Skip to main content

ఐబీపీఎస్‌–1167 పీవో/ఎంటీ పోస్టులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబీపీఎస్‌)..2021–22 సంవత్సరానికి వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్స్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1167

పాల్గొనే బ్యాంకులు..

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్, ఇండియన్‌ ఒవర్‌సీస్‌ బ్యాంక్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.

విద్యార్హత..

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు..

01.08.2020 నాటికి 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు లభిస్తుంది.

ఎంపిక విధానం..

  1.  ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
  2.  ప్రిలిమినరీ పరీక్ష.. ఆన్‌లైన్‌ విధానంలో 100 ప్రశ్నలు–100 మార్కులకు ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రిలిమినరీ జరుగుతుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.
  3.  మెయిన్‌ పరీక్ష.. ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో 155 ప్రశ్నలు–200 మార్కులకు జరుగుతుంది. ఇందులో రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌ 45 ప్రశ్నలు–60 మార్కులు; జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు; ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు–40 మార్కులు; డేటా అనాలసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. దీంతోపాటు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(లెటర్‌ రైటింగ్, ఎస్సే)పై జరిగే పరీక్షలో 2 ప్రశ్నలు 25 మార్కులకు ఉంటాయి. మొత్తం పరీక్ష సమయం మూడున్నర గంటలు.
  4.  ప్రిలిమినరీ, మెయిన్‌లో ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
  5.  మెయిన్‌లోనూ ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. ఆన్‌లైన్‌ మెయిన్‌ పరీక్ష, ఇంటర్వ్యూలకు తుది ఎంపికలో 80:20 నిష్పత్తిలో వెయిటేజీ లభిస్తుంది.

ముఖ్య సమాచారం..

  1.  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో
  2.  దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ అభ్య ర్థులకు రూ.175, మిగతా అభ్యర్థులకు రూ.850
  3.  దరఖాస్తులకు చివరి తేది: 26.08.2020
  4.  ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 03.10.2020, 10.10.2020, 11.10.2020
  5.  మెయిన్‌ పరీక్ష తేదీలు: 28.11.2020
  6.  ఇంటర్వ్యూలు: జనవరి/ఫిబ్రవరి 2021
  7.  పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.ibps.in/
Published date : 11 Aug 2020 04:03PM

Photo Stories