Skip to main content

నయా కోర్సు...డైటీషియన్ !

ప్రస్తుతం ప్రజల జీవన శైలి మారుతోంది. ప్రతి పనిలో వేగం, సమయాభావం కీలకంగా మారుతున్నాయి.
దీనికనుగుణంగానే ఆహారపు అలవాట్లు మారాయి. ‘తినడం’ కోసం కూడా ఎక్కువ సమయం కేటాయించలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో తీసుకునే ఆహారం శక్తిని ఇస్తుందా? ఆరోగ్యకరమైందేనా? అనే విషయాలకంటే... త్వరగా, తేలిగ్గా తీసుకునే వీలుందా లేదా అనేదే ప్రధానమైంది. పర్యవసానంగా పౌష్టికాహారం లోపించి అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దీనికి పరిష్కారం? ఆరోగ్యకరమైన ‘డైట్’. ఎన్ని మందులు వాడినా.. సరైన డైట్‌తోనే సగం రోగాలు నయమవుతాయి. ఇక్కడే డైటీషియన్ అవసరం ఏర్పడుతోంది. దాంతో ఈ కోర్సు వైపు యువత ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. డైటీషియన్ కోర్సులకు సంబంధించి పూర్తి వివరాలు మీకోసం...

అధిక శాతం రోగాలకు సమతుల ఆహార లోపమేనని నిపుణులు చెబుతున్నారు. తీసుకునే ఆహారానికి సరిపడే విధంగా పోషకా విలువల్లో తుల్యత పాటిస్తూ, డైట్‌ను వివరించే వ్యక్తే... ‘డైటీషియన్’. పేషెంట్ పూర్తి వివరాలను మెడికల్ రికార్డ్స్ ద్వారా తెలుసుకుని, వారి స్వభావసిద్ధ ఆహార అలవాట్లను గమనించి, శాస్త్రీయ పద్ధతిలో ఎటువంటి ఆహారం, ఎంత మొత్తంలో, ఏయే సమయాల్లో తీసుకోవాలో సూచించడం డైటీషియన్ పని. నేడు చిన్న ఆస్పత్రి నుంచి కార్పొరేట్ ఆస్పత్రుల వరకూ డైటీషియన్‌ను నియమించుకోవడం తప్పనిసరైంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరగడంతో జిమ్స్, హెల్త్ కేర్ సెంటర్లు, స్కూళ్లు, కళాశాలల హాస్టళ్లలో కూడా డైటీషియన్లను నియమించుకుంటున్నారు. దీంతో వీరికి డిమాండ్ పెరిగింది.

అవకాశాలు...
ప్రజల జీవనశైలిలో వస్తున్న మార్పుల కారణంగా గత కొంత కాలంగా మన దేశంలో డైటీషియన్లకు డిమాండ్ పెరుగుతోంది. వీరికి కార్పొరేట్ హాస్పిటల్స్, స్టార్ హోటల్స్, నర్సింగ్ హోమ్స్, ప్రభుత్వ ఆరోగ్య శాఖలో, కార్పొరేట్ స్కూల్స్/ఇన్‌స్టిట్యూట్స్, హెల్త్ క్లబ్స్, స్పోర్‌‌ట్స ఆర్గనైజేషన్స్, ఆహార సంబంధిత పరిశ్రమలు, రీసెర్చ్ ల్యాబ్స్, వివిధ ఎం.ఎన్.సి కంపెనీలలో అవకాశాలుంటున్నాయి.

అర్హతలు...
డైటీషియన్ కోర్సులో చేరాలంటే ముందుగా ‘+2’ లేదా ఇంటర్మీడియెట్ తర్వాత బీఎస్సీ హోంసైన్స్ లేదా బీఏ హోంసైన్స్ పూర్తి చేయాలి. తర్వాత హోం సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయిలో ఫుడ్ సెన్సైస్ అండ్ న్యూట్రిషన్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకోవాలి. దేశంలోని కొన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా హోంసైన్స్ లో బీఎస్సీ, ఎంఎస్సీ కోర్సులను ఆందిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ కోర్సులకు ‘+2’ లేదా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులు అర్హులు. ‘+2’ లెవెల్‌లో సైన్స్ నేపథ్యం కలిగినవారికి ప్రాధాన్యం ఉంటుంది.

వేతనాలు...
అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన వారికి నెలకు రూ. 10 వేల నుంచి 20 వేల మధ్య వేతనాలు లభిస్తుంది. తర్వాత అనుభవం ఆధారంగా రెట్టింపు ఆదాయాన్ని పొందొచ్చు. అమెరికాలోనైతే మాస్టర్ డిగ్రీ చేసిన వారికి నెలకు 20 వేల నుంచి 40 వేల ‘యూఎస్’ డాలర్ల వరకు లభిస్తాయి.

కోర్సు అందిస్తోన్న విద్యా సంస్థలు...
  1. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ
    కోర్సు:
    బ్యాచిలర్ ఆఫ్ అప్లెడ్ సెన్సైస్ (ఆనర్స్) ఫుడ్ టెక్
    వెబ్‌సైట్: www.du.ac.in
  2. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
    వెబ్‌సైట్:
    www.angrau.ac.in  
  3. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్-హైదరాబాద్
    వెబ్‌సైట్:
    www.ninindia.org  
  4. పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ-లూధియానా(పంజాబ్)
    వెబ్‌సైట్:
    www.pau.edu  
  5. యూనివర్సిటీ ఆఫ్ పుణే
    వెబ్‌సైట్:
    www.unipune.ac.in  
  6. యూనివర్సిటీ ఆఫ్ అలహాబాద్
    వెబ్‌సైట్:
    www.allduniv.ac.in  
  7. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోం ఎకనమిక్స్
    కోర్సు:
    బీహెచ్‌ఎస్సీ, డిప్లొమా ఇన్ డైటిటిక్స్ అండ్ పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్
    వెబ్‌సైట్: www.du.ac.in/collegedetails  
  8. జాదవ్‌పూర్ యూనివర్సిటీ
    కోర్సు:
    బీటెక్/ఎంటెక్ (ఫుడ్ అండ్ బయో కెమికల్ ఇంజనీరింగ్):
    వెబ్‌సైట్: www.jadavpur.edu
  9. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
    వెబ్‌సైట్:
    www.unom.ac.in/ice.html
  10. యూనివర్సిటీ ఆఫ్ ముంబై
    వెబ్‌సైట్:
    www.mu.ac.in
Published date : 04 Aug 2018 02:51PM

Photo Stories