Skip to main content

సీమ్యాట్-2020 సిలబస్.. ప్రిపరేషన్ గెడైన్స్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ).. కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(సీమ్యాట్)-2020కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి సీమ్యాట్‌కు దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇందులో సాధించిన స్కోరు ఆధారంగా జాతీయ స్థాయిలోని వెయ్యికిపైగా బీస్కూల్స్‌లో ప్రవేశం పొందొచ్చు. ఈ నేపథ్యంలో... సీమ్యాట్ నోటిఫికేషన్ వివరాలు.. ప్రవేశ పరీక్ష తీరు.. సిలబస్, ప్రిపరేషన్‌పై కథనం...
విద్యార్హత :
  • సీమ్యాట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. అదే విధంగా చివరి సంవత్సరం విద్యార్థులు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

1000 ఇన్‌స్టిట్యూట్‌లు..
  • సీమ్యాట్-2020లో దేశవ్యాప్తంగా 1000కిపైగా ఇన్‌స్టిట్యూట్‌లు పాల్గొంటున్నాయి. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల్లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ), పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(పీజీపీఎం), పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్(పీజీడీఎం) కోర్సుల్లో ప్రవేశాలకు సీమ్యాట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటారు.
  • ప్రవేశాలకు సంబంధించి ప్రతి ఇన్‌స్టిట్యూట్ సీమ్యాట్ కటాఫ్ మార్కులను ప్రకటిస్తుంది. దాని ఆధారంగా అభ్యర్థులు ఆయా బీస్కూల్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సదరు ఇన్‌స్టిట్యూట్.. గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్వూ(పీఐ) నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తుంది. సీమ్యాట్ భాగస్వామ్య ఇన్‌స్టిట్యూట్స్ అన్నీ ఒకే విధమైన విధానాన్ని అనుసరించవు. కాబట్టి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి సదరు ఇన్‌స్టిట్యూట్ వెబ్‌సైట్‌ను చూడాలి.
  • సీమ్యాట్ స్కోరును ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లు/ డిపార్ట్‌మెంట్లు/స్వయంప్రతిపత్తి కలిగిన కాలేజీలు/యూనివర్సిటీల అనుబంధ కాలేజీలు పరిగణలోకి తీసుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, హరియాణా, కర్నాటక తదితర(మొత్తం 13) రాష్ట్రాలు సీమ్యాట్‌ను అధికారిక పరీక్షగా ప్రకటించాయి. ఆయా రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలు సీమ్యాట్ స్కోరును పరిగణలోకి తీసుకుంటున్నాయి. క్యాట్, ఎక్స్‌ఏటీలలో మంచి ర్యాంకు దక్కని విద్యార్థులకు సీమ్యాట్ చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.

పరీక్ష విధానం :
సీమ్యాట్‌ను ఆన్‌లైన్ విధానంలో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు.

విభాగం

ప్రశ్నల సంఖ్య

మార్కులు

క్వాంటిటేటివ్ టెక్నిక్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్

25

100

లాజికల్ రీజనింగ్

25

100

లాంగ్వేజ్ కాంప్రహెన్షన్

25

100

జనరల్ అవేర్‌నెస్

25

100


సిలబస్.. విశ్లేషణ :
సీమ్యాట్ సిలబస్‌ను ప్రధానంగా లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్ విభాగాలుగా విభజించుకోవచ్చు.

లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్:
  • యూసేజ్ ఆఫ్ ఆర్టికల్
  • నాన్ ఫెనైట్స్
  • డాంజ్లింగ్ మాడిఫైర్
  • యూసేజ్ ఆఫ్ నౌన్స్ అండ్ ప్రొనౌన్స్, ఆడ్జెక్టివ్స్, ఆడ్‌వర్బ్స్, ప్రిపోజిషన్స్-రెగ్యులర్, ఫాలోవుడ్, సింటాక్స్, సబ్జెక్ట్-వర్బ్ అరేంజ్‌మెంట్, సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ టెన్సెస్ అండ్ కండిషనల్ అన్‌రియల్ పాస్ట్, జంబల్డ్ పారాగ్రాఫ్స్.

రీడింగ్ కాంప్రహెన్షన్ పాసేజెస్:
సీమ్యాట్‌లో 500 నుంచి 600 పదాలతో పాసేజ్‌లు ఇస్తారు. ఇవి అభ్యర్థులను ఇబ్బంది పెట్టేంత క్లిష్టతరంగా ఉండవు. పాసేజ్‌కు సంబంధించిన ఇంటర్‌ఫియరెన్స్ డ్రాన్, సెంట్రల్ ఐడియా, ఫ్రేజెస్, ఇడియమ్స్, తదితరాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్:
అర్థమెటిక్-రేషియో, మిక్చర్స్, వర్క్, యావరేజ్, పర్సంటేజ్, టైమ్ అండ్ స్పీడ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంటరెస్ట్, బేసిక్ స్టాటిస్టిక్స్ కీలకంగా ఉంటాయి.
  • నంబర్ ప్రాపర్టీస్
  • పాబబిలిటీ
  • కౌంటింగ్ ప్రిన్సిపల్స్
  • జామెట్రీ
  • డెరివేటివ్స్(మ్యాగ్జిమా-మినిమా), డేటా ఇంటర్‌ప్రెటేషన్
  • టేబుల్ అండ్ పై ఛార్ట్స్
  • బార్ డయాగ్రామ్స్ అండ్ గ్రాఫ్స్
  • ఛార్ట్స్ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.

లాజికల్ రీజనింగ్: ఈ విభాగం లీనియర్, సీటింగ్, సీక్వెన్సింగ్ అండ్ అరేంజింగ్ విత్ కండిషన్స్ టు కోడింగ్ తదితర అంశాల కలయికగా ఉంటుంది.

ఇందులో..
  • స్టేట్‌మెంట్-కంక్లూజన్
  • లాజికల్ పజిల్
  • న్యూమరికల్ పజిల్
  • వెన్ డయాగ్రామ్
  • ట్రూ, ఫాల్స్ స్టేట్‌మెంట్స్
  • విజువల్ రీజనింగ్ టాపిక్స్ ముఖ్యమైనవి.

జనరల్ అవేర్‌నెస్:
  • స్టాండర్డ్ జీకే బుక్స్, న్యూస్ పేపర్ల్లు, వీక్లీలు, వెబ్‌సైట్స్, పిరియాడికల్స్‌ను ఫాలో అవ్వాలి. ఇతర కీలక అంశాలు..
  • రూపాయి పతనం, వృద్ధి,
  • బిజినెస్, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
  • వార్తల్లో వ్యక్తులు
  • భారత రాజ్యాంగం
  • వివిధ దేశాలు-కరెన్సీలు
  • భారతదేశం-రాష్ట్రాలు
  • అంతర్జాతీయ సంస్థలు
  • ద్రవ్య, కోశ గణాంకాలు, సూచీలు, - చిహ్నాలు.

ప్రాక్టీస్ :
సీమ్యాట్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులు గత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది. దీంతోపాటు సాధ్యమైనన్ని మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఎన్‌టీఏ విడుదల చేసిన సీమ్యాట్ మాక్ టెస్ట్‌ను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.

ముఖ్య సమాచారం :
ఫీజు:
జనరల్ కేటగిరీ పురుషులకు రూ.1600, మహిళలకు రూ.1000, జనరల్(ఈడబ్ల్యూఎస్), ఓబీసీ(నాన్ క్రీమిలేయర్) కేటగిరీ అభ్యర్థులకు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీ పురుషులకు రూ.800, మహిళలకు రూ.700, ట్రాన్స్‌జండర్ అభ్యర్థులకు రూ.700.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2019
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: డిసెంబర్ 1, 2019
పరీక్ష కేంద్రం ఎంపికకు చివరి తేదీ: డిసెంబర్ 2, 2019
పరీక్ష తేదీ: జనవరి 28, 2020
ఫలితాల వెల్లడి: ఫిబ్రవరి 7, 2020
వెబ్‌సైట్: https://cmat.nta.nic.in/webinfo/public/home.aspx
Published date : 25 Nov 2019 04:37PM

Photo Stories