విద్యాసంస్థలకు.. న్యాక్ నూతన గ్రేడింగ్
Sakshi Education
న్యాక్ (నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్).. ఉన్నత విద్యా సంస్థలకు సుపరిచితమైన పేరు. ‘న్యాక్ అక్రెడిటేషన్’ ఉన్న సంస్థలకు విద్యార్థులు పెద్ద పీటవేస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న ‘న్యాక్’.. తాజాగా ఇన్‌స్టిట్యూట్‌లకు ఇచ్చే గ్రేడింగ్ విధానంలో మార్పులు చేసింది. ఇవి 2016, జూలై 1 నుంచి అమలవుతున్నాయి. ఈ క్రమంలో న్యాక్ తీరుతెన్నులు, కొత్త గ్రేడింగ్ విధానంపై విశ్లేషణ...
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆధ్వర్యంలో న్యాక్.. ప్రత్యేక విభాగంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యూజీసీ చట్టంలోని 2 (ఎఫ్), 12 (బి) క్లాజ్‌ల ప్రకారం ఏర్పాటైన విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు పొందడం వల్ల నిధుల సాధనలో ప్రత్యేక ప్రాధాన్యం పొందుతాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో దేశంలో భారీ సంఖ్యలో ప్రభుత్వ యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు, ప్రైవేటు యూనివర్సిటీలు, అటానమస్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటవుతున్నాయి. వీటికి నిధులు మంజూరు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వీటిని దృష్టిలో ఉంచుకొని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లకు వాటి పనితీరు, ఇతర ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని, గ్రేడ్‌లు ఇచ్చి వాటి ఆధారంగా నిధులు మంజూరుకు వీలుకల్పించేలా న్యాక్ గుర్తింపు, గ్రేడ్‌లు ఎంతో ఉపయోగపడుతున్నాయి.
న్యాక్ గుర్తింపు ప్రక్రియ
యూజీసీ, ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి నిధులు కోరుకునే విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు పొందేందుకు స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌లోని మౌలిక సదుపాయాల నుంచి ఆర్ అండ్ డీ తీరుతెన్నుల వరకు అన్ని విషయాలనూ దరఖాస్తులో పొందుపరచాలి. ఈ దరఖాస్తులను పరిశీలించిన న్యాక్... ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసి, విద్యాసంస్థలో ప్రత్యక్ష తనిఖీలు నిర్వహిస్తుంది. అన్ని ప్రమాణాలను పరిశీలించి నిపుణుల బృందం.. న్యాక్ ఉన్నత వర్గాలకు నివేదిక అందజేస్తుంది. ఈ నివేదికలోనే ఇన్‌స్టిట్యూట్‌కు మంజూరు చేయగలిగే గ్రేడ్‌లను పేర్కొంటుంది.
ఇప్పటి వరకు ఉన్న గ్రేడింగ్ విధానం
న్యాక్.. ఇప్పటి వరకు ఇన్‌స్టిట్యూట్‌లకు నాలుగు రకాల (ఏ, బీ, సీ, డీ) హోదాల్లో గుర్తింపు ఇస్తోంది. దీనికోసం పరిగణనలోకి తీసుకుంటున్న అంశాలు...
కరిక్యులర్ సంబంధిత అంశాలు
టీచింగ్
లెర్నింగ్ వాల్యుయేషన్
రీసెర్చ్ కన్సల్టెన్సీ అండ్ ఎక్స్‌టెన్షన్
లెర్నింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
స్టూడెంట్ సపోర్ట్, ప్రోగ్రెషన్.
గవర్నెన్స్, లీడర్‌షిప్, మేనేజ్‌మెంట్
ఇన్నోవేషన్, బెస్ట్ ప్రాక్టీసెస్
ఈ అంశాలకు సంబంధించి గరిష్ట పాయింట్లు నిర్ణయిస్తుంది. ఇన్‌స్టిట్యూట్‌లోని వాస్తవ పరిస్థితుల ఆధారంగా క్యుమిలేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ)గా క్రోడీకరించి గ్రేడ్‌లు ఇస్తుంది. ఒక్కో సీజీపీఏ శ్రేణికి ఒక్కో గ్రేడ్ ఇస్తుంది. వివరాలు..
సీజీపీఏ 3.01-4.00 మధ్యలో ఉంటే ఏ గ్రేడ్; 2.01-3.00 మధ్యలో ఉంటే బీ గ్రేడ్; 1.51-2.00 మధ్యలో ఉంటే సీ గ్రేడ్, 1.51 లోపు ఉంటే ‘డీ’ గ్రేడ్ మంజూరు చేస్తుంది.
కొత్త గ్రేడింగ్.. ఏడు రకాలు
కొత్తగా 2016, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన గ్రేడింగ్ విధానంలో ఏడు రకాల గ్రేడ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్‌స్టి ట్యూట్‌లలోని సదుపాయాలు వాటికి ఇచ్చిన గరిష్ట వెయిటేజీ పాయింట్లలోనూ మార్పులు జరిగాయి.
ఇప్పటికే న్యాక్ గ్రేడ్ ఉంటే
వాస్తవానికి న్యాక్ ఒకసారి ఇచ్చే గుర్తింపు అయిదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాత గ్రేడింగ్ విధానంలో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు యథాతథంగా ఉంటాయని.. కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని న్యాక్ స్పష్టం చేసింది.
మార్చిన విధానంలో కొత్త గ్రేడ్‌లు
న్యాక్ మార్చిన గ్రేడింగ్ విధానంలో కొత్తగా ఎ++, ఎ+, బి++, బి+ గ్రేడ్‌లు వచ్చాయి.
గతంలో సీజీపీఏ 3.01-4.00 మధ్యలో ఉంటే అత్యున్నత గ్రేడ్‌గా భావించే ఎ గ్రేడ్ లభించేది. కానీ, ఇప్పుడు అత్యున్నత గ్రేడ్ పాయింట్ ఎ++ సాధించాలంటే సీజీపీఏ శ్రేణి 3.76-4.00 మధ్యలో ఉండాలి.
న్యాక్ కొత్త గ్రేడింగ్ విధానంలో మరో ప్రధాన అంశం ఇన్‌స్టిట్యూట్‌లకు ఇచ్చే గ్రేడ్‌తోపాటు హోదాను సైతం మార్చడం. ఇప్పటివరకు ఎ గ్రేడ్ ఉంటే వెరీగుడ్; బి గ్రేడ్ ఉంటే గుడ్; సి గ్రేడ్ ఉంటే శాటిస్ఫాక్టరీ; డి గ్రేడ్ ఉంటే అన్-శాటిస్ఫాక్టరీ అని పేర్కొంటోంది. ఒక్క డి గ్రేడ్ మినహా అన్ని గ్రేడ్‌లకు ‘అక్రెడిడెట్’ హోదాను ఇవ్వడం గమనార్హం.
న్యాక్ గ్రేడ్‌లతో ప్రయోజనాలు
యూజీసీ యాక్ట్ ప్రకారం 2 (ఎఫ్), 12 (బి) క్లాజ్‌ల మేరకు ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లకు యూజీసీ గ్రాంట్ల మంజూరులో ప్రాధాన్యం.
ఉన్నత విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల మంజూరులో ప్రాధాన్యం.
రూసా, ఇతర పథకాల ద్వారా అదనపు ఆర్థిక చేయూత.
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోణంలో చేయూత.
భిన్నాభిప్రాయాలు
న్యాక్ కొత్త గ్రేడింగ్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా న్యాక్ గుర్తింపు క్రమంలో అత్యంత ప్రధాన ప్రామాణికాలుగా భావించే ఫ్యాకల్టీ, ఆర్ అండ్ డీ సదుపాయాల కోణంలో కొత్త విధానంపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ కొరత, ఉన్న నిధులు నిర్వహణ ఖర్చులు, సిబ్బంది వేతనాలకే సరిపోని పరిస్థితుల్లో.. న్యాక్ పేర్కొన్న నాణ్యమైన సదుపాయాలు కల్పించడం కష్టమని, పర్యవసానంగా న్యాక్ గుర్తింపు రావడం కష్టమని పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొత్తగా ఏడు గ్రేడ్‌లను నిర్దేశించడం వల్ల అత్యున్నత ఇన్‌స్టిట్యూట్‌లు, నిధుల పరంగా స్వయం ప్రతిపత్తి ఉన్న కేంద్రీయ విశ్వ విద్యాలయాలకే ప్రాధాన్యం లభిస్తుందనే వాదన వినిపిస్తోంది.
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
ప్రస్తుతం జాతీయ స్థాయిలో న్యాక్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు - 254
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాశాలలు - 6,285
ఏపీలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న యూనివర్సిటీలు - 4
ఏపీలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న కళాశాలలు - 4
తెలంగాణలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న యూనివర్సిటీలు - 2
తెలంగాణలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న కళాశాలలు - 4

సీజీపీఏ | గ్రేడ్ | హోదా |
3.76-4.00 | ఎ++ | అక్రెడిటెడ్ |
3.51-3.75 | ఎ+ | అక్రెడిటెడ్ |
3.01-3.50 | ఎ | అక్రెడిటెడ్ |
2.76-3.00 | బి++ | అక్రెడిటెడ్ |
2.51-2.75 | బి+ | అక్రెడిటెడ్ |
2.01-2.50 | బి | అక్రెడిటెడ్ |
1.51-2.00 | సి | అక్రెడిటెడ్ |
1.50 లేదా అంతకంటే తక్కువ | డి | నాట్ అక్రెడిటెట్ |
ఇప్పటికే న్యాక్ గ్రేడ్ ఉంటే
వాస్తవానికి న్యాక్ ఒకసారి ఇచ్చే గుర్తింపు అయిదేళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పాత గ్రేడింగ్ విధానంలో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు యథాతథంగా ఉంటాయని.. కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని న్యాక్ స్పష్టం చేసింది.
మార్చిన విధానంలో కొత్త గ్రేడ్‌లు
న్యాక్ మార్చిన గ్రేడింగ్ విధానంలో కొత్తగా ఎ++, ఎ+, బి++, బి+ గ్రేడ్‌లు వచ్చాయి.
గతంలో సీజీపీఏ 3.01-4.00 మధ్యలో ఉంటే అత్యున్నత గ్రేడ్‌గా భావించే ఎ గ్రేడ్ లభించేది. కానీ, ఇప్పుడు అత్యున్నత గ్రేడ్ పాయింట్ ఎ++ సాధించాలంటే సీజీపీఏ శ్రేణి 3.76-4.00 మధ్యలో ఉండాలి.
న్యాక్ కొత్త గ్రేడింగ్ విధానంలో మరో ప్రధాన అంశం ఇన్‌స్టిట్యూట్‌లకు ఇచ్చే గ్రేడ్‌తోపాటు హోదాను సైతం మార్చడం. ఇప్పటివరకు ఎ గ్రేడ్ ఉంటే వెరీగుడ్; బి గ్రేడ్ ఉంటే గుడ్; సి గ్రేడ్ ఉంటే శాటిస్ఫాక్టరీ; డి గ్రేడ్ ఉంటే అన్-శాటిస్ఫాక్టరీ అని పేర్కొంటోంది. ఒక్క డి గ్రేడ్ మినహా అన్ని గ్రేడ్‌లకు ‘అక్రెడిడెట్’ హోదాను ఇవ్వడం గమనార్హం.
న్యాక్ గ్రేడ్‌లతో ప్రయోజనాలు
యూజీసీ యాక్ట్ ప్రకారం 2 (ఎఫ్), 12 (బి) క్లాజ్‌ల మేరకు ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లకు యూజీసీ గ్రాంట్ల మంజూరులో ప్రాధాన్యం.
ఉన్నత విద్య అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధుల మంజూరులో ప్రాధాన్యం.
రూసా, ఇతర పథకాల ద్వారా అదనపు ఆర్థిక చేయూత.
రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కోణంలో చేయూత.
భిన్నాభిప్రాయాలు
న్యాక్ కొత్త గ్రేడింగ్ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా న్యాక్ గుర్తింపు క్రమంలో అత్యంత ప్రధాన ప్రామాణికాలుగా భావించే ఫ్యాకల్టీ, ఆర్ అండ్ డీ సదుపాయాల కోణంలో కొత్త విధానంపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల్లోని యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ కొరత, ఉన్న నిధులు నిర్వహణ ఖర్చులు, సిబ్బంది వేతనాలకే సరిపోని పరిస్థితుల్లో.. న్యాక్ పేర్కొన్న నాణ్యమైన సదుపాయాలు కల్పించడం కష్టమని, పర్యవసానంగా న్యాక్ గుర్తింపు రావడం కష్టమని పేర్కొంటున్నారు. అంతేకాకుండా కొత్తగా ఏడు గ్రేడ్‌లను నిర్దేశించడం వల్ల అత్యున్నత ఇన్‌స్టిట్యూట్‌లు, నిధుల పరంగా స్వయం ప్రతిపత్తి ఉన్న కేంద్రీయ విశ్వ విద్యాలయాలకే ప్రాధాన్యం లభిస్తుందనే వాదన వినిపిస్తోంది.
ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్
ప్రస్తుతం జాతీయ స్థాయిలో న్యాక్ గుర్తింపు పొందిన యూనివర్సిటీలు - 254
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కళాశాలలు - 6,285
ఏపీలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న యూనివర్సిటీలు - 4
ఏపీలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న కళాశాలలు - 4
తెలంగాణలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న యూనివర్సిటీలు - 2
తెలంగాణలో న్యాక్ గుర్తింపు అమల్లో ఉన్న కళాశాలలు - 4
విద్యాసంస్థల్లో ప్రమాణాలను మరింత పకడ్బందీగా అమలయ్యేలా చూసేందుకు, నిధుల మంజూరుకు పటిష్ట విధానాన్ని అనుసరించేందుకు కొత్త గ్రేడింగ్ విధానాన్ని తెచ్చినట్లు భావించొచ్చు. న్యాక్ గుర్తింపు కోసం ఇన్‌స్టిట్యూట్‌లే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి వల్ల చాలా సంస్థలు చొరవ చూపడం లేదు. యూజీసీ నిధుల మంజూరు పరంగా న్యాక్ గ్రేడ్‌ను తప్పనిసరి చేసినప్పటికీ కొన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు సైతం దరఖాస్తు చేసుకోకపోవడం లేదా తదుపరి దశ దరఖాస్తుకు అనుమతి కోరడం వంటివి చేస్తున్నాయి. దీనివల్ల ఇన్‌స్టిట్యూట్‌లకే నష్టమని గుర్తించాలి. - ప్రొఫెసర్ వి.ఎస్.ప్రసాద్, న్యాక్ మాజీ డెరైక్టర్. |
Published date : 03 Sep 2016 12:17PM