ఏఐసీటీఈ@ కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు...
Sakshi Education
దేశవ్యాప్తంగా మూడున్నర వేల ఇంజనీరింగ్ కాలేజీలు.. సుమారు 15 లక్షలకు పైగా సీట్లు.. రకరకాల ఫీజులు.. లక్షల్లో ఫీజులు.. ఇదే.. ఇప్పుడు..
దేశంలో ఇంజనీరింగ్ విద్యలో ప్రవేశాల నుంచి కోర్సు పూర్తి చేసుకునే వరకు.. అడుగడుగునా గందరగోళానికి దారితీస్తోంది. ఓవైపు సమాజంలో ఇంజనీరింగ్‌కు క్రేజ్.. మరోవైపు కాలేజీల్లో లోపిస్తున్న ప్రమాణాలు, పారదర్శకత, జవాబుదారీతనం! ఈ నేపథ్యంలో...ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ తాజాగా ఏఐసీటీ ఈ’ (గ్రాంట్ ఆఫ్ అప్రూవల్స్ ఫర్ ద టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్) (ఫస్ట్ ఎమెండ్‌మెంట్) రెగ్యులేషన్స్, 2017 పేరిట కొత్త నిబంధనలు, మార్గదర్శకాలు విడుదల చేసింది.
వెబ్‌సైట్‌లో ఫీజుల వివరాలు తప్పనిసరి :
ప్రతి ఇంజనీరింగ్ కాలేజీ తన వెబ్‌సైట్‌లో ఆయా కోర్సుల ఫీజుల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలని ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాల్లో స్పష్టంచేసింది. వెబ్‌సైట్‌లో ముందుగానే వెల్లడించిన నిర్దేశిత ఫీజులనే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని పేర్కొంది. ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాల ప్రకారం- అదనపు వ్యయాల పేరుతో వేరే రూపంలో కాలేజీలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి వీలులేదు. ఒకవేళ ఏదైనా ఇన్‌స్టిట్యూట్ ఇలా వేరే రూపంలో అదనపు ఫీజులు వసూలు చేస్తే.. సదరు ఇన్‌స్టిట్యూట్ గుర్తింపును రద్దు చేసే ఆస్కారముంటుంది. వసూలు చేసిన ఫీజుకు రెట్టింపు మొత్తంలో జరిమానా చెల్లించాలి. అంతేకాకుండా అదనంగా వసూలు చేసిన మొత్తాలను విద్యార్థులకు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
కనీస ఫీజులపై కసరత్తు :
ప్రభుత్వం ఫీజుల నిర్ధారణకు సంబంధించి జస్టిస్.బి.ఎన్.కృష్ణ నేతృత్వంలో రెండేళ్ల క్రితం ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ గరిష్ట ఫీజు మొత్తాలనే పేర్కొంది. కానీ.. వీటిపై ప్రతికూల అభిప్రాయాలు వ్యక్తమవడంతో కనీస ఫీజులను కూడా నిర్ధారించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇన్‌స్టిట్యూట్‌ల స్థాయి ఆధారంగా కనీస ఫీజులు, గరిష్ట ఫీజుల విధానం అమలు చేసే దిశగా అడుగులు వేయనుంది. దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌ల యాజమాన్యాలు సెమిస్టర్‌కు కనీసం రూ.30వేలు ఫీజుగా నిర్ణయించాలని కోరినట్లు సమాచారం. అంతకంటే ఎక్కువ ఫీజులు నిర్ణయించి.. వాటి ని కచ్చితంగా అమలు చేయాలనే నిబంధన కార్యరూపం దాల్చితే తమ ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాల సంఖ్య తగ్గిపోతుందనే అభిప్రాయాన్ని సదరు యాజమాన్యాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఆ పేర్లు వాడొద్దు...
ఇన్‌స్టిట్యూట్స్ పేర్ల పరంగా విద్యార్థుల్లో తలెత్తున్న గందరగోళానికి స్వస్తి పలకాలని ఏఐసీటీఈ భావిస్తోంది. అందుకోసం ఇన్‌స్టిట్యూట్‌ల పేర్లలో ఎక్కడ కూడా ఎన్‌ఐటీ, ఐఐటీ, ఇండియా, ఆల్ ఇండియా, గవర్నమెంట్ వంటి పదాలు రాయొద్దని స్పష్టం చేసింది. ఇలాంటి పదాలను వినియోగించడం వల్ల అవి ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్‌లు, లేదా ప్రభుత్వ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌లుగా విద్యార్థులు పొర పడేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొంది.
గందరగోళానికి స్వస్తి :
ప్రవేశాల సమయంలో విద్యార్థులకు ఎదురవుతున్న ప్రధాన సమస్య.. కళాశాల ఎంపిక. విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌కు సరిపోలి ఉండే పేర్లతో కొత్త ఇన్‌స్టిట్యూట్‌లకు అనుమతులు పొందుతున్నారు. దీంతో విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో గందరగోళానికి గురవుతున్నారు. ఉదాహరణకు.. ఒక యాజమాన్యం పరిధిలోని ఏబీసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనే సంస్థకు టాప్-10లో స్థానం లభించిందనుకుంటే.. దీన్ని ఆసరాగా తీసుకున్న యాజమాన్యం.. ఏబీసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఏబీసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏబీసీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. ఇలా సదరు తమ పరిధిలోని టాప్‌రేట్ ఇన్‌స్టిట్యూట్‌కు సరిపోలి ఉండే పేర్లతో మరికొన్ని కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాయి. ఇలా ఏర్పాటైన ఇన్‌స్టిట్యూట్‌లలో సదుపాయాలు, ప్రమాణాలు శూన్యం. దీన్ని పరిగణనలోకి తీసుకున్న ఏఐసీటీఈ.. ఇక నుంచి పేర్ల మధ్య పోలిక ఉండే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించింది.
విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లకు...
ఏఐసీటీఈ కొత్త నిబంధనలు కేవలం స్వదేశీ ఇన్‌స్టిట్యూట్‌లకే కాకుండా.. దేశంలో అకడమిక్ సెంటర్లను ఏర్పాటు చేసిన విదేశీ విద్యా సంస్థలు, లేదా దేశంలోని విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకున్న విదేశీ సంస్థలకు కూడా వర్తించనున్నాయి. ఈ మేరకు.. పైన పేర్కొన్న నిబంధనలను విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లు పాటించకపోతే.. సదరు ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా మన దేశానికి వచ్చే వారికి వీసాలు జారీ చేయవద్దని, నిధులు ఆపివేయాలని హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖ, ఆర్‌బీఐలకు ఏఐసీటీఈ లేఖ రాయనుంది.
ఎన్‌ఆర్‌ఐ నిబంధనలు...
ఎన్‌ఆర్‌ఐ అడ్మిషన్స్ విషయంలోనూ అవకతవకలు జరుగుతున్నాయనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న ఏఐసీటీఈ.. ఇకపై ఏదైనా ఇన్‌స్టిట్యూట్ ఎన్‌ఆర్‌ఐ కోటా, సూపర్‌న్యూమరరీ కోటాలో సీట్లు భరీ చేస్తే.. వాటికి ముందస్తు అనుమతులు, సరైన ఆధారాలు లేకపోతే వాటిని రద్దు చేయనున్నట్లు తెలిపింది.
విద్యార్థులు.. నిబద్ధత
విద్యార్థులు సైతం నిబద్ధతతో వ్యవహరించేలా ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. బీటెక్ విద్యార్థులు కాపీ పేస్ట్ విధానంలో ప్రాజెక్ట్ రిపోర్ట్‌లు రూపొందించినట్లు తేలితే.. సదరు విద్యార్థుల అడ్మిషన్‌ను రద్దు చేసే అవకాశముంది. ఇదే విధానాన్ని పీజీ స్థాయిలోనూ అమలు చేయనుంది. ఇప్పటికే పీహెచ్‌డీ విషయంలో ఇలా కాపీ-పేస్ట్ థీసిస్‌పై నిర్దిష్ట విధానాలను ఏఐసీటీఈ రూపొందించిన సంగతి తెలిసిందే. తాజాగా గ్రాడ్యుయేషన్ స్థాయి నుంచే ఈ తరహా విధానాన్ని అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏఐసీటీఈ తాజా మార్గ దర్శకాలు.. ఏఐసీటీఈ తాజా మార్గ దర్శకాలు..
ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాలు... ఇటు విద్యార్థులు, ఇటు యాజమాన్యాలు.. ఇరు వర్గాల్లోనూ జవాబుదారీతనం పెంచేందుకు దోహదం చేస్తాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు నాణ్యమైన, నైపుణ్యమైన విద్యను అభ్యసించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఫలితంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఇండస్ట్రీ రెడీ స్కిల్ గ్యాప్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పేర్లలో పోలిక విధానంపై నిషేధం విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. దీని ఫలితంగా విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో ఆప్షన్లు ఇచ్చుకునే క్రమంలో గందరగోళ పరిస్థితికి ఫుల్‌స్టాప్ పడుతుంది.
- ప్రొఫెసర్.ఎస్.రామచంద్రం, వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ

- ప్రతి కళాశాల ఆన్‌లైన్‌లో ఫీజుల వివరాలు పొందుపర్చడం తప్పనిసరి.
- అదనపు ఫీజులు వసూలు చేస్తే కాలేజీలపై జరిమానా.
- ఈ అదనపు ఫీజులు తిరిగి విద్యార్థులకు చెల్లించాల్సి ఉంటుంది.
- పేర్లలో ఐఐటీల, నిట్‌లు, పోలిక ఉండే పేర్లు, వినియోగించకూడదు.
- ఇన్‌స్టిట్యూట్ పేరులో ఎన్‌ఐటీ, ఐఐటీ, ఇండియా, గవర్నమెంట్ వంటి పదాలు వాడరాదు.
- విదేశీ ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా నిబంధనల వర్తింపు.
- కనీస ఫీజులపైనా కసరత్తు
- ప్రవేశాలు 30 శాతంలోపే ఉంటే సదరు కళాశాల మూసివేత
ఏఐసీటీఈ తాజా మార్గదర్శకాలు... ఇటు విద్యార్థులు, ఇటు యాజమాన్యాలు.. ఇరు వర్గాల్లోనూ జవాబుదారీతనం పెంచేందుకు దోహదం చేస్తాయి. ఇంజనీరింగ్ విద్యార్థులు నాణ్యమైన, నైపుణ్యమైన విద్యను అభ్యసించేందుకు మార్గం ఏర్పడుతుంది. ఫలితంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ఇండస్ట్రీ రెడీ స్కిల్ గ్యాప్ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. పేర్లలో పోలిక విధానంపై నిషేధం విద్యార్థులకు ఎంతో లబ్ధి చేకూరుస్తుంది. దీని ఫలితంగా విద్యార్థులు కౌన్సెలింగ్ సమయంలో ఆప్షన్లు ఇచ్చుకునే క్రమంలో గందరగోళ పరిస్థితికి ఫుల్‌స్టాప్ పడుతుంది.
- ప్రొఫెసర్.ఎస్.రామచంద్రం, వీసీ, ఉస్మానియా యూనివర్సిటీ
Published date : 15 Dec 2017 05:59PM