Skip to main content

ఇంటర్‌తోనే ఐఐఎంలో పీజీ పొందేందుకు ఉపయోగపడే ఐపీఎం కోర్సు సీట్లు, అర్హత ఇవిగో..

ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులో భాగంగా 60 సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ 60 సీట్లలో 50 జనరల్ సీట్లు. కాగా అదనంగా మహిళల కోసం 10 సూపర్ న్యూమరరీ సీట్లను కేటాయించారు.

ఐపీఎం కోర్సులో భాగంగా మొదటి మూడేళ్లు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్(బీబీఎం).. ఆ తర్వాత మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ)లో శిక్షణను అందిస్తారు. ఒక వేళ మొదటి మూడేళ్ల తర్వాత కోర్సు నుంచి బయటి రావాలనుకుంటే.. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిగ్రీ సర్టిఫికెట్ లభిస్తుంది.

అర్హతలు..
ఐఐఎం బోధ్‌గయ-ఐపీఎం కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు.. పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 55శాతం మార్కులతో 2019, 2020లో ఇంటర్ పూర్తిచేసుకోవాలి. 2021లో ఇంటర్ ఫైనల్ పరీక్షలు రాసే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి..
ఆగస్టు 01, 2001 తర్వాత జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ /దివ్యాంగులు ఆగస్టు 01, 1996 తర్వాత జన్మించాలి.

ఎంపిక ప్రక్రియ..
ఐఐఎం బోధ్‌గయ అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. రాత పరీక్ష 70శాతం మార్కులకు, ఇంటర్వ్యూకు 30శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది. వీటిల్లో సాధించిన మెరిట్ ప్రాతిపదికన తుది ఎంపిక చేస్తారు.

ఇంకా చదవండి: part 3: ఐఐఎంలో ఇంటిగ్రేటేడ్ పీజీ చేస్తే కెరీర్ అవకాశాలు ఇవే..

Published date : 18 Jan 2021 02:40PM

Photo Stories