Skip to main content

విదేశాల్లో మెడిసిన్ చేసి స్వదేశంలో ప్రాక్టీస్ చేసేందుకు ఉపయోగపడే ఎఫ్‌ఎంజీఈ.. ప్రిపరేషన్ ఏలాగో తెలుసుకోండి..!

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఈ) ఏటా రెండుసార్లు(జూన్/ డిసెంబర్‌ల్లో) ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తుంది.
ఎఫ్‌ఎంజీఈ-2020 డిసెంబర్ సెషన్‌కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ప్రిపరేషన్ ఎలా అనే దానిపై కథనం..
  • పార్ట్-ఎ,బిలలో క్లినికల్-నాన్ క్లినికల్ మేళవింపుగా ప్రాక్టికల్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. దీంట్లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాల జీ, పాథాలజీ, మైక్రో బయాలజీ సబ్జెక్టుల బేసిక్స్ మీద పట్టు సాధిస్తే.. మిగతా సబ్జెక్టులకు ప్రిపేర్‌కావడం తేలిక అవుతుంది. అలాగే మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ తదితర సబ్జెక్టులు స్కోరింగ్‌కు ప్రధానం.
  • ఏ పరీక్ష అయినా ప్రణాళిక ప్రకారం చదవడం ముఖ్యం. పరీక్ష విధానాన్ని, సిలబస్‌ను అవగాహన చేసుకొని.. దాని ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి. రోజూ ఒకే సబ్జెక్ట్‌పై కాకుండా ప్రతి సబ్జెక్ట్‌కు కొంత సమయం చొప్పున కేటా యించుకుంటూ ప్రిపేరవ్వాలి. ప్రిపరేషన్ ఎంత ముఖ్యమైందో ఆరోగ్యంపై కూడా అంతే శ్రద్ధ వహించాలి.
పరీక్షా కేంద్రాలు..
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నంలలో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి.

పరీక్ష ఫీజు..
ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలనకునే అన్ని కేటగిరిల అభ్యర్థులు రూ.6940 పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో పరీక్ష ఫీజు రూ.5500. కాగా జీఎస్టీ రూ.990గా ఉంది. ఆన్‌లైన్,నెట్‌బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు.

ముఖ్యమైన సమాచారం..
  • దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ : 28.10.2020
  • ఎడిట్ ఆప్షన్ : 31 అక్టోబర్ 2020 నుంచి 02 నవంబర్ 2020
  • అడ్మిట్ కార్డ్‌ల జారీ : 27.11.2020
  • పరీక్షా తేదీ: 04.12.2020
  • ఫలితాల వెల్లడి : 20.12.2020
  • ఈ మెయిల్ : helpdesknbeexam@gmail.com
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nbe.edu.in
ఇంకా తెలుసుకోండి: part 1: విదేశాల్లో మెడిసిన్ చేసి స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే వారికి అవకాశం.. ఎఫ్‌ఎంజీఈ నోటిఫికేషన్ విడుదల!
Published date : 16 Oct 2020 01:13PM

Photo Stories