న్యాయవాదులకు ప్రత్యేకంగా రెండు కోర్సుల ప్రారంభం.. మాస్టర్స్, పీహెచ్‌డీతో సమానంగా..
Sakshi Education
న్యాయ శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ(ఎల్‌ఎల్‌బీ, బీఏ-ఎల్‌ఎల్‌బీ) పూర్తి చేసుకుని.. బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్న న్యాయవాదుల కోసం ఎడ్యుకేషనల్ అప్‌గ్రెడేషన్ అండ్ ఎఫిషియన్సీ ఎన్‌హ్యాన్స్‌మెంట్ అండ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ విధానంలో బీసీఐ రెండు ప్రత్యేక కోర్సులు నిర్వహించనుంది. అవి.. లాలో మాస్టర్ డిగ్రీకి సమానంగా ఉండే అసోసియేట్ ప్రోగ్రామ్, పీహెచ్‌డీకి తత్సమానంగా భావించే ఫెలోషిప్ ప్రోగ్రామ్. అసోసియేట్ ప్రోగ్రామ్‌కు మూడేళ్ల వ్యవధిని, ఫెలోషిప్ ప్రోగ్రామ్ కనీస వ్యవధిని మూడేళ్లుగా నిర్ణయించింది.
ఇంకా చదవండి: part 4: ఇకపై లా యూనివర్సిటీలకు.. న్యాక్ గుర్తింపు తప్పనిసరి..
Published date : 29 Jan 2021 04:55PM