Skip to main content

ఈ కోర్సులతో ప్రైవేటు రంగంలో రూ.6లక్షల వరకు వేతనాలు పొందే అవకాశం!


ప్రైవేటు రంగంలో ప్రారంభంలో ఏడాదికి రూ.6 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో చేరేవారికి ఎంట్రీ లెవెల్‌లో నెలకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ప్యాకేజీ లభిస్తోంది. ముఖ్యంగా నేరాలు అధికమవుతున్నందున కేసుల దర్యాప్తులో ఫోరెన్సిక్‌ నిపుణుల సేవలు కీలకంగా మారుతున్నాయి. అమెరికా వంటి దేశాల్లో ఫోరెన్సిక్‌ సైంటిస్టులకు ఆకర్షణీయ వేతనాలు లభిస్తున్నాయి.

ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులు..
కొన్ని విద్యా సంస్థలు బీఎస్సీలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ఒక సబ్జెక్టుగా అందిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో మ్యాథ్స్, సైన్స్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇందులో చేరొచ్చు. అలాగే yì గ్రీలో మ్యాథ్స్, సైన్స్‌ చదివిన విద్యార్థులు పీజీ ఫోరెన్సిక్‌ సైన్స్‌ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీనికోసం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్సిటీలు కోర్సులు అందిస్తున్నాయి. పీజీ తర్వాత పీహెచ్‌డీ చేసే అవకాశం కూడా ఉంది.

కోర్సులు అందిస్తున్న సంస్థలు..
  • లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రిమినాలజీ అండ్‌ ఫొరెన్సిక్‌ సైన్స్, న్యూఢిల్లీ
  • గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ
  • యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ
  • పంజాబ్‌ యూనివర్సిటీ
  • ఉస్మానియా యూనివర్సిటీ
  • యూనివర్సిటీ ఆఫ్‌ లక్నో
  • బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫొరెన్సిక్‌ సైన్స్, ముంబయి
  • గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫోరెన్సిక్‌ సైన్స్, ఔరంగాబాద్‌
  • యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్‌ తదితర విద్యాసంస్థలు పీజీ, పీహెచ్‌డీ, పీజీ డిప్లొమా స్థాయి కోర్సులను అందిస్తున్నాయి.
ఇంకా చదవండి: part 1: ఉద్యోగ వేటలో దూసుకుపోతున్న ఫోరెన్సిక్‌ సైన్స్‌.. అసలేంటిది?
Published date : 24 Nov 2020 01:55PM

Photo Stories