Skip to main content

కెరీర్ షైనింగ్‌కు...సోషల్ సెన్సైస్!

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆప్ సోషల్ సెన్సైస్(టిస్)... ప్రభుత్వ నిధులు అందుకునే డీమ్డ్ యూనివర్సిటీ. సోషల్ సెన్సైస్ కోర్సులను అందించడంలో పేరొందిన టిస్’.. 2019-2020 విద్యా సంవత్సరానికి పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ముంబై, హైదరాబాద్, తుల్జాపూర్, గువహటి, చెన్నైలలోని క్యాంపస్‌ల్లో వేర్వేరు విభాగాల్లో ఎంఏ/ఎంఎస్సీ/ఎంహెచ్‌ఏ/ ఎంపీహెచ్ తదితర కోర్సులను టిస్ అందిస్తోంది. వీటిల్లో ప్రవేశాలకు మొదటి దశలో జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష ‘టిస్‌నెట్’ నిర్వహిస్తారు. తాజాగా టిస్‌నెట్-2019కు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో పూర్తి వివరాలు..

అర్హతలు :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ (10+2+3 లేదా 10+2+4 విధానంలో, 15 సంవత్సరాల ఫార్మల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి) పూర్తిచేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు 2019 జూన్ 5 లోపు ఉత్తీర్ణత సాధించాలి. కొన్ని కోర్సులకు అదనపు అర్హతలు అవసరం. కోర్సుల వారీగా అర్హత ప్రమాణాలు వేర్వేరుగా ఉన్నాయి.

ప్రవేశం ఇలా..
టిస్ కోర్సుల్లో ప్రవేశ ప్రక్రియ మూడంచెల విధానంలో జరుగుతుంది. ఇందులో ఆన్‌లైన్ విధానంలో నేషనల్ కామన్ రిటెన్ టెస్ట్; ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్(పీఐటీ)/గ్రూప్ డిస్కషన్(జీడీ), పర్సనల్ ఇంటర్వ్యూ దశలు ఉంటాయి. ఈ మూడు దశలకు మొత్తం 225 మార్కులు కేటాయించారు.

పరీక్ష విధానం :
  • మొదటి దశలో ఆన్‌లైన్ పరీక్ష.. నేషనల్ కామన్ ఎంట్రెన్‌‌స టెస్ట్(టిస్ నెట్)ను దేశవ్యాప్తంగా 39 కేంద్రాల్లో 2019 జనవరి 13న నిర్వహిస్తారు. ఈ ఆన్‌లైన్ టెస్ట్‌కు 100 మార్కులు కేటాయించారు. ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఇంగ్లిష్‌లో ఉండే ఈ పరీక్షకు ఒక గంట 40 నిమిషాల్లో (100నిమిషాల్లో) సమాధానాలను గుర్తించాలి.
  • ఆన్‌లైన్ టెస్టులో జనరల్ నాలెడ్జ్, అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్ సెక్షన్‌కు 40 మార్కులు, ఇంగ్లిష్ సెక్షన్‌కు 30 మార్కులు, మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్ విభాగానికి 30 మార్కులు కేటా యించారు.
సిలబస్ ఇదీ..
  1. జనరల్ అవేర్‌నెస్‌లో.. ఎన్విరాన్‌మెంట్, ఎకాలజీ, పాలిటీ, హిస్టరీ, గవర్నెన్స్, లా, ఎకానమీ,పాలసీ, ఇంటర్నేషనల్ పాలిటిక్స్/కరెంట్ ఈవెంట్స్, జెండర్, హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్, మీడియా, లిటరేచర్, ఆర్ట్, కల్చర్, స్పోర్ట్స్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  2. ఇంగ్లిష్‌లో... వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంటాయి. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో ప్యాసేజ్ ముఖ్య ఉద్దేశం, బలమైన, బలహీనమైన పాయింట్లు, అసంప్షన్స్, సపోర్టింగ్ స్టేట్‌మెంట్, ప్యాసేజీ ఆధారిత ప్రశ్నలు, రచయిత దృష్టిని అర్థం చేసుకోవడం.. వంటివి అడుగుతారు.
  3. వెర్బల్ ఎబిలిటీలో..అనాలజీస్, యాంటోనిమ్స్, ఆడ్‌మన్ ఔట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్, ఖాళీల భర్తీకి సరైన పదాలను ఉపయోగించడం, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఇడియమ్స్, ఎర్రర్ స్పాటింగ్, సెంటెన్స్ కరెక్షన్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
  4. లాజికల్ రీజనింగ్(ఎల్‌ఆర్), డేటా ఇంటర్‌ప్రిటేషన్, మ్యాథమెటిక్స్‌లో.. ఎల్‌ఆర్ నుంచి నంబర్ సిరీస్, ఆల్ఫాబెట్‌సిరీస్, స్టేట్‌మెంట్ కన్‌క్లూజన్, లాజికల్ కనెక్టివిటీ, వెన్ డయాగ్రం, పజిల్స్, క్యూబ్స్, లీనియర్, సర్కులర్, ఫ్యామిలీ అరెంజ్‌మెంట్స్ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
  5. డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగం(డీఐ)లో.. బార్‌గ్రాఫ్, టేబుల్స్, పై చార్ట్, డబుల్ పై చార్ట్, కేస్‌లెట్స్, మల్టీపుల్ గ్రాఫ్స్, లైన్ గ్రాఫ్స్, డేటా కంపేరిజన్; మ్యాథ్స్ నుంచి లాభనష్టాలు, సగటు, జామెట్రీ, నిష్పత్తులు, శాతాలు చాప్టర్లు ముఖ్యమైనవి.
  6. నెగిటివ్ మార్కింగ్ విధానం లేదు. కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించొచ్చు.
  7. మాదిరి ప్రశ్నపత్రం, గత ప్రశ్న పత్రాలు టిస్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశముందో అంచనాకు రావచ్చు. ప్రిపరేషన్‌కు మెరుగులు దిద్దుకోవచ్చు.

పీఐటీ.. రాత పరీక్షే

ఆన్‌లైన్ టెస్టులో ఇన్‌స్టిట్యూట్ నిర్దేశించిన కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులకు రెండోదశలో ప్రీ ఇంటర్వ్యూ టెస్ట్(పీఐటీ)కు హాజరవ్వాలి. పీఐటీకి 50 మార్కులు కేటాయించారు. ఇది కూడా రిటన్ టెస్టే. అయితే కొన్ని కోర్సులకు పీఐటీగా గ్రూప్ డిస్కషన్స్ నిర్వహిస్తారు. పీఐటీ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూకు హాజరవ్వాలి. దీనికి 75 మార్కులు కేటాయించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న కోర్సులకు సంబంధించి ప్రశ్నలు అడిగే అవకాశముంది.

వెయిటేజీ... తుది జాబితా
ప్రవేశ ప్రక్రియలో అనుసరించే మూడు విభాగాలకు ప్రత్యేకంగా వెయిటేజీ ఉంటుంది. కామన్ ఎంట్రన్‌‌స టెస్ట్‌కు 40 శాతం, పీఐటీ/జీబీకి 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 30 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. ఈ మూడింటిలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు.

ప్లేస్‌మెంట్స్‌కు బేఫికర్!
టిస్‌లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు ఉంటుందనడంతో అతిశయోక్తి లేదు. అభ్యర్థులు ఎంచుకున్న కోర్సు ఆధారంగా పలు కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి.

ముఖ్య సమాచారం...
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2018, డిసెంబర్ 10
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడ్: 2018, డిసెంబర్ 26-27
టిస్ నేషనల్ ఎంట్రెన్స్ టెస్టు తేదీ: 2019, జనవరి 13
అర్హుల జాబితా వెల్లడి: 2019, ఫిబ్రవరి 4
పీఐటీ/ఇంటర్వ్యూ షెడ్యూల్: మార్చి 5 ఏప్రిల్ 4 వరకు (వేర్వేరు షెడ్యూలలో)
ఫలితాల వెల్లడి: 2019, ఏప్రిల్ 22
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు
వెబ్‌సైట్: https://admissions.tiss.edu
Published date : 13 Nov 2018 04:16PM

Photo Stories