ఇంటర్‌తోనే ఐఐఎంలో పీజీ.. వివరాలు తెలుసుకోండిలా..
ఈ ఇన్‌స్టిట్యూట్స్‌లో కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ కంపెనీలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతాయి. లక్షల ప్యాకేజీలతో జాతీయ,అంతర్జాతీయ సంస్థలెన్నో ఆఫర్లు అందిస్తాయి. అలాంటి ప్రతిష్టాత్మక ఐఐఎంల్లో ఇంటర్‌తోనే ఉన్నత చదువుకు అవకాశం ఉంటే.. అది కచ్చితంగా విద్యార్థులకు ఉపయుక్తమే! ఇప్పటికే పలు ఐఐఎంలు ఇంటర్ అర్హతతోనే ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందిస్తుండగా... తాజాగా ఆ జాబితాలో చేరింది.. ఐఐఎం బోధ్‌గయ. ఇంటర్ విద్యార్హతతో ఐఐఎంలో మేనేజ్‌మెంట్ విద్యను అభ్యసించడానికి అవకాశం కల్పిస్తున్నాయి ఐఐఎం ఇండోర్, ఐఐఎం రోహతక్. తాజాగా ఐఐఎం బోధ్‌గయ కూడా కొత్తగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. 2021-26 విద్యా సంవత్సరానికి గాను ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)లో ప్రవేశాలు కల్పించనున్నట్లు పేర్కొంది.
ఐఐఎం, బోధ్‌గయ..
బీహార్ రాష్ట్రంలో 2015లో ఐఐఎం బోధ్‌గయను ఏర్పాటుచేశారు. 119 ఎకరాల సువిశాల క్యాంపస్‌లో పబ్లిక్ బిజినెస్ స్కూల్‌గా ఐఐఎం బోధ్‌గయ ప్రస్థానం ప్రారంభమైంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్(పీజీపీ) కోర్సులను అందిస్తోంది. ఈ విద్యా సంస్థ 2021 విద్యాసంవత్సరంలో 50 సీట్లతో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను సైతం ప్రారంభించింది. ఐఐఎం ఇండోర్, ఐఐఎం రోహతక్ తర్వాత మేనేజ్‌మెంట్ విద్యలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును అందిస్తున్న సంస్థ ఐఐఎం బోధ్‌గయ కావడం విశేషం. వ్యాపార, వాణిజ్య రంగాలకు ఎంతో కీలకమైన మేనేజ్‌మెంట్ నైపుణ్యాల్లో చిన్న వయసులోనే విద్యార్థులకు శిక్షణ ఇచ్చి.. యువతను భావి మేనేజర్లుగా తీర్చిదిద్దడమే ఐఐఎం బోధ్‌గయ ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ కోర్సు లక్ష్యంగా ఉంది.
ఇంకా చదవండి: part 2: ఇంటర్‌తోనే ఐఐఎంలో పీజీ పొందేందుకు ఉపయోగపడే ఐపీఎం కోర్సు సీట్లు, అర్హత ఇవిగో..