Skip to main content

ఒకే ప్రిపరేషన్‌తో.. రెండు పోటీ పరీక్షలు సాధించొచ్చిలా..

గాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్.. సంక్షిప్తంగా గేట్! ఇది ఐఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో.. ఎంటెక్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష! ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. సక్షిప్తంగా ఈఎస్‌ఈ! ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖల్లో.. ఇంజనీరింగ్ పోస్ట్‌ల భర్తీకి యూపీఎస్‌సీ నిర్వహించే పరీక్ష! రెండిటికీ అర్హత ప్రమాణాలు ఒకటే.. అదే బీటెక్ ఉత్తీర్ణత! ఈ రెండు పరీక్షల సిలబస్, పరీక్ష విధానంపై అవగాహన పెంచుకొని అడుగులు వేస్తే.. ఒకే సమయంలో రెండిటికీ ప్రిపరేషన్ కొనసాగించొచ్చు. ఈ నేపథ్యంలో.. గేట్-2021, ఈఎస్‌ఈ పరీక్షలకు ఏకకాలంలో సన్నద్ధత సాధించడమెలాగో తెలుసుకుందాం...
  • గేట్.. ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరుగుతుంది. ఇందుకోసం దాదాపు పది లక్షల మంది పోటీ పడుతుంటారు.
  • యూపీఎస్సీ ఈఎస్‌ఈ-2021కు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ 7న విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్ష జూలై 18, 2021న జరగనుంది. అంటే కొద్ది నెలల వ్యవధిలోనే ఈ రెండు పరీక్షలు జరుగుతాయి.
గేట్, ఈఎస్‌ఈ.. ఇలా
  • గేట్ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. అందులో సాధించిన స్కోర్ ఆధారంగా తదుపరి దశలో ఐఐటీలు, ఇతర ఇన్‌స్టిట్యూట్‌లు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలు ఖరారు చేస్తాయి. అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలు(పీఎస్‌యూలు) కూడా గేట్ స్కోర్ ఆధారంగానే ఇంజనీర్స్, ట్రైనీ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీ చేపడతాయి. ఇందుకోసం ఇవి గేట్‌లో నిర్దిష్ట కటాఫ్‌లను పేర్కొని.. దాన్ని సాధించిన అభ్యర్థులకు మలి దశలో పర్సనల్ ఇంటర్వ్యూల ద్వారా నియామక ప్రక్రియ పూర్తి చేస్తాయి.
  • ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(ఈఎస్‌ఈ) పరీక్షను ఏటా నాలుగు విభాగాల్లో(సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్).. మూడు దశలు ప్రిలిమినరీ, మెయిన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆయా సంవత్సరాల్లో సంబంధిత శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదన మేరకు అదనంగా ఒకట్రెండు విభాగాల్లోనూ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
ఈఎస్‌ఈ.. మూడంచెల ఎంపిక ప్రక్రియ
 ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌లో మూడంచెల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ముందుగా ప్రిలిమినరీ నిర్వహిస్తారు. ఆ తర్వాత మెయిన్ పరీక్ష జరుగుతుంది. మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా చివరి దశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి.. విజేతలను ఖరారు చేస్తారు.
 
 ఇంకా చదవండి: part 2: గేట్, ఈఎస్‌ఈ ప్రిలిమ్స్ ఒకేలా.. ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకోండిలా..
Published date : 19 Nov 2020 05:22PM

Photo Stories