ఎఫ్‌ఎంజీఈ(డిసెంబర్)-2019ప్రిపరేషన్ ఇలా...
Sakshi Education
విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించే వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. పరిమిత సీట్ల కారణంగా ఇక్కడ ఎంబీబీఎస్‌లో ప్రవేశం పొందలేని విద్యార్థులు.. విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించి స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇక్కడకు వచ్చాకమెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ)లో పేరు నమోదు చేసుకోవాలన్నా..
ఉన్నత విద్య, ఉద్యోగంలో చేరాలన్నా... భారత ప్రభుత్వం నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్(ఎఫ్‌ఎంజీఈ) స్క్రీనింగ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్‌బీఏ)ఏటా రెండుసార్లు(జూన్/డిసెంబర్‌లో) ఎఫ్‌ఎంజీఈ పరీక్షను నిర్వహిస్తుంది. డిసెంబర్ 2019 ఎఫ్‌ఎంజీఈకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, సిలబస్‌కు సంబంధించి సమగ్ర సమాచారం...
ఆన్‌లైన్ పరీక్ష :
ఎఫ్‌ఎంజీఈ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఆన్‌లైన్‌లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ (ఎన్‌బీఏ) నిర్వహిస్తుంది.
ఎందుకు ఎఫ్‌ఎంజీఈ ?
వైద్యవిద్యను అభ్యసించాలని చాలామంది కలలు కంటారు. కానీ దేశంలో, రాష్టంలో వైద్య కాలేజీల్లో ఉన్న పరిమిత సీట్లు, అధిక ఫీజుల కారణంగా.. అందరికీ తమ కలను సాకారం చేసుకునే అవకాశం లభించడంలేదు. దాంతో రష్యా, ఉక్రెయిన్, కిర్గిస్తాన్, బెలారస్, జార్జియా, కజకిస్తాన్, చైనా, ఫిలిప్పీన్, మారిషస్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో వైద్యవిద్యను అభ్యసించేందుకు వెళ్తున్నారు. మన దేశం నుంచి ప్రతీ ఏటా వేలమంది విద్యార్థులు ఆయా దేశాల్లోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశం పొందుతున్నారు. విదేశాల్లో వైద్యవిద్య పట్టాను పొందిన విద్యార్థులు.. భారత్‌లో ప్రాక్టీస్ చేయాలన్నా, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎంసీఐ)లో పేరు నమోదు చేసుకోవాలన్నా, వైద్య విద్యకు సంబంధించి ఉన్నతవిద్య, ఉద్యోగంలో చేరాలన్నా.. భారత ప్రభుత్వం నిర్వహించే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామినేషన్ (ఎఫ్‌ఎంజీఈ) స్క్రీనింగ్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. అర్హతలు:
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2019 అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 31
తప్పుల సవరణ: 2019 నవంబర్ 2 నుంచి నవంబర్ 7 తేదీ వరకు
అడ్మిట్ కార్డ్: 2019 డిసెంబర్ 13వ తేదీ నుంచి
పరీక్ష తేదీ: పార్ట్ -ఎ, బీ: 2019 డిసెంబర్ 20
ఫలితాలు: 2020 జనవరి 20
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.nbe.edu.in

- ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు దరఖాస్తు చే సుకునే అభ్యర్థులు భారతీయ పౌరుడై ఉండాలి లేదా ఓవర్సీ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) అయి ఉండాలి.
- 2019 నవంబర్ 30లోపు విదేశాల్లో ఎంబీబీఎస్ లేదా తత్సమాన ప్రైమరీ మెడికల్ కోర్సు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఎఫ్‌ఎంజీఈ స్క్రీనింగ్ టెస్టుకు నమోదు చేసుకోవచ్చు.
- విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన వైద్య విద్యా సంస్థ సహా పూర్తి వివరాలు సమర్పించాలి.
- కెనడా, ఆస్ట్రేలియా,యునెటైడ్ కింగ్‌డమ్, న్యూజిలాండ్, అమెరికాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ డిగ్రీ పట్టా పొందిన అభ్యర్థులు.. ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోనవసరం లేదు. వారు నేరుగా ఎంసీఐ/ఎస్‌ఎంసీలో నమోదు వెసులుబాటు ఉంది.
- దరఖాస్తు ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలోనే పూర్తి చేయాలి
- ఎఫ్‌ఎంజీఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు ఎన్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- అన్ని కేటగిరి అభ్యర్థులు (ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ,జనరల్, మహిళలు, దివ్యాంగులు) రూ.5500 ఫీజుగా చెల్లించాలి.
- ఆన్‌లైన్,నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు.
- కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్ష 300 మార్కులకు జరుగుతుంది. ప్రశ్న పత్రాన్ని రెండు భాగాలుగా(సెక్షన్‌లు) విభజించారు. ప్రతి విభాగంలో 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండున్నర గంటల సమయం కేటాయిస్తారు. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు ఉండవు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
- ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఎంసీఐ లేదా ఇతర స్టేట్ మెడికల్ కౌన్సిల్స్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అర్హత లభిస్తుంది.
- మొత్తం 300 మార్కులకు కనీసం 150 మార్కులను సాధించిన వారిని ఉత్తీర్ణులుగా ప్రకటిస్తారు.
- పరీక్ష పేపర్‌లో రెండు సెక్షన్‌లు (పార్ట్ ఏ, బీ) ఉంటాయి. మొదటి సెక్షన్‌లో అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రో బయాలజీ, ఫార్మకలోగ్, ఫోరెన్సిక్, మెడిసన్.. మొత్తం వంద మార్కులకు ఉంటుంది.
- రెండో సెక్షన్‌లో క్లినికల్ సబ్జెక్ట్‌లు 200 మార్కులకు ఉంటాయి. మెడిసిన్ అలైడ్ సబ్జెక్ట్స్‌కు సంబంధించి మెడిసిన్-33, సైకియాట్రీ-5, డెర్మటాలజీ-5, రెడియోథెరపి-5 మార్కులకు ప్రశ్నలు ఎదురవుతాయి. అలాగే జనరల్ సర్జరీ అలైడ్ సబ్జెక్ట్స్‌కు సంబంధించి జనరల్ సర్జరీ-32, అనస్తీషియాలజీ-5, ఆర్థోపెడిక్స్-5, రేడియోడయాగ్నోసిస్-5,పెడియాట్రిక్-15, ఆప్తమాలజీ-15, ఆటోర్హల్మోలజీ-15, ఒబిస్టేట్రిక్స్ అండ్ గైనకాలజీ-30, కమ్యూనిటీ మెడిసిన్-30 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
- సుదీర్ఘకాలం నుంచి ప్రిపరేషన్ సాగిస్తున్న విద్యార్థులకు ఒత్తిడి అనేది సహజంగానే ఉంటుంది. అయితే ఒత్తిడికి లోనుకాకుండా ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రణాళిక వేసుకొని మధ్యలో విశ్రాంతికి, తగినంత నిద్రకు సమయాన్ని కేటాయించుకుంటూ చదివితే పరీక్షలో విజయం సాధించవచ్చు.
- రెండు సెక్షన్‌లకు కలిపి 19 సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. దీంట్లో అనాటమీ, ఫిజియాలజీ, బయో కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రో బయాలజీ సబ్జెక్టుల బేసిక్స్ మీద పట్టు సాధిస్తే.. మిగతా సబ్జెక్టుల ప్రిపరేషన్ సులువు అవుతుంది. అలాగే ఇంటర్నల్ మెడిసిన్, సర్జరీ, గైనకాలజీ తదితర సబ్జెక్టులు స్కోరింగ్‌కు ప్రధానం. ఒక్కో సబ్జెక్టు నుంచి 30 వరకు ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కులు ఉండవు. కాబట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
- రెండు సెక్షన్‌లు ఉండే ఈ పరీక్షలో.. మొదటి సెక్షన్ నాన్ క్లినికల్ సబ్జెక్టుల నుంచి, రెండో సెక్షన్‌లో క్లినికల్ సబ్జెక్టుల మేళవింపుగా ప్రశ్నలు వస్తాయి.
ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 2019 అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 31
తప్పుల సవరణ: 2019 నవంబర్ 2 నుంచి నవంబర్ 7 తేదీ వరకు
అడ్మిట్ కార్డ్: 2019 డిసెంబర్ 13వ తేదీ నుంచి
పరీక్ష తేదీ: పార్ట్ -ఎ, బీ: 2019 డిసెంబర్ 20
ఫలితాలు: 2020 జనవరి 20
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.nbe.edu.in
Published date : 24 Oct 2019 02:17PM