Skip to main content

ఐఎమ్‌యూ క్యాంపస్‌ల‌లో...ఎంబీఏ,డీఎన్‌ఎస్ కోర్సుల ప్రవేశ ప్రక్రియ ఇలా..

హరప్పా కాలం నుంచే భారత్‌కు సముద్ర వాణిజ్యంతో సంబంధంఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం సముద్ర వ్యాపారానికి సంబంధించి మన దేశం 20వ స్థానంలో ఉంది. దేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు చట్టం ద్వారా ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ (ఐఎమ్‌యూ)ని ఏర్పాటుచేశారు. తాజాగా ఐఎమ్‌యూ క్యాంపస్‌ల్ల్లో ఎంబీఏ, అనుబంధ ఇన్‌స్టిట్యూట్స్‌లో డీఎన్‌ఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో.. ఐఎంయూలో కోర్సులు, ప్రవేశ ప్రక్రియ వివరాలు...
ఐఎంయూకు కొచ్చి, చెన్నై, కోల్‌కతా, ముంబై పోర్టు, నవీ ముంబై, విశాఖపట్నంల్లో క్యాంపస్‌లున్నాయి. ప్రధాన కేంద్రం చెన్నైలో ఉంది. అంతేకాకుండా ఐఎంయూకు 18 అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి.

ఎంబీఏ:
కోల్‌కతా, విశాఖపట్నం, కొచ్చిన్, చెన్నై క్యాంపస్‌లలో రెండేళ్ల వ్యవధిగల ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పొర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ కోర్సు అందుబాటులో ఉంది. అలాగే చెన్నై, కొచ్చిన్ క్యాంపస్‌ల్లో పోర్ట్ అండ్ షిప్పింగ్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌తో ఎంబీఏలో ప్రవేశం కల్పిస్తోంది. ప్రస్తుతం 2020-2021 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (సెట్)లో ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు ఖరారు చేస్తారు.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.
సెట్ పరీక్ష విధానం: ఆన్‌లైన్ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (సెట్)ను 120 మార్కులకు నిర్వహిస్తారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, వెర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్‌పై ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్ మార్కులు లేవు.

డీఎన్‌ఎస్ ప్రోగ్రామ్ :
ఐఎంయూ అనుబంధ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఏడాది వ్యవధి గల డిప్లొమా ఇన్ నాటికల్ సైన్స్ (డీఎన్‌ఎస్) ప్రోగ్రామ్‌ను అందిస్తున్నారు.
అర్హత: ఇంటర్/ బీఎస్సీ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: 17-25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు వయోసడలింపు లభిస్తుంది.
ప్రవేశ పరీక్ష విధానం:ఆన్‌లైన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(సెట్), కౌన్సెలింగ్ ద్వారా డీఎన్‌ఎస్ పోగ్రామ్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, జనరల్ ఆప్టిట్యూడ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నపత్రం ఇంటర్ స్థాయిలో ఉంటుంది. నెగిటివ్ మార్కులు ఉండవు.

అనుబంధ ఇన్‌స్టిట్యూట్‌లు..
  1. ఆంగ్లో ఈస్ట్రన్ మారిటైమ్ అకాడెమీ-ముంబై
  2. అప్లయిడ్ రీసెర్చ్ ఇంటర్నేషనల్-న్యూఢిల్లీ
  3. ఇంటర్నేషనల్ మారిటైమ్ యూనివర్సిటీ-న్యూఢిల్లీ
  4. మారిటైమ్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎస్‌సీఐ)-ముంబై
  5. సముద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్-ముంబై
  6. ది గ్రేట్ ఈస్ట్రన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మారిటైమ్ స్టడీస్-ముంబై
  7. ట్రైనింగ్ షిప్ రెహమాన్-ముంబై.

ఐఎంయూ అందించే ఇతర కోర్సులు :
ఐఎమ్‌యూ క్యాంపస్‌లతోపాటు అనుబంధ ఇన్‌స్టిట్యూట్స్‌లో అందుబాటులో ఉన్న ఇతర కోర్సులు..
  • అండర్ గ్రాడ్యుయేషన్: బీటెక్-మారిటైమ్ ఇంజనీరింగ్, బీటెక్- నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, బీఎస్సీ నాటికల్ సైన్స్, బీబీఏ- లాజిస్టిక్స్, రిటైలింగ్ అండ్ ఈ-కామర్స్, బీఎస్సీ- షిప్ బిల్డింగ్ అండ్ రిపేరింగ్.
  • పోస్టు గ్రాడ్యుయేషన్: ఎంటెక్- మెరైన్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ఎంటెక్- నేవల్ ఆర్కిటెక్చర్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, ఎంటెక్- డ్రెడ్జింగ్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్, ఎంఎస్సీ- కమర్షియల్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్.
  • డిప్లొమా కోర్సు: ఏడాది వ్యవధి గల గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మెరైన్ ఇంజనీరింగ్ (పీజీడీఎంఈ) కోర్సును ఆఫర్ చేస్తున్నారు. ఏటా జనవరిలో ఈ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు.
  • రీసెర్చ్ ప్రోగ్రామ్: పీహెచ్‌డీ, ఎంఎస్(రీసెర్చ్).

ముఖ్యతేదీలు :
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 10, 2019.
దరఖాస్తుకు చివరి తేదీ: డిసెంబర్ 13, 2019.
హాల్‌టిక్కెట్ల జారీ ప్రారంభం: డిసెంబర్ 20, 2019
సెట్ పరీక్ష తేదీ: జనవరి 4, 2020.
ఫలితాల వెల్లడి: జనవరి 10, 2020.
తరగతులు ప్రారంభం: ఆగస్టు 3, 2020.
దరఖాస్తు ఫీజు: రూ.1000, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు రూ.700.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: హైదరాబాద్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.imu.edu.in
Published date : 27 Nov 2019 12:00PM

Photo Stories