ఎంబీఏ.. స్పెషలైజేషన్స్!
Sakshi Education
మేనేజ్‌మెంట్ కోర్సులకు పెట్టిందిపేరు... ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లు (ఐఐఎంలు)! దేశంలోనేకాదు.. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న బీస్కూల్స్...ఐఐఎంలు! మేనేజ్‌మెంట్ కోర్సుల పట్ల ఆసక్తి ఉన్న విద్యార్థులకు పరిచయం అక్కర్లేని విద్యాసంస్థలు ఇవి!! ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష... క్యాట్(కామన్ అడ్మిషన్ టెస్ట్). ఇటీవల
క్యాట్ పరీక్ష ముగిసింది. దాంతో అభ్యర్థులు తదుపరి ఎంపిక ప్రక్రియకు సన్నద్ధమవుతూనే.. ఎంబీఏ కోర్సు, స్పెషలైజేషన్స్, కెరీర్ స్కోప్ గురించి సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఎంబీఏలో విభిన్న స్పెషలైజేషన్స్ గురించి తెలుసుకుందాం...
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లు ప్రత్యేక విద్యాసంస్థలు. మేనేజ్‌మెంట్ రంగంలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు గమనిస్తూ పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా సిలబస్, కరిక్యులంలో మార్పులుచేర్పులు చేస్తుంటాయి. కంపెనీల అవసరాల మేరకు కొత్త కోర్సులను ప్రవేశపెడుతూ.. అటు కంపెనీలతోపాటు ఇటు విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. ఐఐఎంల్లో మేనేజ్‌మెంట్ కోర్సులు చదివే విద్యార్థులను నియమించుకునేందుకు బహుళజాతి కంపెనీలు ఏటా ప్లేస్‌మెంట్స్‌లో క్యూ కడుతుంటాయి.
ఐఐఎంలు అందించే కోర్సులు..
ఐఐఎంలు పీజీ స్థాయిలో పలు మేనేజ్‌మెంట్ కోర్సులు అందిస్తున్నాయి. అవి.. పీజీపీ, పీజీపీ-ఎఫ్‌ఏబీఎం, పీజీ పీఈఎం, పీజీ పీపీఎం, పీజీ హెచ్‌ఆర్‌ఎం, ఈపీజీపీ, పీజీపీ-ఏబీఎం, పీజీపీ-ఎస్‌ఎం, ఈపీజీపీఎక్స్, పీజీపీఈఎక్స్, పీజీపీబీఎం. వీటితోపాటు పీహెచ్‌డీకి సమానంగా పరిగణించే ఫెలో ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (ఎఫ్‌పీఎం)లోకి కూడా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
బెస్ట్ స్పెషలైజేషన్స్..
ఐఐఎంలు అందించే మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ప్రత్యేకంగా స్పెషలైజేషన్స్ అని కాకుండా.. ఎలక్టివ్స్ అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు రెండో సంవత్సరంలో తమ ఇష్టం మేరకు వివిధ సబ్జెక్టులను ఎలక్టివ్స్‌గా ఎంచుకోవచ్చు. ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్.. ఇలా విభిన్న సబ్జెక్టులను ఎంచుకొని చదువుకోవచ్చు. వీటినే మనం స్పెషలైజేషన్స్‌గా పేర్కొంటున్నాం. ఈ స్పెషలైజేషన్లలోఒక్కోదానిది ప్రత్యేక స్థానం. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నైపుణ్యాలుంటే... అన్ని స్పెషలైజేషన్స్‌కు అవకాశాలు లభిస్తున్నాయి. అభ్యర్థుల కెరీర్ పరంగా రెండో సంవత్సరంలో ఎంచుకునే స్పెషలైజేషన్ ప్రధానపాత్ర పోషిస్తుంది. ప్లేస్‌మెంట్స్ పరంగా చూసినప్పుడు మార్కెటింగ్, ఫైనాన్స్, ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటివి ముందువరుసలో నిలుస్తున్నాయి.
మార్కెటింగ్ :
వ్యాపారంలో మార్కెటింగ్ అత్యంత ప్రాధాన్యత కలిగిన విభాగం. సంస్థను ప్రారంభించింది మొదలు ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం, అడ్వర్టైజింగ్, సేల్స్ ప్రమోషన్స్ మేనేజ్‌మెంట్, కస్టమర్ బేస్డ్ బిజినెస్ స్ట్రాటజీస్, మీడియా, బ్రాండ్ కమ్యూనికేషన్ వ్యూహాలు, స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్, డిజిటల్ బిజినెస్, కొత్త ఉత్పత్తులను తయారుచేయడం.. ఇలా అన్ని విభాగాల్లోనూ సంస్థ ఎదుగుదలలో మార్కెటింగ్ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, మార్కెట్ పరిస్థితులను అవగాహన చేసుకునే సామర్థ్యం, కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఉత్పత్తులను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేసే నైపుణ్యం, బృందంగా పనిచేసే నేర్పు ఉన్న వారికి ఈ స్పెషలైజేషన్ సరిపోతుంది. మార్కెటింగ్ స్పెషలైజేషన్‌లో.. ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, ప్రమోషన్ అండ్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, కన్జ్యూమర్ బిహేవియర్, సర్వీసెస్ అండ్ రిటైల్ మార్కెటింగ్, అడ్వర్‌టైజింగ్ తదితర అంశాలు ఉంటాయి. పెరుగుతున్న పోటీ కారణంగా ఎంబీఏ-మార్కెటింగ్ అభ్యర్థులకు డిమాండ్ ఎప్పుడూ అధికంగానే ఉంటోంది. వీరికి వివిధ సంస్థల్లో మార్కెటింగ్ మేనేజర్, మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్, బ్రాండ్ మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్ వంటి హోదాల్లో అవకాశాలు ఉంటాయి. తర్వాత చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ స్థాయికి కూడా చేరుకోవచ్చు. మార్కెటింగ్‌లో ఎంబీఏ పూర్తిచేసిన వారు ఎంతోమంది ప్రస్తుతం టాప్ ఎంఎన్‌సీల్లో ఉన్నత స్థానాల్లో ఉండటం తెలిసిందే!
హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ :
ఒక సంస్థ/కంపెనీలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవడం.. వారి పనితీరును అంచనా వేయడం.. అవసరమైన అంశాల్లో శిక్షణనివ్వడం..మెర్జర్స్-ఎక్విజిషన్స్..సంస్థ పనితీరు మెరుగుపరచడం కోసం వ్యూహాలు రూపొందించడం.. వంటి కీలకమైన విధులను హెచ్‌ఆర్ మేనేజర్లు నిర్వహిస్తుంటారు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌లో.. స్టాఫింగ్, రిక్రూటింగ్, ఇండస్టియ్రల్ డిస్ప్యూట్స్, పర్సనల్ మేనేజ్‌మెంట్, పెర్ఫామెన్స్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్ అండ్ లీడర్‌షిప్ డెవలప్‌మెంట్, లేబర్ లాస్, ఎథిక్స్, మోరల్స్ తదితర అంశాలను బోధిస్తారు. సందర్భానుసారంగా వ్యవహరించే నేర్పు, ఒత్తిడి తక్కువగా ఉండే ఉద్యోగం కోరుకునే వారు, బృందంగా పనిచేసే సామర్థ్యం ఉన్న అభ్యర్థులకు సరిపడే స్పెషలైజేషన్ ఇది. ఏ సంస్థకైనా హెచ్‌ఆర్ విభాగం తప్పనిసరి. కాబట్టి వీరికి అవకాశాలు పుష్కలం అని చెప్పొచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్ సంస్థలు, ఎంఎన్‌సీల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి.
ఫైనాన్స్ :
సంస్థకు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మెలకువలను బోధించేదే.. ఫైనాన్స్ స్పెషలైజేషన్. ఇందులో కార్పొరేట్ ఫైనాన్స్, కాస్టింగ్, బడ్జెటింగ్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్, వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్, సెక్యూరిటీలు తదితర అంశాలను బోధిస్తారు. అనలిటికల్ స్కిల్స్, అకౌంటింగ్, ఆడిటింగ్ అంశాలపై పట్టు, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, కంపెనీ-ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టాలు-వాటిలో వస్తున్న మార్పులపై అవగాహన ఉంటే ఈ రంగంలో రాణించవచ్చు. వీరికి ఫైనాన్షియల్ కంపెనీలు, బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్లు, మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు, ఫారెన్ మనీ ట్రేడింగ్ సంస్థలు ఉద్యోగ వేదికలుగా నిలుస్తున్నాయి. ఫైనాన్స్‌లో కెరీర్ ప్రారంభించే అభ్యర్థులు తమ పనితీరుతో, అనుభవంతో సంస్థకు సీఎఫ్‌వో స్థాయికి చేరుకోవచ్చు.
ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్ :
ట్రేడింగ్, సర్వీసెస్, మాన్యుఫ్యాక్చరింగ్.. ఇలా ఏ సంస్థ అయినా.. ప్రారంభ దశ నుంచి అడుగడుగునా ఉపయోగపడే విభాగం ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్. ఈ స్పెషలైజేషన్‌లో ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్, వెండార్ డెవలప్‌మెంట్, ప్రొడక్షన్, పర్చేజ్ ఫంక్షన్స్ తదితర అంశాలుంటాయి. ఇందులో ప్రొడక్షన్/మాన్యుఫాక్చరింగ్ ఆపరేషన్స్, సర్వీసెస్ ఆపరేషన్స్ అనే రెండు రకాల ఉప విభాగాలు ఉంటాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉంటే ఈ స్పెషలైజేషన్‌ను ఎంచుకోవచ్చు. వీరికి రిటైల్, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, ఐటీ తదితర సంస్థల్లో మెటీరియల్-సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్, లాజిస్టిక్స్, ఇన్వెంటరీ కంట్రోల్, ప్రొడక్షన్ ప్లానింగ్, వేర్‌హౌస్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. ప్రారంభంలో ప్రొడక్ట్ మేనేజర్, టెక్నికల్ సూపర్‌వైజర్ వంటి హోదాల్లో పని చేయాల్సి ఉంటుంది. తర్వాత చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, జీఎం స్థాయికి కూడా చేరుకోవచ్చు.
ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ :
ఐటీ నేపథ్యం(సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా ఐటీ గ్రాడ్యుయేట్) కలిగిన, కంప్యూటర్ సైన్స్, ఎలక్టాన్రిక్స్ వంటి కంప్యూటర్ సంబంధ విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ ఉన్న విద్యార్థులకు సరిపోయే స్పెషలైజేషన్ ఇది. ఒక సంస్థ అవసరాలకు సరిపడే వివిధ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ ప్లాట్‌ఫాంలను గుర్తించి.. వాటిని అమలుచేసే మెలకువలను ఇందులో బోధిస్తారు. మేనేజ్‌మెంట్ ప్రాథమికాంశాలు, మేనేజీరియల్ ఎకనామిక్స్, ఎక్స్‌ఎల్, పవర్‌పాయింట్ వంటి సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలు, ఇంటర్నెట్ ఆపరేషన్స్, ఎలక్ట్రానిక్ కామర్స్-ఎలక్ట్రానిక్ బిజినెస్ డేటా మైనింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలు ఈ స్పెషలైజేషనలో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ స్పెషలైజేషన్ పూర్తిచేసిన వారికి ఐటీ, సంబంధిత కంపెనీల్లో బిజినెస్ అనలిస్ట్, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, టెక్నికల్ సిస్టమ్స్ మేనేజర్, టెక్నికల్ అనలిస్ట్, టెక్నికల్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ మేనేజర్, క్వాలిటీ మేనేజర్, ఈఆర్‌పీ కన్సల్టెంట్లుగా అవకాశాలు లభిస్తాయి. తర్వాత చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ స్థాయికి చేరొచ్చు.
ఇంటర్నేషనల్ బిజినెస్ :
గ్లోబలైజేషన్ కారణంగా ఇంటర్నేషనల్ బిజినెస్‌పై నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు మార్కెట్‌లో మంచి డిమాండ్ కనిపిస్తోంది. కొన్ని ఐఐఎంల్లో ఇంటర్నేషనల్ బిజినెస్ సబ్జెక్టులు ఎలక్టివ్స్‌గా ఎంచుకొని చదువుకునే అవకాశముంది. అంతర్జాతీయంగా కార్పొరేట్ సంస్కృతికి అనుగుణంగా భిన్నమైన పని వాతావరణంలో పనిచేసే సంసిద్ధత, నిరంతరం అధ్యయనం చేసే ఓర్పు, ఎగుమతులు-దిగుమతులకు సంబంధించిన విధానాలను పరిశీలించడం వంటి లక్షణాలున్న విద్యార్థులు ఇంటర్నేషనల్ బిజినెస్ సబ్జెక్టులు చదవడం లాభిస్తుంది. కోర్సు పూర్తిచేసిన వారు ఎక్స్‌పోర్ట్ హౌసెస్, విదేశీ వాణిజ్య విభాగాలు తదితరాల్లో ఉన్నత హోదాల్లో స్థిరపడొచ్చు.
హాస్పిటల్/హెల్త్ కేర్ మేనేజ్‌మెంట్ :
హెల్త్‌కేర్ ఎకనామిక్స్, ఐటీ ఫర్ హెల్త్‌కేర్, హెల్త్‌కేర్ టెక్నాలజీ అండ్ ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలు ఈ స్పెషలైజేషన్‌లో ఉంటాయి. హాస్పిటల్ నిర్వహణ, సంబంధిత సిబ్బంది నియామకం, పరిపాలన సంబంధ విధులు, వివిధ విభాగాల మధ్య సమన్వయం, ఆరోగ్య సేవల మూల్యాంకనం తదితర విధులను వీరు నిర్వహిస్తుంటారు. కార్పొరేట్ హాస్పిటల్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, బీపీఓలో.. మేనేజర్ హోదాలో అవకాశాలు ఉంటాయి.
మరికొన్ని స్పెషలైజేషన్లు..
ఫుడ్ అండ్ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్, పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్స్, ఆర్గనైజేషనల్‌బిహేవియర్, ఫైనాన్స్ అండ్ కంట్రోల్, ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ అండ్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, మీడియా మేనేజ్‌మెంట్. రూరల్ మేనేజ్‌మెంట్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఫార్మాస్యుటికల్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్.. తదితర స్పెషలైజేషన్లను బిజినెస్ స్కూల్స్ అందిస్తున్నాయి!!

Published date : 19 Dec 2018 02:40PM