Skip to main content

విదేశాల్లో సైన్స్, ఇంజనీరింగ్‌లో పీజీ కోర్సుల కోసం.. ఈ టెస్ట్‌లో మంచి స్కోరు సాధించాల్సిందే..

ఏదైనా విదేశీ యూనివర్సిటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకుంటే.. సదరు వర్సిటీ అధికారులు అకడమిక్‌ అర్హతలతోపాటు ప్రధానంగా పరిశీలించేది..

ప్రీ–రిక్విజిట్‌ (స్టాండర్ట్‌ టెస్ట్స్‌)లో పొందిన స్కోరే! దరఖాస్తుల షార్ట్‌లిస్ట్‌లో, విద్యార్థులకు ప్రవేశాలు ఖరారు చేసే విషయంలో.. స్టాండర్ట్‌ టెస్టుల స్కోర్‌ ఎంతో కీలకంగా నిలుస్తుంది. కాబట్టి.. విద్యార్థులు కేవలం బెస్ట్‌ యూనివర్సిటీల అన్వేషణే కాకుండా.. తాము చేరాలనుకుంటున్న కోర్సుకు సంబంధించి ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు కోరుకుంటున్న టెస్టుల గురించి తెలుసుకోవాలి.

విదేశీ యూనివర్సిటీల్లో సైన్స్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సుల్లో పీజీ చేయాల నుకునే విద్యార్థులు.. గ్రాడ్యుయేట్‌ రికార్డ్స్‌ ఎగ్జామినేషన్‌(జీఆర్‌ఈ)లో స్కోర్‌ సాధించాల్సి ఉంటుంది.

నాలుగు విభాగాలు: జీఆర్‌ఈ పరీక్ష కూడా నాలుగు విభాగాల్లో ఉంటుంది. అవి.. అనలిటికల్‌ రైటింగ్‌; వెర్బల్‌ స్కిల్స్‌; క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌; ఎక్స్‌పరిమెంటల్‌ సెక్షన్‌. ఒక్కో విభాగంలో సబ్‌–సెక్షన్స్‌ ఉంటాయి. ఈ పరీక్షకు గరిష్టంగా లభించే సమయం 3.45గంటలు. ఈ విభాగాల్లో వెర్బల్‌ రీజనింగ్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌లో 130–170 స్కేల్‌ మధ్యలో స్కోర్‌ను గణిస్తారు. అదే విధంగా అనలిటికల్‌ రైటింగ్‌లో గరిష్టంగా ఆరు పాయింట్లకు స్కోర్‌ను మూల్యాంకన చేస్తారు. అభ్యర్థులు వెర్బల్, క్వాంటిటేటివ్‌ విభాగాల్లో.. ఒక్కో దాంట్లో 150 పాయింట్లకు పైగా.. అనలిటికల్‌ రైటింగ్‌లో దాదాపు నాలుగు పాయింట్ల స్కోర్‌తో బెస్ట్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందే అవకాశం ఉంది.

ఏడాదిలో అయిదుసార్లు: జీఆర్‌ఈ ఆన్‌లైన్‌ విధానంలో ఏడాది ఆసాంతం జరుగుతుంది. కాని ప్రతి అభ్యర్థి ఏడాదికి గరిష్టంగా అయిదుసార్లు(అయిదు స్లాట్లు) మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి స్లాట్‌కు మధ్య నెల రోజుల వ్యవధి తప్పనిసరి.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ets.org/gre

ఇంకా చ‌ద‌వండి: part 3: విదేశాల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు.. చదవాలనుకునేవారి కోసం ఈ టెస్ట్‌..

Published date : 05 Mar 2021 05:11PM

Photo Stories