డిగ్రీ, పీజీ ప్రవేశాలకు ఇగ్నో-2021 ఫిబ్రవరి నోటిఫికేషన్ విడుదల.. విభిన్న కోర్సుల గురించి తెలుసుకోండిలా..
Sakshi Education
దూరవిద్య విధానంలో కోర్సులు అందిస్తున్న ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనవర్సిటీ(ఇగ్నో).. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏటా జనవరి, జూలై నెలల్లో రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ చేపడుతుంది. తొలివిడత అడ్మిషన్ సెషన్‌లో భాగంగా ప్రారంభమైన ‘ఇగ్నో అడ్మిషన్ 2021’ ప్రక్రియ.. ఫిబ్రవరి 28వ తేదీతో ముగియనుంది. జూలై సెషన్ ప్రక్రియ ఏప్రిల్ నాలుగో వారంలో మొదలవుతుంది. ఈ నేపథ్యంలో.. ఇగ్నో అందిస్తున్న కోర్సులు, ప్రవేశ ప్రక్రియ, ఎక్కువ మంది ఎంచుకుంటున్న కోర్సులపై ప్రత్యేక కథనం..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా మొత్తం 67 రీజనల్ సెంటర్లు, 2667 స్టడీ సెంటర్లు ఉన్నాయి. ఈ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, సర్టిఫికెట్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ స్థాయిలో మొత్తం 277 కోర్సులను దూరవిద్య విధానంలో అందిస్తోంది. వీటిలో బీఈడీ, బీఎస్సీ నర్సింగ్, ఎంబీఏ వంటి కోర్సులకు ఎంట్రన్స్ విధానంలో ప్రవేశాలు కల్పిస్తే.. మిగిలిన అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, డిప్లొమా వంటి ఇతర కోర్సులకు విద్యార్హతల ఆధారంగా అడ్మిషన్లు చేపడతారు. ఈ ఓపెన్ యూనివర్సిటీ అందించే కోర్సులకు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది.
విభిన్న కోర్సులు..
ఇగ్నో పరిధిలోని స్కూల్ ఆఫ్ సెన్సైస్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సై, స్కూల్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, స్కూల్ ఆఫ్ ఫారిన్ లాంగ్వేజెస్, స్కూల్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సర్వీస్ మేనేజ్‌మెంట్, స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్, స్కూల్ ఆఫ్ సోషల్ సెన్సైస్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ వంటి దాదాపు 21 విభాగాల నుంచి వందల సంఖ్యలో పీజీ, పీజీ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు.
ఇగ్నో అందిస్తున్న మాస్టర్స్ కోర్సుల్లో చేరేందుకు ఎలాంటి వయో పరిమితి లేదు, రెండేళ్ల కాలపరిమితి గల పీజీ కోర్సుల్లో చేరినవారు గరిష్టంగా ఐదేళ్లల్లో కోర్సును పూర్తి చేయాలి.
ఇంకా చదవండి: part 2: అతి తక్కువ ఫీజుతో డిగ్రీ, పీజీ చదివే అవకాశం.. ఇగ్నో 2021 నోటిఫికేషన్ విడుదల..

Published date : 20 Feb 2021 05:02PM