విదేశీ విద్య కోసం ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్ లెటర్.. ఆన్‌లైన్ క్లాసులు!!
అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరానికి(2020-21) సంబంధించి ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో క్లాసులు నిర్వహించాలనుకుంటున్నప్పటికీ.. ట్యూషన్ ఫీజులను మాత్రం యథాతథంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఆర్థిక భారం నుంచి వెసులుబాటు..
వర్చువల్ ఎడ్యుకేషన్ ఫెయిర్స్.. ప్రొవిజనల్ అడ్మిషన్ లెటర్స్, ఆన్‌లైన్ క్లాసెస్ వల్ల విద్యార్థులకు ఆర్థిక భారం నుంచి కొంత వెసులుబాటు లభిస్తుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. వ్యక్తిగత వ్యయాలు ముఖ్యంగా విమానయాన ఖర్చులు, నివాస ఖర్చులు తదితరాలనుంచి ఉపశమనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యార్థులు ఆర్థిక ఉపశమనంతోపాటు అకడమిక్స్ పరంగా సదరు యూనివర్సిటీలు అందించే ఆన్‌లైన్ కోర్సుల ప్రామాణికతను, నాణ్యతను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు.
ఇవి తెలుసుకోవాలి..
- ఆయా దేశంలోని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్న సదరు ఆన్‌లైన్ కోర్సుల పరంగా నిర్దేశిత ప్రోగ్రామ్ కరిక్యులమ్‌కు అనుగుణంగానే బోధిస్తారా? లేదా? అని తెలుసుకోవాలి.
- రెగ్యులర్ ప్రోగ్రామ్ కరిక్యులమ్‌తో, ఆన్‌లైన్ ప్రోగ్రామ్ కరిక్యులమ్‌ను పోల్చి చూసుకోవాలి.
- మూల్యాంకన ప్రక్రియ, ట్రైమిస్టర్, సెమిస్టర్ పరీక్షల పరంగా అనుసరించే మూల్యాంకన పద్ధతులు, విధానాలు తెలుసుకోవాలి.
(ఇంకా చదవండి: part 4: ఈ ఏడు సరే.. వచ్చే ఏడు పరిస్థితి ఏంటి?!!)