక్ ఫాస్ట్, లంచ్ వంటివి సిద్ధం చేయడం.. రోజూ వారికొక ప్రహసనమే. ఇదిగో...ఇలాంటి సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టి తల్లిదండ్రులకు ఊరట కలిగించేలా ఇప్పుడు పలు ఎడ్‌టెక్ స్టార్టప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ స్టార్టప్స్‌కు సంబంధించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునో.. లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ అయో.. తమ పిల్లల స్కూల్ వివరాలు, బ్రేక్ ఫాస్ట్, లంచ్ సమయాలు తెలియజేసి, ఆ సమయంలో వారికి అందించే విధంగా ఆర్డర్ చేస్తే చాలు. ఇక తర్వాత పని ఆ సంస్థలే చూసుకుంటాయి. సరిగ్గా మీరు చెప్పిన సమయానికి మీ పిల్లలకు ఫుడ్ డెలివరీ చేస్తాయి. వీటికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది.
చెన్నైలో లంచ్‌బాక్స్ ఎంసీ, బైట్‌ఫ్రెష్... విజయవంతంగా నడుస్తున్న స్కూల్ డబ్బా... ఇంట్లో వండిన వంటను స్కూల్ పిల్లలకు అందించడానికి హైదరాబాద్ కేంద్రంగా ఆరంభమైన డబ్బావాలా తరహా ‘బెంటో వ్యాగన్’... ఇవన్నీ విద్యార్థులకు రుచికరమైన లంచ్‌బాక్స్‌ను అందించేవే. పోషకాల విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ముందుకెళుతున్న ఈ సంస్థలకు... ఈ రంగంలో ఉన్న అపార అవకాశాలను చాటిచెబుతూ నిధులూ బాగానే వస్తున్నాయి.
బస్సులో రవాణా.. ట్రాక్ చేస్తారు కూడా !
టైమ్ ఆరున్నరవుతోంది. రోజూ సాయంత్రం అయిదున్నరకల్లా కూతురుని ఇంటి దగ్గర డ్రాప్ చేసే స్కూల్ బస్.. ఇంకా రాకపోవడంతో మోనిక మనసులో ఆందోళన. టెన్షన్‌తో స్కూల్‌కు ఫోన్ చేస్తే స్పందన లేదు. స్కూల్ స్థాయి పిల్లల విషయంలో తల్లిదండ్రులకు నిరంతరం ఎదురయ్యే సమస్యే ఇది. స్కూల్ బస్ సర్వీస్‌ను ఎంచుకున్నప్పటికీ... పికప్ అండ్ డ్రాపింగ్ పరంగా టెన్షన్. ఈ టెన్షన్‌కు పరిష్కారం చూపించేందుకు ప్రత్యేక స్టార్టప్స్ వచ్చేశాయి. జియో ట్యాగింగ్ విధానం ద్వారా.. సదరు స్కూల్ బస్ లేదా వ్యాన్ ఏ ప్రాంతంలో ఉంది? మీ ఇంటికి చేరడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది? తదితర అన్ని వివరాలు తెలియజేస్తాయివి. అంతేకాకుండా.. ఒకవేళ బస్ రెగ్యులర్‌గా వచ్చే దారిలో కాకుండా వేరే దారిలో వెళుతున్నా.. లేదా రెగ్యులర్‌గా వచ్చే సమయానికంటే నిమిషాల వ్యవధిలో ఆలస్యమైనా.. వెంటనే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యాలకు అలర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాయి. వీటికి కూడా ఆదరణ పెరుగుతోంది. ఆస్‌పాక్స్ (Ospox), నార్త్‌స్టార్ వంటి సంస్థలు.. ఏడాది వ్యవధిలోనే 40 శాతంపైగా వ్యాపార వృద్ధి సాధించడమే ఇందుకు నిదర్శనం.
క్యాంపస్‌లో కనిపెడుతుంటారు మరి !
ప్రస్తుతం మన నగరాలు, పట్టణాలు ఎంతమాత్రం సేఫ్ కాదన్న విషయం తెలిసిందే! మన నగరాల్లో ఒక్కసారి ఇల్లు దాటారంటే.. పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోలేని పరిస్థితి. కాలేజ్‌కు వెళ్లారా? వెళితే క్లాస్‌లకు హాజరవుతున్నారా?.. తల్లిదండ్రులకు తరచూ ఎదురయ్యే ఇలాంటి సందేహాలు, ఆందోళనలకు సైతం పరిష్కారం చూపేలా.. ఇప్పుడు ఎడ్యుటెక్ స్టార్టప్స్ అందుబాటులోకి వచ్చాయి. కళాశాలలో విద్యార్థుల కదలికలు, వారు క్యాంటీన్‌లో ఉన్నారా? లేదా క్లాస్‌రూంలోనే ఉన్నారా? వంటి విషయాలను జీపీఎస్ ద్వారా తల్లిదండ్రులకు, యాజమాన్యాలకు ఇట్టే తెలియజేస్తున్నాయి. గురుస్పర్శ్ వంటి సంస్థలు క్యాంపస్‌లో విద్యార్థుల కదలికలతోపాటు వారి అటెండెన్స్ వివరాలను సైతం అందిస్తున్నాయి.
‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ ఇవ్వటానికి సిద్ధం :
స్కూల్ లేదా కాలేజీకి వెళ్లి రావడం, ఆ తర్వాత ఇంట్లో గంటల కొద్దీ పుస్తకాలతో గడపడం, ఇది తల్లిదండ్రులకు కనిపించే విషయం. కానీ.. పరీక్షల్లో చూస్తే అంతంతమాత్రంగానే మార్కులు. దీనికి పరిష్కారం? విద్యార్థుల లెర్నింగ్ సామర్థ్యాన్ని, అవగాహన స్థాయిని అంచనా వేయడమే. ఇప్పుడు పలు స్టార్టప్ సంస్థలు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ టూల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిద్వారా ప్రీ స్కూల్ నుంచి ప్రొఫెషనల్ కోర్సుల వరకు... విద్యార్థులకు ఆయా సబ్జెక్ట్‌లలో ఆన్‌లైన్ విధానంలోనే టెస్ట్‌లు నిర్వహించి వారి లెర్నింగ్ సామర్థ్యాన్ని తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా అవగాహన స్థాయిలో లోపాలుంటే.. అందుకు కారణాలను కూడా విశ్లేషిస్తున్నాయి. వీటి ఆధారంగా తమ పిల్లలకు మరింత మెరుగ్గా ఎలాంటి అభ్యసన సదుపాయాలు కల్పించాలనే విషయంలో తల్లిదండ్రులకు స్పష్టత లభిస్తోంది.
ఇంటికొచ్చి ట్యూషన్ చెబుతారు !!
స్కూల్ స్థాయిలో పిల్లలు ఏదో ఒక సబ్జెక్ట్‌లో వెనుకబడు తుంటారు. అందుకు కార ణాలు అనేకం. కొంతమంది క్లాస్‌రూంలో చెప్పిన పాఠాలు అర్థం చేసుకోలేరు. టీచర్ చెప్పేటప్పుడు సందేహం వచ్చినా.. అందరి ముందు టీచర్‌ను అడగాలంటే బిడియం. ఇలాంటి సమస్యలకు ఇప్పుడు ప్రధాన పరిష్కారంగా నిలుస్తోంది హోంట్యూషన్ విభాగం. ‘జెన్‌ఎక్స్ ్ట స్టూడెంట్స్’, ‘ఫ్లిప్‌క్లాస్’, ‘క్రియో (Qriyo),’ వంటి ఎడ్యుటెక్ స్టార్టప్ సంస్థలు హోంట్యూటర్స్‌ను, పేరెంట్స్‌ను ఆన్‌లైన్‌లో అనుసంధానం చేసే సదుపాయం కల్పిస్తున్నాయి. ఆయా వెబ్‌సైట్లలో సబ్జెక్ట్‌ల వారీగా టీచర్ల ప్రొఫైల్స్‌ను పరిశీలించి తమ పిల్లల అవసరాలకు సరితూగే టీచర్‌తో నేరుగా సంప్రదించే అవకాశం కల్పిస్తున్నాయి.
ఆడుతూ పాడుతూ చదివేయొచ్చు...
పాఠశాల స్థాయిలో విద్యార్థులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య.. పాఠాలు సరిగా అర్థం కాకపోవడం. దీనికి కారణం.. మన విద్యా విధానం థియరిటికల్ అప్రోచ్‌తో ఉండటమే. దీంతో చాలామంది విద్యార్థులు సబ్జెక్ట్‌లలో వెనుకంజలో ఉంటున్నారు. దీనికి పరిష్కారంగా.. విద్యార్థుల్లో సదరు సబ్జెక్ట్ పట్ల ఆసక్తి పెంచడమే కాకుండా.. ఆ సబ్జెక్ట్‌పై అవగాహన కల్పించే విధంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ విధానానికి కూడా ఎడ్యుటెక్ సంస్థలు ఆన్‌లైన్ రూపం ఇస్తున్నాయి. నయీదిశ, క్యూమ్యాథ్స్ వంటి సంస్థలు వర్చువల్ ల్యాబ్స్, పజిల్స్, క్విజ్‌ల రూపంలో విద్యార్థులు తమకు బోర్ అనిపించే సబ్జెక్ట్‌లలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్‌ను అందిస్తున్నాయి.
ఫీజుల కోసం రుణాలిస్తారు :
ప్రస్తుత పరిస్థితుల్లో కిండర్ గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు.. ఫీజులు భారం రూ.లక్షల్లో ఉంటోంది. బ్యాంకుల ద్వారా విద్యా రుణ సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ.. ఎన్నో నిబంధనలు. వీటికి పరిష్కారంగా ఇప్పుడు విద్యా రుణాలు అందించే ఎడ్యుటెక్ స్టార్టప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫిన్‌మొమెంటా, జస్ట్ మనీ వంటి సంస్థలు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి. దీంతోపాటు విద్యారుణాలకు సంబంధించి పలు బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులతో అనుసంధానం చేసే పీర్ టు పీర్ రుణాలిచ్చే స్టార్టప్స్ సైతం అందుబాటులోకి వచ్చాయి.
అడ్మిషన్స్.. ఆన్‌లైన్లోనే...
ప్రస్తుతం నర్సరీలో అడ్మిషన్ కావాలన్నా.. కాళ్లరిగేలా తిరగాల్సిందే. రూ.లక్షల్లో ఖర్చు పెట్టాల్సిందే. వీటన్నిటికీ ఎన్నో వ్యయప్రయాసలు. వీటికి పరిష్కారంగా ఇప్పుడు ఆన్‌లైన్ విధానంలో అడ్మిషన్, ఫీ పేమెంట్ వంటి వ్యవహారాలను చక్కబెట్టే ఎడ్యుటెక్ స్టార్టప్స్ రూపుదిద్దుకున్నాయి. ఈ ప్రవేశ్, క్లేవర్‌మైండ్ వంటి స్టార్టప్ సంస్థలు నర్సరీ నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ వరకు ఈ తరహా సేవలు అందిస్తున్నాయి.
ఆసక్తికి సరితూగే కెరీర్స్...
నేటి పోటీ ప్రపంచంలో అందరి చూపూ.. ఇంజనీరింగ్, టెక్నాలజీ మెడికల్ వంటి కోర్సులవైపే. కానీ.. వాటిలో తమ పిల్లలకు నిజమైన ఆసక్తి ఉందా? లేదా? ఆ కోర్సుల్లో చేర్పిస్తే రాణించగలరా? అని ఆలోచించట్లేదు. మరికొందరు తల్లిదండ్రులు, విద్యార్థులు తమ పిల్లల ఆసక్తి, సామర్థ్యం, వాటికి సరితూగే కోర్సుల గురించి ఆరా తీస్తున్నారు. ఇలాంటి సేవలందించేందుకు కూడా ఎడ్‌టెక్ స్టార్టప్స్ రూపొందాయి. సైకోమెట్రిక్ టెస్ట్‌ల ద్వారా విద్యార్థుల మానసిక స్వభావం తెలుసుకోవడం, ఆయా సబ్జెక్టులకు సంబంధించి చిన్నపాటి పరీక్షలు నిర్వహించి వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా.. ఏ సబ్జెక్ట్ అంటే ఆసక్తో గుర్తించి.. దానికి అనుగుణంగా సదరు విద్యార్థికి సరితూగే కోర్సులు, ఆ తర్వాత లభించే కెరీర్స్ గురించి తెలియజేస్తున్నాయి. ఇలాంటి సేవల విషయంలో మెంటోరియా, ఐడ్రీమ్ కెరీర్, మైండ్లర్ వంటి సంస్థలు ముందంజలో నిలుస్తున్నాయి.
ఆన్‌లైన్ ట్యుటోరియల్స్.. ఆకాశమే హద్దు
ఎడ్యుటెక్ స్టార్టప్స్‌లో అత్యంత ఆదరణ పొందుతున్న విభాగం.. ఆన్‌లైన్ ట్యుటోరియల్స్. ఇప్పుడు వందల సంఖ్యలో ఆన్‌లైన్ ట్యుటోరియల్ ఎడ్‌టెక్ స్టార్టప్ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. అకడమిక్‌గా కిండర్ గార్టెన్, హైస్కూల్, సీనియర్ సెకండరీ, డిగ్రీ, ప్రొఫెషనల్ కోర్సులు. ఇలా ప్రతిస్థాయిలో పదుల సంఖ్యలో ఆన్‌లైన్ ట్యుటోరియల్ ఎడ్‌టెక్ స్టార్టప్స్ సేవలందిస్తున్నాయి. విద్యార్థులు చేయాల్సిందల్లా.. సంబంధిత యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునో లేదా వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకునో.. తమకు అవసరమైన కోర్సు.. అందుబాటులో ఉన్న టీచర్లు, టీచింగ్ సమయాలను బేరీజు వేసుకుని రిజిస్టర్ చేసుకోవడమే. పోటీ పరీక్షలు.. ఆన్‌లైన్ కోచింగ్ కోసం లెక్కలేనన్ని సంస్థలు యాప్, వెబ్‌సైట్స్ ద్వారా సేవలందిస్తున్నాయి. జేఈఈ, క్యాట్, సివిల్స్, బ్యాంకింగ్, నీట్, గేట్, జీప్యాట్.. ఇలా ప్రతి పోటీ పరీక్షకు ఇప్పుడు ఆన్‌లైన్ ట్యూటరింగ్ సదుపాయం అందుబాటులో ఉంది. బైజూస్, అన్‌అకాడమీ, టాపర్, సింప్లీ లెర్న్, వేదాంతు, ఎంగురు వంటి సంస్థలు అకడమిక్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కు ఆన్‌లైన్ ట్యూషన్స్, మెటీరియల్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి.
మెట్రో నగరాల్లోనే అధికంగా..
ప్రస్తుతం ఎడ్‌టెక్ సంస్థలు బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాలకే పరిమితమయ్యాయి. దీనికి ప్రధాన కారణం.. సంస్థలు స్థాపించే వ్యక్తులు, ఔత్సాహికులు ఆయా ప్రాంతాలకు చెందిన వా రే కావడం.. మార్కెట్, యూజర్స్ పరంగా ఆయా నగరాల్లోనే ఎక్కువగా అవకాశముందని భావించడం.
భారీగా వృద్ధి:
పెట్టుబడుల వెల్లువ..

- ఎడ్‌టెక్ సంస్థలు, వాటికి లభిస్తున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుంటే.. మూడేళ్లలో దేశంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో భారీగా వృద్ధి నమోదు కానుంది.
- కేపీఎంజీ, గూగుల్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం 2021 నాటికి ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ రంగం 1.96 బిలియన్ డాలర్లకు చేరుకోనుంది. అంతేస్థాయిలో యూజర్ల సంఖ్య కూడా ప్రస్తుతం ఉన్న 1.6 మిలియన్ల నుంచి 9.6 మిలియన్లకు పెరగనుంది.
పెట్టుబడుల వెల్లువ..
- ఎడ్‌టెక్ స్టార్టప్స్‌కు లభిస్తున్న ఆదరణను పరిగణనలోకి తీసుకుంటున్న ఫండింగ్ ఏజెన్సీలు.. వీటికి భారీ మొత్తంలో నిధులు సమకూర్చేందుకు ముందుకొస్తున్నాయి. మిలియన్ డాలర్లలో పెట్టుబడి పెడుతున్నారు.
- తాజాగా అన్‌అకాడమీ 21 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకోగా.. బైజూస్ సంస్థ కూడా భారీ మొత్తంలో నిధులు పొందింది.
- ఎర్లీ స్టేజ్ స్టార్టప్స్.. ఏడాది, ఏడాదిన్నర వ్యవధిలోపే సగటున రూ.కోటి రూపాయల నిధులు సమకూర్చుకుంటున్నాయి.
విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రయోజనం : ఎడ్‌టెక్ స్టార్టప్స్ సంస్థలు అందిస్తున్న సేవలు విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రయోజనం. తల్లిదండ్రులు.. తమ పిల్లలకు అనువైన స్కూల్ అన్వేషణ పరంగా పరిమితంగా ఆలోచిస్తారు. మంచి స్కూల్స్‌కు సంబంధించిన సమాచారం తెలియజేయడమే కాకుండా.. వారు ఇంటి వద్దే దరఖాస్తు తదితరాలు పూర్తిచేసేలా సేవలందిస్తున్నాం. త్వరలో మిగతా నగరాలకూ విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాం. - ఆశిష్ గుప్తా, అడ్వైజర్, క్లెవర్‌మైండ్. |
అన్ని విధాలా ఉపయోగం : ఆన్‌లైన్ ట్యుటోరియల్స్ విద్యార్థులకు అన్ని విధాలుగా ఉపయోగం. ఆన్‌లైన్ ట్యుటోరియల్ రిసోర్సెస్‌లో కేవలం లెక్చర్స్‌కే పరిమితం కాకుండా.. పరీక్షలు నిర్వహించడం, ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులు తాము సంబంధిత సబ్జెక్ట్ లేదా అంశంలో ఏ స్థాయిలో చదవాలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు అన్ని ప్రవేశ పరీక్షలూ ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో దానిపైనా అవగాహన ఏర్పడుతుంది. - హేమంత్ గోటేటి, ఫౌండర్, టాపర్‌డాట్‌కామ్. |
Published date : 14 Aug 2018 05:31PM