సీపెట్ జేఈఈ-2020 పరీక్ష విధానం - ఉపాధి అవకాశాలు
Sakshi Education
వాస్తవానికి ప్రస్తుతం ప్లాస్టిక్ ప్రమేయం అన్ని విభాగాల్లో పెరిగిపోయింది. మానవ దైనందిన జీవితంలోకి ప్లాస్టిక్ చొచ్చుకుపోయింది. ప్లాస్టిక్ రంగంలో ఏటేటా వృద్ధి కనిపిస్తోంది. ఫలితంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం అంతేస్థాయిలో లభిస్తున్నాయి. ఈ రంగంలో స్థిరపడాలంటే.. ఏ కోర్సు చదవాలి.. ఎక్కడ చదవాలి.. విద్యార్హతలేమిటో తెలుసుకోవడం ముఖ్యం.
ప్లాస్టిక్ రంగంలో అగ్రగామి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్). ఈ సంస్థ ప్లాస్టిక్ కోర్సుల్లో ప్రవేశాలకు వీలు కలిపించే సీపెట్ జేఈఈ-2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో... ప్లాస్టిక్ కోర్సులు, ప్రవేశ విధానం.. ఉపాధి వేదికల వివరాలు...
30 వేలకు పైగా పరిశ్రమలు : దేశాభివృద్ధిలో తయారీ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ప్రభుత్వాలు సైతం తయారీ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. ప్రస్తుతం విరివిగా వినియోగిస్తున్న అనేక వస్తువులు ప్లాస్టిక్ ఆధారితంగా తయారైనవే. ఇవి తక్కువ ధర,ఎక్కువ మన్నికతో లభించడంతో వినియోగదారులు సులభంగా ఆకర్షితులవుతున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలకు అవకాశం ఏర్పడింది. అందుకు తగ్గట్టే నిపుణుల డిమాండ్ కూడా అధికమైంది. దేశంలో సుమారు 30 వేలకు పైగా ప్లాస్టిక్ ఆధారిత పరిశ్రమలున్నాయి. దాదాపు 5 కోట్ల మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ప్లాస్టిక్, అనుబంధ రంగాల్లో ప్రయోగాలను ప్రోత్సహించేందుకు, మానవ వనరులకు శిక్షణ ఇచ్చేందుకు దేశవ్యాప్తంగా సీపెట్‌లను ఏర్పాటు చేసింది.
స్థానికులకు 80 శాతం సీట్లు :
అత్యాధునిక సాంకేతికత ద్వారా ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్ చేసేందుకు, ప్లాస్టిక్ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం కేంద్ర ఎరువులు, రసాయన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే సీపెట్ కేంద్ర కార్యాలయం చెన్నైలో ఉంటుంది. దీని పరిధిలో దేశవ్యాప్తంగా 27 సీపెట్ ప్రాంగణాలు న్నాయి. తెలంగాణ (హైదరాబాద్)లో చర్లపల్లిలో సీపెట్ క్యాంపస్ ఉంది.ప్లాస్టిక్ ఇంజినీరింగ్, టెక్నాలజీలో పరిశ్రమలకు సుశిక్షితులైన మానవ వనరులను అందించే లక్ష్యంతో 1989లో దీన్ని స్థాపించారు. డిప్లొమా, డిగ్రీ అర్హతలున్న వారికి డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నారు. సీపెట్ క్యాంపస్‌ల్లో 80 శాతం సీట్లను సొంత రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేస్తారు.
ఉపాధి వేదికలు :
ప్లాస్టిక్ విభాగాల్లో కోర్సులు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలుంటాయి. ప్లాస్టిక్ తయారీ సంస్థల్లోనే కాకుండా.. ఫార్మా, వ్యవసాయం, ఆటోమొబైల్, విమానయానం, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, వైద్యం, ప్యాకేజింగ్, క్రీడలు తదితర రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ల్యాబ్‌లు, రీసెర్చ్ సెంటర్లు, పెట్రో ఆధారిత పరిశ్రమలు సైతం వీరిని ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. సొంతంగా కూడా ప్లాస్టిక్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చు. అలాంటి వారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. విదేశాల్లో సైతం ఉద్యోగాలు లభిస్తాయి. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ప్లాస్టిక్ రంగ నిపుణులకు మంచి గిరాకీ ఉంది. డిప్లొమా చేసిన వారికి ప్రారంభ వేతనం రూ.10 నుంచి 15 వేల వరకు ఉంటుంది. పోస్ట్ డిప్లొమా పూర్తి చేసిన వారికి రూ.15 నుంచి రూ.18 వేల వరకు వేతనమిస్తారు. అనుభవం, నైపుణ్యం, సంస్థ ప్రామాణికతను బట్టి వేతనాల్లో పెరుగుదల ఉంటుంది.
కోర్సులు - అర్హతలు:
1. పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెక్నాలజీ (పీజీడీ-పీపీటీ) :
కాల వ్యవధి: రెండేళ్లు (4 సెమిస్టర్లు)
అర్హత: సైన్స్ విభాగంలో మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణత.
2. పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ కాడ్/కామ్(పీడీ-పీఎండీ విత్ కాడ్/కామ్) :
కాల వ్యవధి: ఏడాదిన్నర (3 సెమిస్టర్లు)
అర్హత: మెకానికల్, ప్లాస్టిక్స్ టెక్నాలజీ, టూల్/ ప్రొడక్షన్/ఆటోమొబైల్ ఇంజినీరింగ్, మెకట్రానిక్స్, టూల్ అండ్ డై మార్కెటింగ్‌ల్లో మూడేళ్ల డిప్లొమా లేదా సిపెట్ నుంచి డీపీఎంటీ/డీపీటీ ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సు చేయడానికి అర్హులు.
3. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ) :
కాల వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
4. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ (డీపీటీ) :
కాల వ్యవధి: మూడేళ్లు (6 సెమిస్టర్లు)
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత.
పరీక్ష విధానం:
ఇది కంప్యూటర్ ఆధారిత పరక్ష. కోర్సు సిలబస్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 60 మార్కులకు 60 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయి. అనంతరం ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్థులు ఎంచుకున్న ప్రాంతాల్లో సీటు కేటాయించడానికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.
సీపెట్ జేఈఈ-2020 వివరాలు..
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 12, 2020
దరఖాస్తుకు చివరితేదీ: మే 22, 2020
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ.300; జనరల్,ఓబీసీ, ఇతరులకు రూ.750, నార్త్ ఈస్ట్రన్ రీజియన్ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక: సీపెట్ జేఈఈ-2020 ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష తేదీ: మే 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.cipet.gov.in

Published date : 17 Jan 2020 05:44PM