ఒత్తిడికి గురి కాకుండా,సమయ పాలన పాటిస్తే.. విజయం సాధించడం కష్టం కాదు..: ఆర్.కేదారేశ్వర్, డెరైక్టర్, విజన్-40 అకాడమీ
Sakshi Education
విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా నిర్దిష్ట సమయ పాలనతో మెయిన్‌కు సిద్ధమవ్వాలి. స్వీయ టైమ్ టేబుల్ రూపొందిం చుకోవాలి. ఒక్కో సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా కొన్ని గంటల సమయం కేటాయించాలి.
చదివే ప్రతి అంశాన్ని వాస్తవ పరిస్థితులతో అన్వయం చేసుకుంటూ అభ్యసనం సాగించాలి. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి ప్రాక్టీస్ అత్యంత ప్రాధాన్యం అని గుర్తించాలి. ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే.. విద్యార్థులు ఫిబ్రవరి, మే సెషన్లపై ఎక్కువ దృష్టి సారించాలి. ఫిబ్రవరి పరీక్షలో మంచి మార్కుల సాధన కోసం రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. అదే విధంగా ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఫిబ్రవరి నెలలో సరిగా అటెంప్ట్ చేయని అభ్యర్థులు.. ఆ ఫలితాల ఆధారంగా తదుపరి సెషన్లకు మరింత సమర్థంగా ప్రిపరేషన్ సాగించాలి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం, ఎన్‌టీఏ అందుబాటులో ఉంచిన ప్రాక్టీస్ టెస్ట్ సెంటర్లను వినియోగించుకోవడం మేలు చేస్తుంది.
ఇంకా తెలుసుకోండి: part 1: 2021 నుంచి ఏటా నాలుగు సార్లు జరగనున్న ఐఐటీ మెయిన్ పరీక్ష.. పదమూడు భాషల్లో నిర్వహణ..
Published date : 28 Dec 2020 03:14PM