Skip to main content

జేఎన్ఏఎఫ్ఏయూలో ఫైన్ ఆర్ట్స్ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. కోర్సుల వివ‌రాలు ఇదిగో..

జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్సిటీ (జేఎన్‌ఏఎఫ్‌ ఏయూ).. ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఏడీఈఈ)–2020 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జేఎన్‌ఏఎఫ్‌యూ అనుబంధ కళాశాలల్లో నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైనార్ట్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు. ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రవేశ పరీక్ష విధానం, ప్రవేశ ప్రక్రియ, ఆయా కోర్సులతో ఉద్యోగ అవకాశాలపై కథనం...

కోర్సులు..

  •     బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (అప్లయిడ్‌ ఆర్ట్స్, పెయింటింగ్, స్కల్పచర్‌ అండ్‌ యానిమేషన్‌); కోర్సు కాల వ్యవధి.. నాలుగేళ్లు. 
  •     బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (ఫోటోగ్రఫీ); కోర్సు కాల వ్యవధి.. నాలుగేళ్లు.
  •     బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఇంటీరియర్‌ డిజైన్‌); కోర్సు కాల వ్యవధి.. నాలుగేళ్లు.
  •     అర్హత: ఇంటర్మీడియెట్‌/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. 

పరీక్ష తేదీలు..

  •     బీఎఫ్‌ఏ: అక్టోబరు 18, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు.
  •     బీఎఫ్‌ఏ(ఫోటోగ్రఫీ): అక్టోబరు 19, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు. 
  •     బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌: అక్టోబరు 19, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. 

ఇంకా చ‌ద‌వండి: part 2: జేఎన్ఏఎఫ్ఏయూ ప‌రీక్ష విధానం ఇలా..

Published date : 22 Sep 2020 05:54PM

Photo Stories