క్యూఎస్ బ్రిక్స్ వర్శిటీల ర్యాంకింగ్స్ 2017
అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్సిటీలతో మన వర్సిటీలు సైతం పోటీ పడగలిగినప్పుడే నూతన ఆవిష్కరణలు సాధ్యపడతాయి. ఏటా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలకు చెందిన వర్సిటీల ర్యాంకులు ప్రకటించే క్యూఎస్ (క్వాకరెల్లీ సైమండ్స్) వరల్డ్ యూనివర్సిటీ 2017–18 సంవత్సరానికి ర్యాంకులు వెల్లడించింది. బ్రిక్స్ దేశాల్లోని 300 విశ్వవిద్యాలయాలను పరిశీలించిన క్యూఎస్ ఈ ర్యాంకులు ప్రకటించింది. నాణ్యతా ప్రమాణాల ఆధారంగా వెల్లడించిన ఈ ర్యాంకుల్లో మన వర్సిటీల స్థానం ఏమిటో చూద్దాం..!
విదేశీ విద్య విషయంలో అత్యుత్తమ విద్యా సంస్థలను గుర్తించడంలో విద్యార్థులకు అనేక సందేహాలుంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు వివిధ ప్రమాణాల ఆధారంగా ఉత్తమ విద్యాసంస్థలకు ర్యాంకులు ప్రకటిస్తున్నాయి.
ప్రముఖ బ్రిటిష్ ర్యాంకింగ్ ఏజెన్సీ క్యూఎస్ ఇటీవల విడుదల చేసిన 2017–18 బ్రిక్స్ అత్యుత్తమ వర్సటీ ర్యాంకుల్లో భారత విద్యాసంస్థలు గతంలో కన్నా తమ స్థానాలను మెరుగుపరుచుకున్నాయి. తొలి 20 స్థానాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్నాయి. ఇందులో మూడు ఐఐటీలు కాగా, మరొకటి బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) కావడం గమనార్హం. మొత్తం మీద చైనా తర్వాత అత్యధిక ర్యాంకులు మన దేశానికే లభించాయి. ఇక మనదేశం నుంచి ఐఐటీ బాంబే అగ్రస్థానంలో నిలిచింది. అలాగే 15 స్వదేశీ వర్సిటీలు ఫ్యాకల్టీ విద్యార్హతల విభాగంలో, మరో మూడు వర్సిటీలు ఫ్యాకల్టీ పరిశో«ధనాంశాల విభాగంలో 100/100 స్కోర్ సాధించి తమ సత్తా చాటాయి.
చైనా హవా...
క్యూఎస్ తాజాగా విడుదల చేసిన బ్రిక్స్ యూనివర్సిటీ ర్యాంకుల జాబితాలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. టాప్–10లో ఏడు స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది.
ర్యాంకులకు ప్రాతిపదిక (శాతాల్లో)...
1. విద్యాపరమైన ప్రతిష్ట – 30%
2. ఉద్యోగావకాశాల ఖ్యాతి – 20%
3. అధ్యాపకులు– విద్యార్థుల నిష్పత్తి – 20%
4. అంతర్జాతీయ అధ్యాపకుల నిష్పత్తి – 2.5%
5. అంతర్జాతీయ విద్యార్థుల నిష్పత్తి – 2.5%
6. బోధనా సిబ్బంది విద్యార్హతలు – 10%
7. బోధనా సిబ్బంది విజయాలు – 5%
8. బోధనా సిబ్బంది పరిశోధనాంశాలు – 10%
టాప్ ఇన్‌స్టిట్యూట్స్...
వర్సిటీ | ర్యాంక్ |
1. ఐఐటీ బాంబే (ఐఐటీ–బీ) | 9 |
2. ఐఐఎస్సీబెంగళూరు | 10 |
3. ఐఐటీ ఢిల్లీ | 17 |
4. ఐఐటీ మద్రాస్ | 18 |
5. ఐఐటీ కాన్పూర్ | 21 |
6. ఐఐటీ ఖరగ్‌పూర్ | 24 |
7. ఢిల్లీ యూనివర్సిటీ | 41 |
8. ఐఐటీ రూర్కీ | 51 |
9. ఐఐటీ గౌహతి | 52 |
10. కోల్‌కతా యూనివర్సిటీ | 64 |
- క్యూఎస్ ప్రపంచ అత్యుత్తమ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ వర్సిటీల ర్యాంకుల జాబితాలో మనదేశం నుంచి మూడు విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.
- టాప్ 50లో ఐఐఎం బెంగళూరు (22), ఐఐఎం అహ్మదాబాద్ (23), ఐఐఎం కలకత్తా (46) స్థానాలను కైవసం చేసుకున్నాయి.
- ప్రపంచవ్యాప్త మేనేజ్‌మెంట్ వర్సిటీల జాబితాలో హెచ్‌ఈసీ పారిస్ వర్సిటీ మొదటి స్థానంలో , లండన్ బిజినెస్ స్కూల్, ఈఎస్‌ఏడీఈ బిజినెస్ స్కూల్ (స్పెయిన్) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.
- ఇక గ్లోబల్ ఎంబీఏ విభాగంలో ఐఐఎం అహ్మదాబాద్ 49వ స్థానంతో సరిపెట్టుకుంది.