Skip to main content

ఏరోనాటిక్స్ చ‌ద‌వాల‌నుకునే మహిళలకు డీఆర్‌డీవో స్కాలర్‌షిప్‌

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీవో).. మహిళల కోసం స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను ప్రకటించింది. దీన్ని ఏరోనాటిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ బోర్డ్‌ ద్వారా అందిస్తుంది. ప్రతిభావంతులైన మహిళా విద్యార్థులు అంతరిక్షం, వైమానిక రంగాల్లో చేరేలా ప్రోత్సహించే ఉద్దేశంతో డీఆర్‌డీవో ఈ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.
  • మొత్తం స్కాలర్‌షిప్పుల సంఖ్య: 30 (అండర్‌ గ్రాడ్యుయేట్‌–20, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌–10)
  • విభాగాలు: ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్, స్పేస్‌ ఇంజనీరింగ్, రాకెటరీ, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజనీరింగ్‌.
స్కాలర్‌షిప్‌ మొత్తం..
  • అండర్‌గ్రాడ్యుయెట్‌ లెవెల్లో నాలుగేళ్లపాటు సంవత్సరానికి రూ.1.20,000 స్కాలర్‌షిప్‌ లభిస్తుంది.
  • పోస్ట్‌గ్రాడ్యుయెట్‌ లెవెల్లో రెండేళ్లపాటు నెలకు రూ.15,500 చొప్పున అందుతుంది.
అర్హతలు..
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌(బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌) లెవెల్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 2020–21 విద్యాసంవత్సరంలో సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్‌/బీఎస్సీ ఇంజనీరింగ్‌ కోర్సు మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందాలి. దాంతోపాటు జేఈఈ మెయిన్‌లో అర్హత పొందాలి.
  • పోస్టు గ్రాడ్యుయేట్‌(ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ ఇంజనీరింగ్‌) లెవెల్‌ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకునేందుకు 2020–21 విద్యాసంవత్సరంలో సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంఈ/ఎంటెక్‌/ఎంఎస్సీ ఇంజనీరింగ్‌లో ప్రవేశం పొందాలి. దాంతోపాటు గేట్‌లో అర్హత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ.,.
  • అండర్‌గ్రాడ్యుయెట్‌ లెవెల్‌ స్కాలర్‌షిప్‌కు జేఈఈ మెయిన్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. అలాగే పోస్ట్‌గ్రాడ్యుయెట్‌ లెవెల్‌ స్కాలర్‌షిప్‌కు గేట్‌లో ర్యాంకు ఆధారంగా ఎంపిక నిర్వహిస్తారు.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేది: 30.09.2020
  • పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.drdo.gov.in
Published date : 03 Aug 2020 02:21PM

Photo Stories