గేట్-2020 సక్సెస్ ప్లాన్..
Sakshi Education
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(గేట్).. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్ష. గేట్ ద్వారా ఐఐటీలు, నిట్‌లు వంటి ప్రముఖ ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.
అంతేకాకుండా గేట్‌లో ప్రతిభ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువు సైతం సొంతం చేసుకునే అవకాశముంది. ఐఐటీ ఢిల్లీ దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 1, 2, 8, 9 తేదీల్లో గేట్-2020 నిర్వహణకు ఏర్పాట్లుచేస్తోంది. ఈ నేపథ్యంలో.. గేట్ అభ్యర్థులకు ఉపయోగపడేలా ప్రిపరేషన్ ప్రణాళిక...
పరీక్ష విధానం :
గేట్‌ను 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఐదు ఒక మార్కు ప్రశ్నలు, ఐదు రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్‌పై 15 మార్కులకు, సబ్జెక్టు/డిసిప్లైన్‌పై 70 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ఒక మార్కు, 30 రెండు మార్కుల ప్రశ్నలు ఎదురవుతాయి. మొత్తంగా ప్రశ్నపత్రం 65 ప్రశ్నలను 100 మార్కులకు ఉంటుంది.
బేసిక్స్‌పై గురి..
గేట్‌లో విజయానికి అత్యుత్తమ మార్గం బేసిక్స్ పట్టు సాధించడమే అన్నది నిపుణుల అభిప్రాయం! కాబట్టి అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఈ 25 రోజులకు చక్కని ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించాలి. నిర్దేశిత సమయంలో ఆయా అంశాలను చదువుతూ రివిజన్ పూర్తి చేయాలి.
{పశ్నించుకోండి...?
పరీక్ష విధానం :
గేట్‌ను 100 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్నపత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. జనరల్ ఆప్టిట్యూడ్ విభాగం 15 మార్కులకు ఉంటుంది. ఇందులో ఐదు ఒక మార్కు ప్రశ్నలు, ఐదు రెండు మార్కుల ప్రశ్నలు అడుగుతారు. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్‌పై 15 మార్కులకు, సబ్జెక్టు/డిసిప్లైన్‌పై 70 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ఇందులో 25 ఒక మార్కు, 30 రెండు మార్కుల ప్రశ్నలు ఎదురవుతాయి. మొత్తంగా ప్రశ్నపత్రం 65 ప్రశ్నలను 100 మార్కులకు ఉంటుంది.
బేసిక్స్‌పై గురి..
గేట్‌లో విజయానికి అత్యుత్తమ మార్గం బేసిక్స్ పట్టు సాధించడమే అన్నది నిపుణుల అభిప్రాయం! కాబట్టి అభ్యర్థులు అందుబాటులో ఉన్న ఈ 25 రోజులకు చక్కని ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. అన్ని సబ్జెక్టులకు సమయం కేటాయించాలి. నిర్దేశిత సమయంలో ఆయా అంశాలను చదువుతూ రివిజన్ పూర్తి చేయాలి.
{పశ్నించుకోండి...?
- చివరి దశ ప్రిపరేషన్‌లో అభ్యర్థులు కొన్ని స్వీయ ప్రశ్నలను సంధించుకోవాలి. ఇందులో భాగంగా గేట్-2020 సిలబస్‌ను మరొకసారి చదివి.. సిలబస్‌లోని ఆయా అంశాలపై పట్టు సాధించామా లేదా అని ప్రశ్నించుకోవాలి. బలహీనంగా ఉన్నామని భావించిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
- క్లిష్టత ఆధారంగా అభ్యర్థులు టాపిక్స్‌ను విభజించుకోవాలి. తదనుగుణంగా వాటికి సమయం వెచ్చించాలి. రోజుకు ఎన్ని గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించగలననే విషయంలో ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అమలుచేయాలి.
- ఒకే ప్రిపరేషన్ ప్రణాళిక అందరికీ సరితూగదు. స్వీయ సామర్థ్యాలు, అందుబాటులో ఉన్న సమయం ఆధారంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. ఈ చివరి 25 రోజుల్లో పటిష్ట ప్రిపరేషన్ ప్రణాళికను అనుసరిస్తే మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది.
- తొలి ఐదు రోజులు అందరికీ కామన్‌గా ఉండే జనరల్ అప్టిట్యూడ్ టెస్టు సిలబస్‌కు సంబంధించి కాన్సెప్టులు,వాటికి సంబంధించిన సమస్యలను సాధించాలి. మరో ఐదు రోజులు మ్యాథమెటిక్స్ రివిజన్,ప్రాక్టీస్, అనాలసిస్‌లకు కేటాయించాలి. దీంతోపాటు మాక్ టెస్టులు రాసి తప్పొప్పులను విశ్లేషించుకోవాలి.
- పది రోజులు అధిక వెయిటేజీ ఉండే సంబంధింత ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టుల్లోని చాప్టర్ల కాన్సెప్టులు, సమస్యలకు సంబంధించిన ప్రిపరేషన్‌ను పూర్తి చేయాలి. చివరి ఐదు రోజులు రివిజన్, మోడల్ పేపర్లు, పాత పేపర్లు, మాక్‌టెస్టులు రాసి వాటిని విశ్లేషించేందుకు కేటాయించాలి.
- నిపుణుల సలహా ప్రకారం- గేట్ అభ్యర్థులు రోజుకి 8 గంటలకు తగ్గకుండా ప్రిపేర్‌కావాలి. ప్రతి పేపర్‌కు సంబంధించిన సిలబస్, ప్యాట్రన్‌లు వేర్వేరుగా ఉంటాయి. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాలి.
- {పిపరేషన్ సందర్భంగా ఏవైనా అంశాలు కఠినంగా అనిపించినప్పటికీ.. నిరుత్సాహ పడకుండా ప్రిపరేషన్ సాగించాలి. ఇతరులతో పోల్చుకోరాదు.
- ఒత్తిడికి గురికాకుండా ప్రతి టాపిక్‌ను పట్టుదలతో పూర్తి చేయాలి.
- ఒక అంశాన్ని చదవడం పూర్తి చేసిన తర్వాత రివిజన్‌తోపాటు విశ్లేషణ చేయాలి.
- {పాక్టీస్‌ను కచ్చితంగా పాటించాలి. ప్రాక్టీస్‌లో చేస్తున్న తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకోవాలి. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి.
- ఆయా స్పెషలైజేషన్లకు సంబంధించి వెయిటేజీ పరంగా కొన్ని చాప్టర్లకు ప్రాధాన్యం దక్కుతోంది. వాటి వివరాలు...
- కంప్యూటర్ సైన్స్: థియరీ ఆఫ్ కంప్యుటేషన్, డిజిటల్ లాజిక్, కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్, కంపైలర్ డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్,డేటాబేస్,కంప్యూటర్ నెట్‌వర్క్స్, సాఫ్ట్ ఇంజ నీరింగ్/వెబ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మ్యాథ్స్.
- సివిల్ ఇంజనీరింగ్: ఎస్‌వోఎం, స్ట్రక్చరల్ అనాలసిస్, జియో టెక్నికల్, ఎఫ్‌ఎం అండ్ హైడ్రాలిక్ మిషన్, ఇరిగేషన్ అండ్ హైడ్రాలజీ, ఆర్‌సీసీ అండ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్, డిజైన్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్, హైవే అండ్ సర్వేయింగ్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మ్యాథ్స్.
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: నెట్‌వర్క్ థియరీ, సిగ్నల్ అండ్ సిస్టమ్, ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజర్‌మెంట్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ మ్యాథ్స్.
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్: నెట్ వర్క్ థియరీ, ఎలక్ట్రానిక్స్ డివెజైస్ అండ్ సర్క్యూట్స్, అనలాగ్ సర్క్యూట్స్, డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్ అండ్ సిస్టమ్స్, కంట్రోల్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఈఎంటీ, మైక్రో ప్రాసెసర్స్, ఇంజనీరింగ్ మ్యాథ్స్.
- మెకానికల్: ఇంజనీరింగ్ మెకానిక్స్, ఎస్‌వోఎం, థియరీ ఆఫ్ మెకానిక్స్, మెషీన్ డిజైన్, ఎఫ్‌ఎం, హీట్ ట్రాన్స్‌ఫర్, థర్మోడైనమిక్స్, ఆర్‌ఏసీ, మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మ్యాథ్స్.
Published date : 06 Jan 2020 06:15PM