సెంట్రల్ వర్సిటీలకు ఉమ్మడి ఎంట్రన్స్ పరీక్ష విధానం.. ఎలా ఉండొచ్చు..!
Sakshi Education
సెంట్రల్ యూనివర్సిటీలకు సింగిల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు శ్రీకారం చుట్టనున్న కేంద్ర ప్రభుత్వం..పరీక్ష విధానం విషయంలో సీయూ సెట్‌ను అనుసరించే అవకాశం ఉందంటున్నారు...
- అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి 100 మార్కులతో ఆబ్జెక్టివ్ విధానంలో సీయూ సెట్ నిర్వహిస్తున్నారు. ఇందులో పార్ట్–ఎ పేరుతో లాంగ్వేజ్ స్కిల్స్, జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటికల్ అప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్‌కు సంబంధించి 25 ప్రశ్నలు, మరో 75 ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న కోర్సుకు సంబంధించిన విభాగాల నుంచి అడుగుతున్నారు.
- పీహెచ్‌డీ, రీసెర్చ్ ప్రోగ్రామ్ అభ్యర్థులకు నిర్వహించే పరీక్ష కూడా వంద మార్కులకే ఉంటుంది. ఈ వంద మార్కుల్లో 50 మార్కులు మాత్రమేæఅభ్యర్థుల డొమైన్ సబ్జెక్ట్‌కు సంబంధించినవి. మిగతా 50మార్కులకు లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటికల్ అప్టిట్యూడ్, అనలిటికల్ స్కిల్స్, రీసెర్చ్ మెథడాలజీకి సంబంధించినవి ఉంటున్నాయి.
- కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న సెంట్రల్ యూనివర్సిటీల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విధానం కూడా ఇదే తరహాలో ఉండొచ్చని సమాచారం. ము ఖ్యంగా 2021 నుంచే దీన్ని అమలు చేయాల నుకుంటే.. ఈ విధానం వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందంటున్నారు.
బెస్ట్ స్కోర్ తప్పనిసరి..
ఉమ్మడి ప్రవేశ పరీక్ష విధానం వల్ల విద్యార్థులకు అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభించనుంది. కాని ఇన్‌స్టిట్యూట్ ర్యాంకింగ్స్, ఇతర ప్రమాణాల పరంగా మెరుగైన యూనివర్సిటీలో ప్రవేశం ఖరారు చేసుకోవాలంటే మాత్రం మెరుగైన ర్యాంకు సాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో.. ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. వంద మార్కులకు నిర్వహించే ఎంట్రన్స్‌లో 80కుపైగా మార్కులు సొంతం చేసు కోవాల్సి ఉంటుంది. ఇదే వి«ధంగా ఇతర ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ ప్రవేశానికి కనీసం 70శాతం పైగా మార్కులు వస్తేనే ప్రవేశ అవకాశాలు మెరుగవుతాయి.
Published date : 01 Jan 2021 03:43PM