మేనేజ్‌మెంట్ లీడర్లను తీర్చిదిద్దేలా.. నచ్చకపోతే మూడేళ్ల తర్వాత ఎగ్జిట్ అయ్యేలా..
డిగ్రీ తొలి సంవత్సరం నుంచే.. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో రాణించేందుకు అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ ఫండమెంటల్స్‌ను బోధించే విధంగా కరిక్యులంను సిద్ధం చేశారు. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో కీలకంగా నిలుస్తున్న అకౌంటింగ్, ఫైనాన్స్ తదితర సబ్జెక్ట్‌లపై కూడా తొలి ఏడాది నుంచే బోధన సాగుతోంది.
మూడేళ్ల తర్వాత ఎగ్జిట్..
ఐపీఎం ప్రోగ్రామ్‌లో చేరి.. మూడేళ్ల తర్వాత ఆ కోర్సును కొనసాగించడం ఆసక్తి లేని విద్యార్థులకు ఎగ్జిట్ అవకాశం కూడా అందుబాటులో ఉంది. మూడేళ్ల తర్వాత బీబీఏ సర్టిఫికెట్‌తో బయటికి రావొచ్చు. నాలుగో ఏడాది తర్వాత మాత్రం ఎగ్జిట్ అవకాశం ఉండదు.
ఎంబీఏ విద్యార్థులతో కలిపి..
అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థులకు నాలుగో ఏడాది నుంచి ఎంబీఏ విద్యార్థులతో కలిపి బోధన సాగిస్తున్నారు. దాంతో క్యాట్ స్కోర్ ఆధారంగా పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశించిన విభిన్న నేపథ్యాల విద్యార్థులతో కలిసి చదువుకునే అవకాశం లభిస్తోంది. ఫలితంగా విద్యార్థులకు ఇంటర్ కల్చరల్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అలవడుతున్నాయి. మేనేజ్‌మెంట్ పీజీ అనగానే గుర్తొచ్చేది.. స్పెషలైజేషన్. ఐపీఎంలో చేరిన విద్యార్థులు తమకు ఆసక్తి గల స్పెషలైజేషన్‌ను నాలుగో సంవత్సరం నుంచి ఎంపిక చేసుకొని అభ్యసించే అవకాశం ఉంది.
ప్లేస్‌మెంట్స్..
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏను అందిస్తున్న ఐఐఎంలు.. మూడో ఏడాది నుంచే ఇంటర్న్‌షిప్ విధానం అమలు చేస్తున్నాయి. ఫలితంగా 19, 20 ఏళ్ల వయసులోనే విద్యార్థులకు క్షేత్రస్థాయి అవగాహన, నైపుణ్యాలు లభిస్తున్నాయి. ఐఐఎం ఇండోర్‌లో గత మూడేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. నూటికి నూరు శాతం మందికి క్యాంపస్ ఆఫర్స్ ఖరారయ్యాయి. సగటు వేతనం రూ.22 లక్షలుగా ఉంది.
ఇంకా చదవండి: part 1: ఇంటర్‌తోనే ఎంబీఏకు అవకాశం.. జిప్‌మ్యాట్ నోటిఫికేషన్ విడుదల..