Skip to main content

నీట్-2019 కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు సూచనలు

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో 15 శాతం నేషనల్ కోటా సీట్లకు నీట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు రౌండ్లలో అఖిల భారత స్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. దేశంలోని అన్ని మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్ 2019 స్కోర్ తప్పనిసరి. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆన్‌లైన్ కౌన్సెలింగ్ ద్వారా సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. నీట్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ అత్యంత కీలకమైనది. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రాథమ్యాలు ఇవ్వడం, చాయిస్ లాకింగ్, కాలేజీకి రిపోర్టింగ్ చేయడం వరకూ.. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలి. జూన్ 19 నుంచి ఆలిండియా కోటాకు కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. అలాగే త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోనూ మెడికల్ కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వైద్య విద్య ప్రవేశాలు, కౌన్సెలింగ్ తీరుతెన్నులు, కాలేజీలు, సీట్లు, అర్హతలు, అవసరమైన ధ్రువపత్రాలు తదితర పూర్తి వివరాలు...
అఖిల భారత వైద్య విద్య 15 శాతం కోటాకు జూన్ 19 నుంచి 24 వరకూ మొదటి రౌండ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది. మొదటి దశలో సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 28 నుంచి జూలై 3వ తేదీ వరకు సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలి. మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌లో భర్తీకాకుండా మిగిలిపోయిన సీట్ల కోసం... జూలై 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ రెండో రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. రెండో రౌండ్‌లో అడ్మిషన్ లభించిన విద్యార్థులు జూలై 13 నుంచి 22వ తేదీ వరకూ.. కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అఖిల భారత కోటా కింద రెండు రౌండ్లలోనూ భర్తీ కాకుండా మిగిలిపోయిన వైద్య విద్య సీట్లను జూలై 23న రాష్ట్రాలకు అప్పగిస్తారు. సెంట్రల్/డీమ్డ్ యూనివర్సిటీలు/ఈఎస్‌ఐసీలకు సంబంధించి మాప్ అప్ రౌండ్ ఆగస్టు 13 నుంచి ఆగస్టు 15 వరకూ జరుగుతుంది. ఇందులో సీటు పొందిన విద్యార్థులు ఆగస్టు 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మాప్ అప్ రౌండ్ తర్వాత మిగిలిపోయిన సీట్లను ఆగస్టు 27న సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లకు అప్పగిస్తారు.

అర్హతలు..
  • ఇంటర్మీడియెట్ బైపీసీ ఉత్తీర్ణత.
  • ఆలిండియా కోటా వైద్య కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు విద్యార్థి తప్పనిసరిగా నీట్ 2019లో అర్హత సాధించాలి. కనీస పర్సంటైల్ పొంది ఉండాలి.
  • తప్పనిసరిగా కౌన్సెలింగ్ ప్రక్రియకు ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • కౌన్సెలింగ్ ప్రక్రియలో చాయిస్‌ను సబ్మిట్ చేయడం తప్పనిసరి. అలా చేస్తేనే సీటు అలాట్‌మెంట్‌కు పరిగణనలోకి తీసుకుంటారు.

అవసరమైన ధ్రువపత్రాలు..
పదో తరగతి మార్కుల మెమో, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, నీట్ అడ్మిట్ కార్డ్, నీట్ స్కోర్ కార్డ్, ట్రాన్స్‌పర్ సర్టిఫికెట్(టీసీ), కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, 8 పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, అలాట్‌మెంట్ లెటర్, ఆధార్/పాన్/డ్రైవింగ్ లెసైన్స్/పాస్‌పోర్‌‌ట, రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తదితర పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

ఆలిండియా కోటాకు రిజిస్ట్రేషన్ ఇలా..
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యాక సంబంధిత వెబ్‌సైట్ https://mcc.nic.in లో లింక్ అందుబాటులోకి వస్తుంది. ఇందులో కోరిన విధంగా విద్యార్థులు తమ వ్యక్తిగత వివరాలతోపాటు అకడెమిక్ డిటెయిల్స్‌ను పొందుపరచాలి.
  • రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక రిఫండబుల్, నాన్ రిఫండబుల్ కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు జూన్ 25వ తేదీ వరకూ ఆన్‌లైన్ విధానంలో డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ విధానాల ద్వారా ఫీజు చెల్లించేందుకు వీలుంది.
  • మొదటి రౌండ్‌కు సంబంధించి చాయిస్ ఫిల్లింగ్, చాయిస్ లాకింగ్ సౌకర్యం జూన్ 25వ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అందుబాటులో ఉంటుంది. స్క్రీన్‌లో కనిపిస్తున్న కాలేజీల జాబితాలో నుంచి విద్యార్థులు తమ ప్రాథమ్యాలను పేర్కొనాల్సి ఉంటుంది. ఎన్ని ప్రాథమ్యాలనైనా పేర్కొనవచ్చు. అభ్యర్థులు తమ ప్రాథమ్యాలను లాక్ చేయడం తప్పనిసరి.
  • మొదటి రౌండ్‌కు సీట్ అలాట్‌మెంట్ ఫలితాలను జూన్ 27వ తేదీన ప్రకటిస్తారు. ఇందులో సీట్ అలాట్‌మెంట్ లిస్ట్, సీట్ అలాట్‌మెంట్ లెటర్ ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన సమాచారం. సీట్ అలాట్‌మెంట్ లిస్ట్‌లో విద్యార్థి పేరు, కేటగిరీ, అలాట్ చేసిన కాలేజీ, కోర్సు తదితర వివరాలు ఉంటాయి. కాలేజీలో రిపోర్ట్ చేసేందుకు ఇతర ధ్రువ పత్రాలతోపాటు సీట్ అలాట్‌మెంట్ లెటర్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
  • మొదటి రౌండ్‌లో సీటు అలాట్‌మెంట్ రిజల్ట్‌లో సీటు పొందిన అభ్యర్థులు జూన్ 28 నుంచి జులై3వ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియను పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది.
  • రిజిస్ట్రేషన్ చేసుకొని మొదటి రౌండ్‌లో సీటు పొందని విద్యార్థులు, సీటు లభించినా కాలేజీలో రిపోర్ట్ చేయని వారు రెండో రౌండ్‌లో పాల్గొనొచ్చు. వీరికి జులై 6వ తేదీ నుంచి కొత్తగా ప్రాధమ్యాలు ఇచ్చే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. మొదటి రౌండ్‌లో రిజిస్టర్ చేసుకున్న, ఫీజు చెల్లించిన విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు చేయాల్సిన అవసరంలేదు. ఇలాంటి అభ్యర్థులు కొత్తగా మళ్లీ తమ ప్రాథమ్యాలను పొందుపరచాల్సి ఉంటుంది.
  • దేశంలో ప్రస్తుతం ఎంసీఐ అనుబంధంగా ఉన్న మొత్తం 529 కళాశాలల్లో 70,878 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. డెంటల్ విభాగంలో 313 కళాశాలల్లో 26,620 సీట్లు అందుబాటులో ఉన్నాయి

పూర్తి వివరాలకు వెబ్‌సైట్ :
15 శాతం ఆలిండియా కోటా సీట్లు/డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీలు/ఈఎస్‌ఐసీ, ఏఎఫ్‌ఎంసీ(ఎంబీబీఎస్/బీడీఎస్) కాలేజీలు, సీట్లు, కౌన్సెలింగ్ ప్రక్రియ సమాచారం కోసం..
వెబ్‌సైట్: https://mcc.nic.in/UGCounselling/home/homepage

స్టేట్ కోటా 85 శాతం సీట్లు :
ప్రభుత్వ కళాశాల్లోని స్టేట్ కోటా 85 శాతం సీట్లతోపాటు ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం వైద్య సీట్లను సంబంధిత రాష్ట్రాల వైద్య విద్య అధికార యంత్రాంగం నీట్‌లో స్కోర్ సాధించిన స్థానిక అభ్యర్థులతో కన్వీనర్ కోటా కింద భర్తీచేస్తుంది. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్ హెల్త్‌యూనివర్సిటీ, విజయవాడ; తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్‌సెన్సైస్, వరంగల్ కౌన్సెలింగ్ ప్రక్రియ చేపడతాయి. అందుకోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేస్తాయి.

నీట్ ఆలిండియా కోటా 15 శాతం/డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీలు/ఈఎస్‌ఐసీ అండ్ ఏఎఫ్‌ఎంసీ (ఎంబీబీఎస్/బీడీఎస్) సీట్లకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ తేదీలు (2019) :
  1. మొదటి రౌండ్ :
    రిజిస్ట్రేషన్/పేమెంట్, చాయిస్ ఫిల్లింగ్ :
    జూన్ 19-24
    చాయిస్ ఫిల్లింగ్/లాకింగ్ : జూన్ 25
    సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ: జూన్ 26
    ఫలితాలు : జూన్ 27
    రిపోర్టింగ్ : జూన్ 28-జూలై 3
    • జూన్ 25 మధ్యాహ్నం 2 గం. వరకు పేమెంట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

  2. రెండో రౌండ్ :
    రిజిస్ట్రేషన్/పేమెంట్, చాయిస్ ఫిల్లింగ్ :
    జూలై 6-8
    చాయిస్ ఫిల్లింగ్/లాకింగ్ : జూలై 9
    సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ: జూలై 10, 11
    ఫలితాలు : జూలై 12
    రిపోర్టింగ్ : జూలై 13-22
    • జూలై 9 మధ్యాహ్నం 12 గం. వరకు పేమెంట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

  3. రిపోర్ట్ చేయని, ఖాళీగా ఉన్న సీట్లు స్టేట్ కోటాకు బదిలీ:
    జూలై 23, 2019 (ఆలిండియా కోటా 15 శాతం సీట్లు మాత్రమే)
    సెంట్రల్/డీమ్డ్ యూనివర్సిటీలు/ఈఎస్‌ఐసీలకు సంబంధించి మాప్-అప్ రౌండ్ :
    రిజిస్ట్రేషన్/పేమెంట్, చాయిస్ ఫిల్లింగ్ :
    ఆగస్టు 13-15
    చాయిస్ ఫిల్లింగ్/లాకింగ్ : ఆగస్టు 16
    సీట్ అలాట్‌మెంట్ ప్రక్రియ: ఆగస్టు 17
    ఫలితాలు : ఆగస్టు 18
    రిపోర్టింగ్ : ఆగస్టు 20-26
    • ఆగస్టు 16 మధ్యాహ్నం 2 గం. వరకు పేమెంట్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

  4. రిపోర్ట్ చేయని/ఖాళీగా ఉన్న సీట్లను డీమ్డ్/సెంట్రల్ యూనివర్సిటీలు/ఈఎస్‌ఐసీలకు బదిలీ: ఆగస్టు 27, 2019.
తెలంగాణలో కాలేజీలు, సీట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్యవిద్య చదవాలనే అభిలాష ఉన్నవారికి అత్యంత ఆసక్తికరం.. ఇక్కడున్న మెడికల్ సీట్ల సంఖ్య. తమ పిల్లలకు ఇక్కడ కాలేజీలో సీటు లభిస్తుందా! లేదా అనే సందిగ్ధం.. తల్లిదండ్రుల్లో ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో 48,996 మంది నీట్‌కు హాజరైతే వీరిలో 33,044 మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఏపీలో 39,039 మంది ఉత్తీర్ణులయ్యారు.

4,600 ఎంబీబీఎస్ సీట్లు:
  • తెలంగాణలో ప్రభుత్వ,ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2019-20 విద్య సంవత్సరానికి 4,600 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,500 ఎంబీబీఎస్ సీట్లు, 21 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 3,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇవికాక 10 ప్రైవేటు, ఒక ఆర్మీ, మరో ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 1,106 డెంటల్ సీట్లున్నాయి. గతేడాది కంటే ఈసారి ఎంబీబీఎస్ సీట్లు ఏకంగా 1,000 పెరిగాయి.
  • ప్రభుత్వంలోని అన్ని సీట్లు, ప్రైవేటు కాలేజీల్లోని 50 శాతం సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఉన్న 1,500 సీట్లలో 15 శాతం అంటే 225 సీట్లు అఖిల భారత కోటా కింద కేంద్రం భర్తీ చేస్తుంది. వాటిలో రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత సీట్లు మిగిలితే తిరిగి వాటిని మన రాష్ట్రానికే ఇస్తారు. మరోవైపు కేంద్రం అగ్రవర్ణ పేదలకు(ఈడబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ రిజర్వేషన్ అమలు చేయాలంటే ప్రస్తుత రిజర్వేషన్లు దెబ్బతినకుండా ఉంచాలి. అందుకు 25 శాతం సీట్లు పెంచాలి. ఆ మేరకు ప్రస్తుత సీట్లకు అదనంగా 375 సీట్లు పెరగాల్సి ఉంటుంది. అవే పెరిగితే మొత్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,875 సీట్లు అవుతాయి. వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల పెంపుపై ప్రతిపాదనలు పంపాలని కేంద్రం రాష్ట్రాన్ని కోరింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపే పనిలో వైద్యవిద్య డెరైక్టరేట్ ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటా అమలు చేయాలంటే నోటిఫికేషన్ విడుదలలోపు దీనిపై కేంద్రం ఓ నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే ఆ సీట్లు అందుబాటులోకి వస్తాయి. అందుకోసమే నోటిఫికేషన్‌ను కొంత ఆలస్యంగా జారీచేయాలని ఆరోగ్య విశ్వవిద్యాలయం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు..

 

కాలేజీ పేరు

సీట్లు

1.

ఉస్మానియా మెడికల్ కాలేజీ, హైదరాబాద్

250

2.

గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్

200

3.

కాకతీయ మెడికల్ కాలేజీ, వరంగల్

200

4.

మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ

150

5.

నల్లగొండ మెడికల్ కాలేజీ

150

6.

నిజామాబాద్ మెడికల్ కాలేజీ

100

7.

సిద్దిపేట మెడికల్ కాలేజీ

150

8.

సూర్యాపేట మెడికల్ కాలేజీ

150

9.

రాజీవ్‌గాంధీ కాలేజీ, ఆదిలాబాద్

100

10.

ఈఎస్‌ఐ, హైదరాబాద్

50

 

మొత్తం

1,500


తెలంగాణ ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్ల వివరాలు..

 

కాలేజీ పేరు

సీట్లు

1.

అపోలో, హైదరాబాద్

100

2.

అయాన్, రంగారెడ్డి జిల్లా

150

3.

భాస్కర్ మెడికల్ కాలేజీ, ఎంకపల్లి

150

4.

చల్మడ ఆనందరావు మెడికల్ కాలేజీ, కరీంనగర్

150

5.

డెక్కన్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్

150

6.

పట్నం మహేందర్‌రెడ్డి మెడికల్ కాలేజీ, చేవెళ్ల

150

7.

వీఆర్‌కే ఉమెన్స్ మెడికల్ కాలేజీ, అజీజ్‌నగర్

100

8.

కామినేని అకాడమీ, హైదరాబాద్

150

9.

కామినేని మెడికల్ కాలేజీ, నార్కట్‌పల్లి

200

10.

మహావీర్ మెడికల్ కాలేజీ, వికారాబాద్

150

11.

మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, హైదరాబాద్

150

12.

మల్లారెడ్డి ఉమెన్స్ మెడికల్ కాలేజీ, హైదరాబాద్

150

13.

మమత మెడికల్ కాలేజీ, బాచుపల్లి

150

14.

మమత మెడికల్ కాలేజీ, ఖమ్మం

150

15.

మెడిసిటీ మెడికల్ కాలేజీ, ఘన్‌పూర్

150

16.

ఎంఎన్‌ఆర్ మెడికల్ కాలేజీ, సంగారెడ్డి

100

17.

ప్రతిమ మెడికల్ కాలేజీ, కరీంనగర్

200

18.

ఆర్వీఎం మెడికల్ కాలేజీ, మెదక్

150

19.

షాదన్ మెడికల్ కాలేజీ, పటాన్‌చెరు

150

20.

సురభి మెడికల్ కాలేజీ, సిద్దిపేట

150

21.

ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్

150

 

మొత్తం

3,100


ఆంధ్రప్రదేశ్లో ఎంబీబీఎస్ సీట్లు :
ఏపీ ప్రభుత్వ కళాశాలలు :

 

కాలేజీ పేరు

సీట్లు

1.

ఆంధ్రా మెడికల్ కాలేజ్, విశాఖపట్నం

200

2.

గుంటూరు మెడికల్ కాలేజ్, గుంటూరు

200

3.

రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్,శ్రీకాకుళం

100-150

4.

రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, ఒంగోలు

100

5.

రంగరాయ మెడికల్ కాలేజ్, కాకినాడ

200

6.

సిద్ధార్థ మెడికల్ కాలేజ్, విజయవాడ (స్టేట్‌వైడ్)

150

7.

ఏసీఎస్‌ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నెల్లూరు

150

8.

గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అనంతపురం

150

9.

కర్నూల్ మెడికల్ కాలేజ్, కర్నూలు

200

10.

రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, కడప

150

11.

ఎస్‌వీ మెడికల్ కాలేజ్, తిరుపతి

200

12.

శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్, తిరుపతి (ఉమెన్)

150

  • 12 ప్రభుత్వ కాలేజీల్లో 2000 వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రైవేటు కళాశాలలు :

 

కాలేజీ పేరు

సీట్లు

1.

అల్లూరి సీతారామరాజు అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్, ఏలూరు

150

2.

కాటూరి మెడికల్ కాలేజ్, గుంటూరు

150

3.

కోనసీమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్, అమలాపురం

150

4.

మహారాజ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, విజయనగరం

150

5.

ఎన్‌ఆర్‌ఐ మెడికల్ కాలేజ్, చినకాకాని

200

6.

డా. పిన్నమనేని సిద్దార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, గన్నవరం

150

7.

జీఎస్‌ఎల్ మెడికల్ కాలేజ్, రాజమండ్రి

200

8.

ఎన్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్,విశాఖపట్నం

150

9.

జీఈఎంఎస్ మెడికల్ కాలేజ్, రాగోలు, శ్రీకాకుళం

150

10.

గాయత్రి విద్యా పరిషత్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కేర్

 

 

అండ్ మెడికల్ టెక్నాలజీ, విశాఖపట్నం

150

11.

పీఈఎస్ మెడికల్ కాలేజ్, కుప్పం

150

12.

శాంతిరామ్ మెడికల్ కాలేజ్, నంద్యాల

100

13.

అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ అండ్ రీసెర్చ్, చిత్తూరు

150

14.

నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు

250

15.

విశ్వభారతి మెడికల్ కాలేజ్, కర్నూలు

150

 

మొత్తం

2400

మైనారిటీ కళాశాలలు...

16.

ఫాతిమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, కడప

100

17.

నిమ్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా

150

గమనిక: ఏపీలోని మెడికల్ కాలేజీల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 25 శాతం సీట్ల సంఖ్య పెరిగే అవకాశముంది. కాబట్టి ఈ కోటా అనంతరం పెరిగే సీట్ల సంఖ్యను అదనంగా పరిగణనలోకి తీసుకోవాలి.

‘ఈడబ్ల్యూఎస్’ జీవో వచ్చాక నోటిఫికేషన్ విడుదల:
Education News పూర్తిగా వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. తొలుత నీట్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తాం. తర్వాత ధ్రువపత్రాల పరిశీలన జరుగుతుంది. ఈ ప్రక్రియతో రాష్ట్ర అభ్యర్థుల తుది మెరిట్ జాబితా తయారవుతుంది. దాదాపు మూడు దశల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తాం. వాస్తవానికి ఈనెల 25 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ జరపాల్సి ఉంది. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన జీవో రావాల్సి ఉన్నందున జాప్యం జరుగుతోంది. ఈ జీవో వచ్చాక కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీచేస్తాం. ఈలోగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తాం. ఆలిండియా కోటాకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు స్టేట్ కోటాకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలిండియా కోటాలో సీటు పొందిన అభ్యర్థి మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత అక్కడి సీటును వదులుకొని ఇక్కడ చేరొచ్చు. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత చేరాలంటే కట్టిన ఫీజులు వదిలేసుకొని రావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమాచారం అధికారిక వెబ్‌సైట్లో చూడొచ్చు. ఆలిండియా కోటాలో మంచి ప్రభుత్వ కళాశాలలు ఉంటాయి. వాటిలో చేరొచ్చు. ఫీజులకు సంబంధించిన నిబంధనలను https://mcc.nic.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. డీమ్డ్ యూనివర్సిటీల్లో సీట్లకు కౌన్సెలింగ్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది. వాటికి స్టేట్ కోటా వర్తించదు. విద్య, ఓబీసీ రిజర్వేషన్, నీట్ కార్డు వంటివి సిద్ధం చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ కింద అన్ని ప్రభుత్వ కళాశాలల్లో 25 శాతం సీట్లు పెరుగుతాయి. దీనిద్వారా రాష్ట్రంలో దాదాపు 500 సీట్లు పెరగనున్నాయి.
- డాక్టర్ సివీ రావు, వైస్ చాన్సలర్, డాక్టర్ ఎన్‌టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్.
Published date : 18 Jun 2019 12:19PM

Photo Stories