Skip to main content

విదేశీ విద్య కోసం వర్చువల్‌గా ఎడ్యుకేషన్ ఫెయిర్స్!

విదేశీ విద్య చదవాలనుకునే వారి కోసం కరోనా కాలంలో విదేశీ ఇన్‌స్టిట్యూట్స్ తీసుకోచ్చిన కొత్త పద్ధతి.. వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్! ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్స్ జరిగే విధానంపై కథనం..
 

నిర్దిష్ట సమయం..

  • వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్‌ను నిర్వహిస్తున్న ఇన్‌స్టిట్యూట్స్, యూనివర్సిటీలు, కన్సల్టెన్సీలు.. నిర్దిష్ట సమయం, వ్యవధిని పేర్కొంటున్నాయి. ఈ సమయంలోనే విద్యార్థులు సదరు ఫెయిర్‌కు ఆన్‌లైన్ విధానంలో హాజరు కావాల్సి ఉంటుంది.
  • నిర్ణీత సమయం, గడువులో నిర్వహించే వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్‌ను ఫలప్రదం చేసుకోవాలంటే.. విద్యార్థులు ముందుగానే కసరత్తు చేసి సంసిద్ధంగా ఉండాలి.
  • తొలుత సదరు ఫెయిర్‌ను నిర్వహిస్తున్న కన్సల్టెన్సీ లేదా యూనివర్సిటీల సముదాయానికి ఉన్న ప్రామాణికత గురించి తెలుసుకోవాలి.
  • యూనివర్సిటీల ప్రతినిధులను అడగాలనుకుంటున్న విషయాలు, సందేహాలతో ఒక జాబితాలో రూపొందించుకోవాలి.
  • అర్హత ప్రమాణాలు, ఫీజులు, ఇతర మౌలిక సదుపాయాల గురించి స్పష్టమైన అవగాహన పొందాలి.

స్కోర్లు తగ్గిస్తున్న వర్సిటీలు..

{పస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న సందిగ్ధ పరిస్థితుల నేపథ్యంలో.. విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు యూనివర్సిటీలు.. ప్రామాణిక టెస్ట్‌లలో సాధించాల్సిన స్కోర్లను తగ్గిస్తున్నాయి. స్కోర్లను భారీగా తగ్గిస్తూ ప్రవేశాలకు అర్హత కల్పిస్తున్న యూనివర్సిటీల ప్రామాణికతను ముందుగానే అన్ని కోణాల్లో తెలుసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.

(ఇంకా చదవండి: part 3: విదేశీ విద్య కోసం ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్ లెటర్.. ఆన్‌లైన్ క్లాసులు!!)

Published date : 03 Oct 2020 05:26PM

Photo Stories