Skip to main content

ఈ–లెర్నింగ్‌ విస్తృతమైన ఈ తరుణంలోనూ.. అది ఎంతో మందికి అందని కలే..

అమెరికా వంటి దేశాల్లో ఎప్పటినుంచో అందుబాటులో ఉన్న ఈ–లెర్నింగ్‌ విధానం.. కొవిడ్‌ మూలంగా మన దేశంలో అత్యంత వేగంగా అమల్లోకి వచ్చింది.
ఇకపైనా ఈ–లెర్నింగ్‌ విధానం మరింత విస్తృతమయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతేకాకుండా ఎవరికి వారు ఇంటి నుంచే పనిచేయడానికి (వర్క్‌ ఫ్రం హోమ్‌) ఎక్కువ ఆసక్తి చూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులు సైతం ఇంట్లోనే ఉండి చదువుకునేందుకు అలవాటు పడుతున్నారు. ఎడెక్స్, ఉడెమీ, కోర్స్‌ఎరా, ఎలిసన్‌ వంటి మూక్స్‌(మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సెస్‌) వేదికలు.. నిష్ణాతులతో రూపొందించిన కోర్సులను డిజిటల్‌ లెర్నింగ్‌ రూపంలో ఉచితంగా అం దిస్తున్నాయి. ఇందులో సంప్రదాయ కోర్సుల నుంచి ఐటీ స్కిల్స్‌ వరకూ.. అనేక నైపుణ్యాలు అందిపుచ్చుకునే అవకాశం ఉంది.

అందని కల ‘ఆన్‌లైన్‌’..
కొవిడ్‌ మహమ్మారి కారణంగా చదువుకునే పిల్లలున్న ప్రతి కుటుంబానికి ఇంటర్నెట్‌ తప్పనిసరిగా మారింది. వాస్తవానికి ఇప్పటికీ దేశంలో చాలామందికి కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ వంటివి అందుబాటులో లేవు. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో రోజుకు 12గంటల కంటే తక్కువ సమయం మాత్రమే విద్యుత్‌ అందుబాటులో ఉంటోంది. అనేక ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు ఆన్‌లైన్‌ బోధనలో సవాళ్లను ఎదుర్కొంటు న్నాయి. తక్కువ ఆదాయం గల కుటుంబాల్లోని విద్యార్థులు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు లేక చదువులకు దూరంగా ఉంటున్నారు. ఇలాంటి విద్యార్థులకు డిజిటల్‌ లెర్నిం గ్‌కు అవసరమైన ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌/ల్యాప్‌ట్యాప్‌ వంటివి అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.

ఇంకా చదవండి: part 1: విద్యా బోధనలో డిజిటల్‌ శకం.. టెక్నాలజీ కేంద్రంగా మారుతున్న చదువులు..
Published date : 18 Dec 2020 03:52PM

Photo Stories