ఇంజనీరింగ్‌లో ఈ కోర్సు చేస్తే బిజినెస్ టెక్నిక్స్ కూడా సొంతం చేసుకోవచ్చు.. తెలుసుకోండిలా?
Sakshi Education
ఒకప్పుడు వ్యాపార సంస్థల మధ్య పోటీ తక్కువగా ఉండేది. కొన్ని సంస్థల గుత్తాధిపత్యం కొనసాగేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ నేపథ్యంలో.. వ్యాపార సంస్థల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది.
దీంతో ఆయా వ్యాపారాలను లాభాల బాటలో తీసుకేళ్లేందుకు అందరూ బిజినెస్ అనలిటిక్స్ సహాయం తీసుకుంటున్నారు. అందుకే ప్రస్తుతం బడా కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకూ.. లక్షల్లో జీతాలు ఇచ్చి బిజినెస్ అనలిటిక్స్ నిపుణులను నియమించుకుంటున్నాయి. దీంతో బిజినెస్ అనలిటిక్స్‌కు బాగా డిమాండ్ ఏర్పడింది.
- పనితీరు మదింపు: స్టాటిస్టికల్, క్వాంటిటేటివ్, టెక్నికల్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి అందుబాటులో ఉన్న సమాచారాన్ని వివిధ రకాల పద్దతుల ద్వారా విశ్లేషించి.. ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ పని తీరును మదించడమే బిజినెస్ అనలిటిక్స్. ఆయా సంస్థల వ్యాపారవృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించేందుకు బిజినెస్ అనలిటిక్స్ ఉపయోగపడుతుంది.
- కోర్సు స్వరూపం: ఈ కోర్సులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాలనకునే వారు బీటెక్ బిగ్ డేటా అనలిటిక్స్ కోర్సు చేయాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ఈ కోర్సులో డేటా మైనింగ్, డేటా వేర్‌హౌసింగ్, డేటా విజువలైజేషన్ అధ్యయనం చేస్తారు. ఈ కోర్సు కూడా డేటా సైన్స్‌కు అనుబంధంగా ఉంటుంది.
- జాబ్ ప్రొఫైల్ : ఈ కోర్సును పూర్తిచేసిన విద్యార్థులు బిజినెస్ అనలిటిక్స్‌గా కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
- వేతనాలు: బిజినెస్ అనలిటిక్స్ నిపుణులకు నైపుణ్యాలను బట్టి వార్షిక వేతనం రూ.ఆరు లక్షల నుంచి రూ.పది లక్షల వరకూ లభిస్తుంది.
Published date : 17 Nov 2020 04:48PM