కోవిడ్ పరిస్థితుల్లో తగ్గిన పదో తరగతి సిలబస్.. అనుకూలమా.. ప్రతికూలమా..?
ఆన్‌లైన్‌లో క్లాస్‌లు వింటున్న విద్యార్థులకు ఇది కొంత ఊరట కలిగించే విషయమని చెప్పొచ్చు. విద్యార్థులు సబ్జెక్టును అధ్యయనం చేసేటప్పుడు.. సిలబస్‌లో తగ్గించిన అంశాలను మినహాయించి.. మిగతా వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ వ్యూహం స్వీయ ప్రిపరేషన్ పరంగా ఎంతో మేలు చేస్తుంది. సమయం కూడా కలిసొస్తుంది.
ఏప్రిల్‌లో పరీక్షలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో, అదే విధంగా సీబీఎస్‌ఈ బోర్డ్ పరిధిలో వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పదోతరగతి పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రాల్లోని స్కూల్స్ అనుసరిస్తున్న విధానాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఫిబ్రవరి నాటికి సిలబస్ బోధన దాదాపు పూర్తవుతుంది. కాబట్టి విద్యార్థులు ఆన్‌లైన్ సిలబస్ బోధన పూర్తయ్యాక.. అప్పటివరకు తాము రాసుకున్న నోట్స్‌ను రెగ్యులర్‌గా రివిజన్ చేస్తుండాలి. అలాగే మోడల్ టెస్ట్‌లు, వీక్లీటెస్ట్‌లలో చూపిన ప్రతిభ ఆధారంగా.. బలహీనంగా ఉన్న టాపిక్స్‌పై పూర్తి స్థాయి ప్రిపరేషన్ సాగించాలి.
ఫిబ్రవరి నుంచి ఇలా..
- విద్యార్థులు అప్పటివరకు ఆన్‌లైన్‌లో విని.. తాము రాసుకున్న నోట్స్‌ను ప్రతి రోజు చదవాలి.
- ముఖ్యమైన వ్యాకరణాంశాలు, సూత్రాలు, సిద్ధాంతాలు, డయాగ్రమ్స్‌ను ప్రాక్టీస్ చేస్తుండాలి.
- మ్యాథమెటిక్స్‌లో గ్రాఫ్‌లు, నిర్మాణాత్మక సమస్యలకు సమాధానాలు సాధన చేయాలి.
- సోషల్ స్టడీస్‌కు సంబంధించి మ్యాప్ పాయింటింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
- కెమిస్ట్రీలో రసాయనిక సమీకరణాలు, మూలకాలు-ధర్మాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి.
- ఇలా.. మార్చి మొదటి వారానికి ఆఫ్‌లైన్ విధానంలో ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా స్వీయ సమయ పాలన పాటించాలి.
ఇంకా చదవండి: part 4: ఆన్‌లైన్ తరగతులు పూర్తై తర్వాత పదో తరగతి విద్యార్థులకు ఇవీ కూడా ముఖ్యమే..!